నమ్మించాల్సిన అవసరం బాబుదే
చంద్రబాబుని జగన్ ని సరిపోల్చుకోవడం అన్నది ఏపీ రాజకీయాలో పరిపాటే. అది తటస్థుల నుంచి మేధావుల నుంచి మొదలుపెడితే రెండు పార్టీలలో ఉన్న క్యాడర్ కూడా ఎప్పటికపుడు [more]
చంద్రబాబుని జగన్ ని సరిపోల్చుకోవడం అన్నది ఏపీ రాజకీయాలో పరిపాటే. అది తటస్థుల నుంచి మేధావుల నుంచి మొదలుపెడితే రెండు పార్టీలలో ఉన్న క్యాడర్ కూడా ఎప్పటికపుడు [more]
చంద్రబాబుని జగన్ ని సరిపోల్చుకోవడం అన్నది ఏపీ రాజకీయాలో పరిపాటే. అది తటస్థుల నుంచి మేధావుల నుంచి మొదలుపెడితే రెండు పార్టీలలో ఉన్న క్యాడర్ కూడా ఎప్పటికపుడు చర్చిస్తూనే ఉంటారు. తాజాగా జగన్ పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు కార్యకర్తలకు పంచేశారు. దీని వల్ల ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. వారంతా ఇన్నాళ్ళకు తన నాయకుడు న్యాయం చేశారు అని పొంగిపోతున్నారు. అదే సమయంలో వారిని చూసి టీడీపీలోని నాయకులు పూర్తిగా అసూయ చెందుతున్నాయి. ఎందుకంటే వైసిపీ వారికంటే ఎక్కువ ఏళ్ళు టీడీపీ జెండా మోసిన కష్టం వారిది.
ఊరించి అలా….?
చంద్రబాబు 2004లో అధికారం కోల్పోయారు. దానికి ముందు ఉమ్మడి ఏపీలో కూడా ఆయన ఎపుడూ నామినేటెడ్ పదవులు దండీగా ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే చాలా వరకూ నయం అనిపించుకున్నారు. ఇక ఆ తరువాత పదేళ్ళ పాటు టీడీపీ పవర్ లో లేదు. దాంతో అధికారంలోకి పార్టీని తీసుకురండి, మీ బాగోగులు నేను చూసుకుంటాను అని చంద్రబాబు పదే పదే క్యాడర్ కి చెప్పేవారు. దాంతో వారంతా కసితో పనిచేసి 2014 ఎన్నికల్లో టీడీపీకి అధికారం అందించారు. కానీ వారికి మాత్రం ఈ రోజుకీ న్యాయం జరగలేదు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. నామినేటెడ్ పదవులు అంటూ ఊరించడమే తప్ప ఇచ్చిన పాపాన హై కమాండ్ ఏ రోజూ పోలేదు అని వారే చెబుతున్నారిపుడు.
ఆ లక్ లేదుగా ..?
ముఖ్యంగా విశాఖ విషయానికి వస్తే ఉడాను స్థాయిని పెంచి వీఎమ్మార్డీయే గా చేసిన ఘనత చంద్రబాబుది. అయిదు జిల్లాలకు విస్తరించి చైర్మన్ పోస్టుకు క్యాబినేట్ హోదాను ఇచ్చారు. దానికి ఫస్ట్ చైర్మన్ గా టీడీపీ వారే ఉంటారు అనుకుంటే మాత్రం చంద్రబాబు తాత్సారం చేస్తూ వచ్చారు. చివరికి 2019 ఎన్నికల్లో అధికారం పోవడంతో ఆశావహులు అంతా నిండా మునిగామనుకుని దుప్పటి కప్పేసుకున్నారు. ఇక వైసీపీ ఇలా అధికారంలోకి వచ్చింది ఫస్ట్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే దివంగత ద్రోణం రాజు శ్రీనివాస్ ని నియమించారు. అలా క్రెడిట్ వైసీపీ కొట్టేసింది. ఇపుడు రెండో సారి కూడా ఆ పదవిని జగన్ అక్రమాని విజయనిర్మలతో భర్తీ చేశారు. తొందరలోనే పూర్తి బోర్డుని కూడా నియమించనున్నారు.
ఇన్నేసి పదవులా ..?
టీడీపీలో ఇపుడు ఒక్కటే మాట ఉంది. నామినేటెడ్ పదవులు అంటే ఏమో అనుకున్నాం, కానీ ఇన్నేసి పదవులు ఉంటాయని మాకే తెలియదు. మా నాయకులు కూడా ఎపుడూ చెప్పలేదు అంటూ తెగ వాపోతున్నారు. విశాఖ జిల్లా వైసీపీకి రాష్ట్ర స్థాయి పదవులు అరడజన్ దాకా తగ్గాయి. ఇక జిల్లా స్థాయిలోనూ ప్రతిష్టాత్మకమైన పదవులు ఎన్నో వరించాయి. అలాగే చంద్రబాబు హయాంలో ఖాళీగా ఉంచిన సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ కార్యవర్గాన్ని కూడా జగన్ వస్తూనే భర్తీ చేశారు. ఇలా వైసీపీలో ఆ మాత్రం పేరున్న నాయకులకు పూర్తి న్యాయం జరిగింది. దీంతో టీడీపీలో అయితే ఆవేదన విశాఖ సముద్రమంతలా ఉందిపుడు. మేము జనంలో ఉండి పోరాడితే నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. మాకు మాత్రం గుండు సున్నా చూపించారు అని మండిపోతున్నారు. జగన్ ఇచ్చిన ఈ నామినేటెడ్ షాక్ తో వారు టీడీపీ పెద్దల మీద గుర్రుమంటున్నారు. ఇదే సీన్ కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వారు సరిగ్గా పనిచేస్తారా. ఇక మళ్ళీ చంద్రబాబు సహా టీడీపీ నాయకులు పార్టీ పవర్ లోకి వస్తే నామినేటెడ్ పదవులు అన్నీ మీకే అని చెప్పినా నమ్ముతారా. చూడాల్సిందే.