బాబు వ్యూహం అంచనాలకు అందడం లేదే..?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలు ఎవరి అంచనాలకూ అందవు. ఆయన నిర్ణయాలు ప్రత్యర్థులు అర్థం చేసుకోవాలంటే కష్టమే. తాజాగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ నిర్ణయం [more]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలు ఎవరి అంచనాలకూ అందవు. ఆయన నిర్ణయాలు ప్రత్యర్థులు అర్థం చేసుకోవాలంటే కష్టమే. తాజాగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ నిర్ణయం [more]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలు ఎవరి అంచనాలకూ అందవు. ఆయన నిర్ణయాలు ప్రత్యర్థులు అర్థం చేసుకోవాలంటే కష్టమే. తాజాగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ నిర్ణయం వెనుక కారణాలు ప్రత్యర్థులకే కాదు స్వంత పార్టీ నేతలకు సైతం పూర్తిగా అర్థం కావడం లేదంట. నిబంధనల ప్రకారం ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు. గెలిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. చట్ట ప్రకారమే ఈ అవకాశం ఉండటంతో సిట్టింగ్ ఎంపీ లేదా ఎమ్మెల్సీలు రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. అయితే, తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఉన్న అవకాశాన్ని వినియోగించుకోకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారు. జమ్మలమడుగు నుంచి పోటీ చేయనున్న రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.
వారికి సర్దుబాటు చేద్దామని
అయితే, ఉన్న అవకాశాన్ని వినియోగించుకోకుండా వీరు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలకు ముందే రాజీనామా చేయడం వెనుక చంద్రబాబు వ్యూహంతో పాటు భయం కూడా ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్సీల రాజీనామాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో మొదటిది… ఎలాగూ వీరికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తున్నందున ఎమ్మెల్సీలు ఖాళీ చేయిస్తే ఇతరులకు సర్దుబాటు చేయవచ్చనేది చంద్రబాబు ఆలోచనట. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీలో చేరిన చోట, పలు ఇతర నియోజకవర్గాల్లో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. మరికొందరికి ఇప్పటికే ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ఉన్నారు. ఇలా ఆశావహుల్లో కొందరిని ఎమ్మెల్సీలుగా అకామిడేట్ చేయవచ్చని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
ఎందుకైనా మంచిదనేనా..?
ఇక, మరో కారణం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయమే అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచి అధికారం చేపడుతుందనే అంచనాలు ఉన్నాయి. అన్ని సర్వేలూ అదే చెబుతున్నాయి. పైకి టీడీపీ అంగీకరించకున్నా.. లోపల మాత్రం ఆ అవకాశాన్ని కొట్టిపారేయడం లేనట్లు కనిపిస్తోంది. ఇకవేళ నిజంగానే వైసీపీ అధికారంలోకి వచ్చి… సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిస్తే వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు వైసీపీ బలాన్ని బట్టి వీరి రాజీనామాలతో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళతాయి. కాబట్టి ఈ ఆలోచనతోనే శాసనమండలిలో ఆధిక్యాన్ని కలిగి ఉండేందుకు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీలను రాజీనామా చేయించి మళ్లీ టీడీపీ వారినే ఎన్నుకుంటే మేలనేది టీడీపీ ఆలోచనలా ఉంది. అయితే, వీరిద్దరితో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. మరి, వారు కూడా రాజీనామా చేస్తారో లేదో చూడాలి.