ఆయన మారక పోతే.. వారు మారిపోతారు…!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో చెప్పడం కష్టం. నాయకులు ఎప్పటికప్పుడు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్నికల వేళ మరింతగా తమ బలాన్ని, బలగాన్ని ప్రదర్శించేందుకు [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో చెప్పడం కష్టం. నాయకులు ఎప్పటికప్పుడు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్నికల వేళ మరింతగా తమ బలాన్ని, బలగాన్ని ప్రదర్శించేందుకు [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో చెప్పడం కష్టం. నాయకులు ఎప్పటికప్పుడు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్నికల వేళ మరింతగా తమ బలాన్ని, బలగాన్ని ప్రదర్శించేందుకు కూడా రెడీ అవుతుంటారు. అయితే, ఆయా పరిస్థితులను బట్టి.. నాయకులు తమ పంథాలు మార్చుకుంటారనే విషయం తెలియంది కాదు..! ఇప్పుడు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఎదురు కానుంది. ప్రధానంగా మంది ఎక్కువ కావడంతో టీడీపీలో టికెట్ల గోల తెరమీదికి వస్తోంది. పైకి..మాత్రం ఇటు నాయకులు కానీ, అటు చంద్రబాబు కానీ.. టికెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదని అంటున్నా.. గంపకింద సెగలా అది రగులుతూనే ఉంది. ఆ జిల్లా ఈజిల్లా అనే పరిస్థితి లేకుండా నాయకులు టికెట్ల కోసం బాగానే పోటీ పడుతున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన నాయకుల విషయంలో ఈ పరిస్తితి మరింత గందరగోళంగా మారింది.
పైచేయి సాధించేందుకు…..
ఈ క్రమంలోనే టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా జరుగుతోంది. టికెట్లు ఆశిస్తున్న టీడీపీ నేతల్లోనే చీలికలు వచ్చాయి. నాకంటే ముందు ఎవరూ ఉండకూడదు అనే రేంజ్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ప్రధానంగా చంద్రబాబు ఇస్తున్న ఆదేశాలను పాటించడంలోనూ ఈ తరహా వెనుకబాటు కనిపించడానికి ఈ టికెట్ల రగడ కూడా కారణంగా కనిపిస్తోంది. నాయకులు ఎక్కడికక్కడ టికెట్లు తమకంటే తమకేనని చెప్పుకోవడం కాదు, వాటి కోసం ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో కేడర్ ను కూడాతమ అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, ఈ విషయం స్థానిక నాయకులు రెండుగా చీలిపోయి.. నేనంటే నేను సభ్యత్వాన్ని పెంచుతానని ప్రకటించారు.
అసంతృప్తుల సంఖ్య…..
దీంతో చివరికి చంద్రబాబు ఏ ఒక్క నాయకుడికి ఈ బాధ్యతలు అప్పగించకుండా వేరే వారిని రంగంలోకి దింపారు. అయినా కూడా స్థానిక నేతలు పట్టుబట్టి వారివారి బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించడంతో ఎక్కడికక్కడ సభ్యతం ఈసురోమంది. ఇదే తాజాగా చర్చకు కూడా వచ్చింది. ఇక, చంద్రబాబు పెడుతున్న టెలీ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులకు కూడా హాజరుకావడం లేదు. దీనికి కూడా ఆధిపత్య రాజకీయాలే సాగుతున్నాయి. దీంతో కేడర్ కూడా ఏ నేత వెంట వెళ్తే ఏమవుతుందోనని దూరంగానే ఉంటున్నారు. మరోపక్క అసంతృప్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. టికెట్ వస్తేనే పార్టీలో ఉంటామని, లేకుంటే.. వేరే పార్టీలోకి వెళ్లేందుకు కూడా వెనుకాడక పోగా తెర వెనుక ప్రయత్నాలు కూడా ప్రారంభించుకుంటున్నారు.
ముందే జాగ్రత్త పడాలని….
గత ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వీళ్లకు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్లకు ఎలా సీట్లు సర్దుబాటు చేస్తారన్నది క్లారిటీ లేదు. వీరిలో ఎవ్వరిని నొప్పించకుండా ఒప్పించడం సాధ్యం అయ్యే పని కాదు. మరి ఈ విషయాలపై సమాచారం ఉండి కూడా టికెట్లను ప్రకటించకుండా ఉంటేనే సరిపోతుందని అనుకోవడం మరింత ఇబ్బందిగా పరిణమిస్తోంది. మరి ఈ పరిస్థితిని సరిచేసుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం కనిపించడం లేదు. ఇది ఒక్కసారిగా పేలే అగ్ని పర్వతం మాదిరిగా పేలకముందే జాగ్రత్త పడడం మంచిదని సూచిస్తున్నారు.
- Tags
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- party leaders
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- పారà±à°à± à°¨à±à°¤à°²à±
- à°µà±.à°à°¸à±. à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±