పోవడమే తప్ప రావడం లేదాయె…?
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుంది. అంటే పాలనలో సగం సమయం పూర్తయింది. అయితే ఈ రెండున్నరేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అంత [more]
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుంది. అంటే పాలనలో సగం సమయం పూర్తయింది. అయితే ఈ రెండున్నరేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అంత [more]
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుంది. అంటే పాలనలో సగం సమయం పూర్తయింది. అయితే ఈ రెండున్నరేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అంత తీవ్రంగా లేకపోయినా కొద్దో గొప్పో ఉంది. ఇసుక కొరత, మద్యం బ్రాండ్లు, రోడ్ల దుస్థితి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోవడం, సంక్షేమ పథకాలను పంచిపెడుతూ అభివృద్ధి లేకపోవడంతో వివిధ వర్గాలు జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నాయి. అయినా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ క్యాష్ చేసుకోలేకపోతుంది.
ఆరోజు ఎలాగో?
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఎలా ఉందో అలాగే ఉంది. చంద్రబాబు ఎంత చెప్పినా నేతలు బయటకు రావడం లేదు. నిరుద్యోగ సమస్యపైన చలో సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమానికి పిలుపు నిచ్చినా వామపక్ష పార్టీనేతలే ఎక్కువగా కన్పించారు. కానీ టీడీపీ నేతలు పెద్దగా బయటకు రాలేదు. ఎప్పుడూ పార్టీలో యాక్టివ్ గా ఉండేవారే ఈ కార్యక్రమానికి కూడా వచ్చారు. దీనిపై చంద్రబాబు ఒకింత సీరియస్ అయ్యారని తెలిసింది.
నేతలు సైలెంట్….
పార్టీ అధినేతగా చంద్రబాబు పిలుపునిచ్చిన కార్యక్రమాలు కూడా విజయవంతం కాకపోతే ఇక ఎలా అని ప్రశ్న తలెత్తుతోంది. జగన్ ప్రభుత్వం అక్రమ కేసులకు భయపడి రాలేదని చెబుతున్నా ఇంకా ఎన్నాళ్లు ఇలా? అన్నది అర్థం కాకుండా ఉంది. యువతతో తలపెట్టిన కార్యక్రమానికి కూడా నేతల సహకారం అందకపోతే పార్టీ ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతుంది. దీనిపై చంద్రబాబు త్వరలోనే 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేశమవ్వాలని నిర్ణయించారు.
రెండున్నరేళ్లు కావస్తున్నా….?
మరోవైపు రెండున్నరేళ్లు కావస్తున్నా పార్టీలో చేరికలు లేకపోవడం కూడా ఆందోళన కల్గిస్తుంది. చేరికలు లేకపోవడం పక్కన పెడితే ఉన్న నేతలు కూడా వెళ్లిపోవడం మరింత పార్టీని డ్యామేజీ చేసే విధంగా ఉంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా తర్వాత చంద్రబాబు కొంత ఆలోచనలో పడ్డారని తెలిసింది. ముఖ్యంగా బలమైన ఉత్తరాంధ్ర నేతలు ఇక ఎవరూ చేజారిపోకుండా వారికి అవసరమైన అన్ని రకాలు సాయం చేయాలని నిర్ణయించారట. మొత్తం మీద ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లవుతున్నా చేరికలు లేకపోగా, ఉన్నవాళ్లు వెళ్లిపోవడం చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే విషయమే.