బ్రీఫ్డ్ మీ… మళ్ళీ మళ్ళీ… ?
చంద్రబాబు అనగానే కొన్ని గుర్తుకువస్తాయి. అందులో ఓటుకు నోటు కేసు దాంతో పాటే ఆ రోజుల్లో టీవీల్లో విరివిగా చూపించిన బ్రీఫ్డ్ మీ అంటూ వచ్చే ఒక [more]
చంద్రబాబు అనగానే కొన్ని గుర్తుకువస్తాయి. అందులో ఓటుకు నోటు కేసు దాంతో పాటే ఆ రోజుల్లో టీవీల్లో విరివిగా చూపించిన బ్రీఫ్డ్ మీ అంటూ వచ్చే ఒక [more]
చంద్రబాబు అనగానే కొన్ని గుర్తుకువస్తాయి. అందులో ఓటుకు నోటు కేసు దాంతో పాటే ఆ రోజుల్లో టీవీల్లో విరివిగా చూపించిన బ్రీఫ్డ్ మీ అంటూ వచ్చే ఒక వీడియో క్లిప్ కూడా జనాలకు గుర్తుకు వస్తుంది. రాకపోయినా వైసీపీ తన చానల్ లో అది ఎప్పటికపుడు చూపిస్తూ వస్తోంది కూడా. ఇదిలా ఉండగా ఓటుకు నోటు తో ఎంత అల్లరి జరిగింది. ఎలా చంద్రబాబు ఉమ్మడి రాజధాని వదులుకుని ఏపీకి వచ్చేశారు అన్నది తెలిసిందే. అయినా కూడా చంద్రబాబు మళ్ళీ బ్రీఫ్డ్ మీ అంటున్నారా. ఆయన ఇపుడు ఏపీ సర్కార్ ని అస్థిరపరచడానికి కుట్రలు పన్నారా. అంటే ఏపీ సీఐడి విభాగం అదే నిజమని ఆధారాలు చూపిస్తోంది.
సంచలనాలే…?
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇంతలా తెగించి సొంత పార్టీ మీద పోరాడుతున్నాడు అంటేనే ఆయన వెనక టీడీపీ ఉంది అన్న అనుమానాలు వైసీపీ వ్యక్తం చేస్తూ వచ్చేది. ఇపుడు అవన్నీ నిజాలు అని సీఐడీ నిరూపించే ప్రయత్నం చేస్తోంది. రఘురామ ఫోన్ ఆధారంగా మొత్తం గుట్టును రట్టు చేసేందుకు సిద్ధమైంది. ఇక సీఐడీ సేకరించిన ఆధారాలలో పలు సంచలనాత్మకమైన విశేషాలు ఉన్నాయి. చంద్రబాబుతో రఘురామ జరిపిన వాట్సప్ సంభాషణలు కూడా ఉన్నాయి. అలాగే లోకేష్ కూడా మాట్లాడిన ఎన్నో కీలకమైన విషయాలు ఉన్నాయి. ఇక జగన్ బెయిల్ రద్దు చేయమంటూ వేసిన పిటిషన్ ను చంద్రబాబుకు రఘురామ చూపించి ఆయన సలహాలు తీసుకున్నట్లుగా సీఐడీ ఆరోపిస్తోంది.
ఇంత జరిగినా…?
చంద్రబాబు ఓటుకు నోటు కేసు విషయంలో బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే. బాబు ఈ రోజుకు ఆ కేసు పేరు వింటే హడలిపోతారు. ఈ విషయం తెలిసిన వారు ఏమనుకుంటారు. బాబు నాడు చేసిన తప్పు మళ్ళీ చేయరనే కదా. కానీ చంద్రబాబు మళ్ళీ ఇపుడు మరో రేవంత్ మాదిరిగా రఘురామను ఉపయోగించుకుని జగన్ సర్కార్ ని కూలదోయడానికి కుటిల యత్నం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అంటే నాడు కేసీయార్ సర్కార్ విషయంలో ఎదుర్కొన్న ఆరోపణలే చంద్రబాబు మళ్లీ ఫేస్ చేస్తున్నారు అన్న మాట. మరి ఆరేళ్ళ క్రితం నాటి చేదు అనుభవాలు చెప్పిన గుణపాఠాలు ఏమయ్యాయి బాబూ అంటే జవాబు ఉండదేమో అనుకోవాలి.
ఆసక్తికరమే…?
ఈ విధంగా సంపూర్ణమైన వివరాలతో సుప్రీం కోర్టులో సీఐడి అఫిడవిట్ దాఖలు చేసింది. మరి దీని మీద ఏ రకంగా వాదోపవాదాలు జరుగుతాయి. ఏ రకంగా దీని మీద తీర్పు వస్తుంది అన్నది మాత్రం ఆసక్తికరమే అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ సీఐడి సాధించిన విజయం ఏంటి అంటే రఘురామ, చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా మధ్యన గాఢమైన బంధం ఉందన్న సంగతిని లోకానికి చాటిచెప్పింది. ఇక మీదట జరిగే విషయాలు ఎంతవరకూ వైసీపీకి అనుకూలంగా ఉంటాయి, ఎంతవరకూ ప్రతికూలంగా ఉంటాయి అన్నది వేచి చూడాల్సిందే.