మళ్లీ బయలుదేరుతున్నాడట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రానున్న ఎన్నికలు సవాల్ అనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తేడా కొడితే అది పార్టీ మనుగడకే ఇబ్బందిగా మారనుంది. జగన్ ను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రానున్న ఎన్నికలు సవాల్ అనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తేడా కొడితే అది పార్టీ మనుగడకే ఇబ్బందిగా మారనుంది. జగన్ ను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రానున్న ఎన్నికలు సవాల్ అనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తేడా కొడితే అది పార్టీ మనుగడకే ఇబ్బందిగా మారనుంది. జగన్ ను ఈసారి ఎన్నికల్లో ఎదుర్కొనడం అంత సులువు కాదని చంద్రబాబుకు తెలియంది కాదు. నిత్యం ప్రజల్లో ఉంటేనే బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇక కరోనా తగ్గుముఖం పడుతుండటంతో జిల్లా పర్యటనలకు చంద్రబాబు ప్లాన్ చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
దాదాపు రెండేళ్లు….
అధికారం కోల్పోయిన రెండేళ్ల పాటు ప్రజలకు కరోనా కారణంగా దూరంగా ఉండాల్సి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లినా అప్పుడు స్థానిక నేతలతో మనసు విప్పి చంద్రబాబు మాట్లాడలేకపోయారు. జూమ్ యాప్ ద్వారా తరచూ మాట్లాడుతున్నా వారు సమస్యలు నేరుగా అధినేతకుచెప్పుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబు జిల్లా పర్యటనల్లో స్థానిక నేతల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
రెండు రోజుల పాటు….
జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు చంద్రబాబు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకరోజంతా నియోజకవర్గ నేతలతో విడివిడిగా సమావేశం కావాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలోని ఇన్ ఛార్జితో మాత్రమే కాకుండా అక్కడ ఉండే ముఖ్యమైన నేతలతో సమావేశమై క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని, బలం, బలహీనతలను తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి గంట సేపు సమయం కేటాయించే అవకాశముంది.
స్థానిక సమస్యలపై….?
ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే చంద్రబాబు జిల్లాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. నాయకత్వ లోపమే ఎక్కువగా కన్పిస్తుంది. అందుకే బలంగా ఉన్న ప్రాంతం నుంచే చంద్రబాబు జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీ సమావేశాలతో పాటు ఒక రోజు స్థానికంగా ఉండే సమస్యలపై కూడా చంద్రబాబు ఆందోళన చేసేందుకు పార్టీ నేతలు ప్లాన్ చేస్తునట్లు సమాచారం.