బాబువి ఉత్త మాటలే… అంత ధైర్యం చేస్తారా ?
చంద్రబాబు వ్యవహార శైలి తెలిసిన వారు ఎవరూ ఆయన విషయంలో కొన్నిటిని నమ్మరు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో రాజీనామా అన్న పదానికి కడు దూరం. ఆయన [more]
చంద్రబాబు వ్యవహార శైలి తెలిసిన వారు ఎవరూ ఆయన విషయంలో కొన్నిటిని నమ్మరు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో రాజీనామా అన్న పదానికి కడు దూరం. ఆయన [more]
చంద్రబాబు వ్యవహార శైలి తెలిసిన వారు ఎవరూ ఆయన విషయంలో కొన్నిటిని నమ్మరు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో రాజీనామా అన్న పదానికి కడు దూరం. ఆయన తన వారిని వేరే పార్టీలోకి పంపించారు అంటారు. వారు కూడా అక్కడ రాజీనామా చేయరు. ఇక బాబు ఇతర పార్టీల నుంచి చాలా మందిని తన పార్టీలోకి లాగేశారు. వారి రాజీనామాలను కూడా ఆయన అసలు కోరారు. ఇది తెలుసుకోవాలంటే ఎంతో దూరం వెళ్ళనక్కరలేదు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉంది. ఆనాడు ఆయన వైసీపీ నుంచి 23 మందిని తన వైపు లాగేసుకున్నారు. అలాగే కొందరు ఎంపీలను కూడా తన వైపు తిప్పుకున్నారు.
ఎవరి చేత రాజీనామాలను…?
చిత్రమేంటి అంటే వీరెవరి చేత చంద్రబాబు అసలు రాజీనామా చేయించలేదు. పైగా ఆయన ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన నలుగురిని తీసుకువచ్చి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చేశారు. అలాగే ఆయన శాసనమండలిలో బలం పెంచుకోవడం కోసం నాడు కాంగ్రెస్ నుంచి కూడా కొంతమందిని తీసుకువచ్చి కండువాలు కప్పేశారు. వారు కూడా రాజీనామాలు చేయలేదు. దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏంటి అంటే రాజీనామాలకు చంద్రబాబు కడు దూరమనే కదా.
ఉత్తమాటలేనా?
అలాంటి చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం రాజీనామా చేస్తాను అంటున్నారు. అయితే కండిషన్లు అప్లై అని కూడా ఆయన అంటున్నారు. అదెలా అంటే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే తమ పార్టీ వారు చేస్తారట. మరి వైసీపీకి రాజీనామాలు చేసిన ట్రాక్ రికార్డు ఉంది. ప్రత్యేక హోదా కోసం వారు అప్పట్లో చేశారు. అంతకు ముందు కూడా జగన్ తో మొదలుపెడితే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఎన్నికలను ఎదుర్కొన్నారు. అసలు వైసీపీ పుట్టుకే రాజీనామాలతో ప్రారంభమైంది. జగన్, ఆయన తల్లి విజయలక్ష్మి ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీ నుంచి పోటీ చేశారు.
ఆ డిమాండ్ ను…..
ఇక 2012 ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ అప్రతిహత విజయంతో ఏకంగా 16 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ శిల్పా చక్రపాణి రెడ్డిని ఎమ్మెల్సీకి రాజీనామా చేయమని మరీ పార్టీలోకి తీసుకున్నారు. ఈ విషయంలో జగన్ ఏ మాత్రం రాజీపడట్లేదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా టీడీపీ ఎమ్మెల్సీలను తన పార్టీలో చేర్చుకున్నారు. వారి పదవులకు రాజీనామాలు చేయించి.. తిరిగి తమ పార్టీ నుంచే వాళ్లను ఎమ్మెల్సీలను చేశారు. ఈ ట్రాక్ రికార్డు చూసి వైసీపీని రాజీనామాలు చేయమని చంద్రబాబు డిమాండ్ చేసే పరిస్థితి ఉందా అన్నదే చర్చ.
వత్తిడి కోసమేనా?
ఏదేమైనా చాలా కీలకమైన విషయాల్లో మౌనం పాటిస్తూ కొన్నింటిలో మాత్రం రాజకీయ వ్యూహాల కోసం వైసీపీని ఇరుకునపెట్టడానికే చంద్రబాబు ఇలా డిమాండ్లు చేస్తున్నారు అంటున్నారు. ఇదిలా ఉంటే రాజీనామాలు చేస్తే ఏమొస్తుంది అని ఒకనాడు ఇదే చంద్రబాబు తెలుగుదేశం నాయకులు ప్రత్యేక హోదా మీద వైసీపీని ప్రశ్నించిన సంగతి విదితమే. మొత్తానికి చంద్రబాబు రాజీనామా కూడా ఒక వ్యూహం తప్ప మరేం కాదు.. అంత ధైర్యం కూడా ఆయనకు లేదనే చెప్పాలి.