ఆగస్టు సంక్షోభం టీడీపీకి తప్పదా?
తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పేట్లు లేదు. ఎన్టీ రామారావు హయాం నుంచే ఆగస్టు సంక్షోభం పార్టీలో తలెత్తుతూ వస్తుంది. ఆగస్టు నెల వస్తుందంటేనే తెలుగుదేశం పార్టీ [more]
తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పేట్లు లేదు. ఎన్టీ రామారావు హయాం నుంచే ఆగస్టు సంక్షోభం పార్టీలో తలెత్తుతూ వస్తుంది. ఆగస్టు నెల వస్తుందంటేనే తెలుగుదేశం పార్టీ [more]
తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పేట్లు లేదు. ఎన్టీ రామారావు హయాం నుంచే ఆగస్టు సంక్షోభం పార్టీలో తలెత్తుతూ వస్తుంది. ఆగస్టు నెల వస్తుందంటేనే తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో భయం మొదలవుతుంది. తాజాగా ఆగస్టు నెలలోనే పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం పార్టీని ఇరకాటంలో పడేసింది. తెలుగుదేశం పార్టీకి సంప్రదాయంగా వస్తున్న ఆగస్టు సంక్షోభం మరోసారి తెరపైకి వచ్చింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా…..
తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పూర్తిగా నిస్తేజంలోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే పార్టీ కోలుకుంటుందన్న అంచనాలు వచ్చాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైఖరి కూడా ఏమాత్రం మారలేదు. సీనియర్ నేతలకు ఇవ్వాల్సిన గౌరవం దక్కడం లేదు. విపక్షంలో ఉన్నా ఆయన అపాయింట్ మెంట్లు దక్కకపోవడంపై సీనియర్ నేతలు అనేక మంది గుర్రుగా ఉన్నారు.
గ్రిప్ లేకపోవడంతో…..
గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం కూడా ముదిరి పాకాన పడింది ఇందుకే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వయం ప్రకాశిత నేత కాదు. ఆయన లౌక్యంతో, చాణక్యంతో పార్టీని ఇంతకాలం నెట్టుకొచ్చారు. ఇమేజ్, క్రేజ్ లేకపోయినా చంద్రబాబు సమర్థతతో పార్టీని మూడు సార్లు అధికారంలోకి తేగలిగారు. కానీ పార్టీ నేతల మీద ఆయనకు గ్రిప్ లేదన్నది వాస్తవం. అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఎవరినీ కలిసేవారు కాదని, కేవలం అధికారుల మీదనే ఆధారపడే వారన్న ఆరోపణలున్నాయి.
ఇంకా అనేక మంది సీనియర్లు…..
గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతున్న దాని ప్రకారం అనేక మంది సీనియర్ నేతలు చంద్రబాబు వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారని తెలిసింది. క్రైసిస్ సమయంలోనూ నిర్ణయాలను వేగంగా తీసుకోలేకపోవడం, సమస్యను నానుస్తూ ఉండటంతోనే పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు సమర్థుడైన నాయకుడే కాని, పార్టీ నేతలకు అందుబాటులో లేకపోవడంతోనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో మరోసారి ఆగస్టు సంక్షోభం వార్తల్లోకి వచ్చింది.