రాధాను బాబు అలా ప్రయోగించారా?
చంద్రబాబు దృష్టి అంతా వచ్చే ఎన్నికలపైనే ఉంటుంది. ఆయన మనసంతా వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవడం? జగన్ ను ఎలా ఓడించడం అన్న దానిపైనే ఉంటుంది. ఇందుకు [more]
చంద్రబాబు దృష్టి అంతా వచ్చే ఎన్నికలపైనే ఉంటుంది. ఆయన మనసంతా వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవడం? జగన్ ను ఎలా ఓడించడం అన్న దానిపైనే ఉంటుంది. ఇందుకు [more]
చంద్రబాబు దృష్టి అంతా వచ్చే ఎన్నికలపైనే ఉంటుంది. ఆయన మనసంతా వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవడం? జగన్ ను ఎలా ఓడించడం అన్న దానిపైనే ఉంటుంది. ఇందుకు తగిన వ్యూహాలు కూడా ఆయన ఎప్పటికప్పుడు రచిస్తుంటారు. వచ్చే ఎన్నికలు చంద్రబాబు చివరి ఎన్నికలుగా చెప్పుకోవాలి. ఆయన వయసు ఇప్పటికే 70 దాటడంతో ఇప్పటికే కరోనాకు భయపడి ఆయన ప్రజల్లోకి రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఇప్పటినుంచి పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఒంటరి పోరు ఎప్పుడూ….
చంద్రబాబుకు ఒంటరి పోరు ఎప్పుడూ కలసి రాలేదు. పొత్తుతో వెళ్లినప్పుడే ఆయనకు గెలుపు అవకాశాలు లభించాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లిన చంద్రబాబుకు కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చాయి. గతంలో ఎన్నడూ చూడని దారుణ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దీంతో చంద్రబాబు ఇప్పటి నుంచి పొత్తులపై కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. జమిలి ఎన్నికలు కూడా వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు మరింత స్పీడ్ పెంచారంటున్నారు.
పవన్ తో పొత్తుకోసం…..
బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా చంద్రబాబుకు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండటంతో కొంత కలసి వస్తుందని అంశమే తప్ప ఓట్ల పరంగా పెద్దగా లాభం లేదన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ వచ్చే ఎన్నికల్లో జనసేన మద్దతు మాత్రం చంద్రబాబుకు అవసరం. పార్టీ క్యాడర్ ఉత్సాహంగా పనిచేయాలన్నా, అధిక స్థానాలను దక్కించుకోవాలన్నా పవన్ కల్యాణ్ ను తన జత చేర్చుకోవడమే బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నారు.
తొలి దశ చర్చలేనట…..
ఇందుకోసం వంగవీటి రాధాను ప్రాధమికంగా ప్రయోగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వంగవీటి రాధాతో ఇటీవల అమరావతి 365 రోజుల సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారట. పవన్ తో పొత్తుకు ప్రయత్నించాలని కోరారని చెబుతున్నారు. అందుకోసమే రాధా నేరుగా నాదెండ్ల మనోహర్ వద్దకు వెళ్లారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. నాదెండ్ల మనోహర్ సయితం టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారని, ఇక పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లడమే తరువాయి అన్న టాక్ బలంగా విన్పిస్తుంది. మొత్తం మీద చంద్రబాబు పవన్ తో సఖ్యతకు తొలివిడతగా వంగవీటి రాధాను ప్రయోగించారని చెబుతున్నారు.