మీ బ్రెయిన్ చాలా షార్ప్…!
ఏపీలో ప్రభుత్వం తాజాగా వరుస పెట్టి విడుదల చేస్తున్న మొత్తం 9 అంశాలకు సంబంధించిన 9 శ్వేత పత్రాలు కూడా పరనిందలతో ప్రారంభమై.. స్వోత్కర్షలతో ముగిసిపోతున్నాయన్న విశ్లేషణల [more]
ఏపీలో ప్రభుత్వం తాజాగా వరుస పెట్టి విడుదల చేస్తున్న మొత్తం 9 అంశాలకు సంబంధించిన 9 శ్వేత పత్రాలు కూడా పరనిందలతో ప్రారంభమై.. స్వోత్కర్షలతో ముగిసిపోతున్నాయన్న విశ్లేషణల [more]
ఏపీలో ప్రభుత్వం తాజాగా వరుస పెట్టి విడుదల చేస్తున్న మొత్తం 9 అంశాలకు సంబంధించిన 9 శ్వేత పత్రాలు కూడా పరనిందలతో ప్రారంభమై.. స్వోత్కర్షలతో ముగిసిపోతున్నాయన్న విశ్లేషణల అంచనాలకు ఏ మాత్రమూ తగ్గడం లేదు. నిజానికి శ్వేత పత్రం అంటే.. ప్రభుత్వ పాలనకు సంబంధించిన పారదర్శక పత్రంగా గతంలో చేసిన ముఖ్యమంత్రులు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వ పాలన తెలుసుకునే విషయం హక్కుగా దఖలు పడిననేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు, ప్రభుత్వ నిర్ణయాలకు మధ్య ఉన్న తేడాను వివరిస్తూ.. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరు వచేసే క్రమంలోనే శ్వేతపత్రాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే బాట పట్టారు. ఆయన దాదాపు 9 అంశాలపై(వాస్తవానికి ముందు 10 అంశాలు అన్నారు) శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారు.
వాటిని పక్కనపెట్టి….
ఇప్పటి కే ఐదు విడుదల కూడా అయ్యాయి. అయితే, ఆ పత్రాలనూ పరిశీలించిన రాజకీయ మేధావులు సహా విశ్లేషకులు చెబుతున్నది.. ఈ పత్రాలు శ్వేత పత్రాలు కావు.. స్వోత్కర్ష పత్రాలు అని! నాలుగున్నరేళ్లలో జరిగిన పరిణామాల గురించి వాస్తవాలు చెబుతున్నానంటూనే బీజేపీతో కేంద్రంలో నాలుగున్నరేళ్లు కలిసి కాపురం చేయడం, ప్రత్యేక హో దా వద్దని దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించడం, ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధానికి అభినందనలు, సన్మానాలు చేసిన విషయాలను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తెరమరుగు చేసే ప్రయత్నం చేశారు. తానే మొదటి నుంచి హోదా కోసం పోరాటం చేశానని ఎలాంటి సంశయం లేకుండా శ్వేతపత్రంలో పేర్కొనడం విస్తుగొలుపుతోంది. వాస్తవానికి ఏపీ పాలనలో ఆది నుంచి కూడా చాలా తప్పులు జరిగాయి.
అన్నీ బీజేపీ ఖాతాలోనే….
రాజధాని రైతులు రోడ్డెక్కడం, ఉన్నట్టుండి హైదరాబాద్కు సీఎం తరలిరావడం, కాల్వ గట్టునే ఉండి పాలన ప్రారం భిం చడం వంటి అంశాలను ఉద్దేశ పూర్వకంగానే తెరమరుగు చేసి.. తప్పుల్ని బీజేపీ ఖాతాలో వేసి చూపడం, వైసీపీ, కేసీఆర్, జనసేన కలిసి తమపై కుట్ర చేస్తున్నారని చూపడం ఈ శ్వేతపత్రం సారాంశం. నాలుగేళ్లపాటు కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను చంద్రబాబు కావాలని దాట వేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకుని అధికారాన్ని అనుభవిస్తూ ఏనాడూ ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని చంద్రబాబు అడగలేదు. తరచూ ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎంతసేపూ నియోజకవర్గాల పెంపు గురించి, జగన్ కేసుల గురించే ఎక్కువగా ప్రస్తావించారని కేంద్రంలోని కొందరు అధికారులు కూడా ఆఫ్ది రికార్డుగా అప్పట్లో వెల్లడించారు.
ఉపయోగపడతాయా…?
మరి ఆయా విషయా లను ఉద్దేశ పూర్వకంగానే బాబు తాజా శ్వేత పత్రంలో ఉపసంహరించారని తెలుస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా.. ఎన్నికల సమయంలో ప్రజలలో తాను స్వచ్ఛమైననాయకుడినని, మిగిలిన వారంతా దొంగలని చిత్రీకరించడంలోను, ఏపీలో తాను లేక పోతే.. అభివృద్ధి ఆగిపోతుందని చెప్పడంలోనూ చంద్రబాబు సక్సెస్ అయ్యారా? లేదా? అని ఇప్పటికిప్పుడే తెలియకున్నా… అధికారులు సయితం ఈ లెక్కలు, పత్రాలనుచూసి విస్తుపోతున్నారట. కొందరు టీడీపీ నేతలే ఈ పత్రాల వల్ల ఉపయోగముంటుందా? అన్న అనుమానం వ్యక్తంచేస్తుండటం విశేషం.
- Tags
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- white papers
- y.s. jaganmohan reddy
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- à°µà±.à°à°¸à±. à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
- à°¶à±à°µà±à°¤à°ªà°¤à±à°°à°¾à°²à±