వీళ్లు ముగ్గురుండగా బాబుకు కష్టమే
గతంలో ఉన్న బీజేపీ వేరు. ఇప్పుడున్న బీజేపీ నేతలు వేరు. అప్పుడు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకునే నేతలు. బాబుకు ఇబ్బంది కలగకుండా నడచుకునే లీడర్లు. దీంతో కొన్ని [more]
గతంలో ఉన్న బీజేపీ వేరు. ఇప్పుడున్న బీజేపీ నేతలు వేరు. అప్పుడు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకునే నేతలు. బాబుకు ఇబ్బంది కలగకుండా నడచుకునే లీడర్లు. దీంతో కొన్ని [more]
గతంలో ఉన్న బీజేపీ వేరు. ఇప్పుడున్న బీజేపీ నేతలు వేరు. అప్పుడు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకునే నేతలు. బాబుకు ఇబ్బంది కలగకుండా నడచుకునే లీడర్లు. దీంతో కొన్ని ఏళ్ల పాటు బీజేపీ నుంచి చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బందులు కలగ లేదు. పైగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతకు వారు ఉపయోగపడేవారు. కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్బీనారాయణ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు చంద్రబాబుకు ఇబ్బంది లేకుండా వ్యవహరించేవారు.
బాబుకు ముచ్చెమటలు పట్టిస్తూ….
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ముగ్గురు నేతలు చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నేతలు ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీపైన విరుచుకుపడుతున్నారు. తాను అనుచున్నది సజావుగా జరగకపోవడానికి ఈ ముగ్గురే కారణమని చంద్రబాబుకు తెలుసు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులు చంద్రబాబుకు పంటి కింద రాయిలా మారారు.
ప్రధాన టార్గెట్ బాబే….
ఇప్పుడు ఈ ముగ్గురు టార్గెట్ చంద్రబాబు కావడం విశేషం. ఒకవైపు అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే అన్ని రకాలుగా నష్టపోయి రాజకీయంగా ఇబ్బంది పడుతున్న చంద్రబాబును వారు వదలడ లేదు. చంద్రబాబు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని ఇటీవల సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అంటే ఆయన కాంగ్రెస్ పక్షమని సోము తేల్చేసినట్లే. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ఈ ముగ్గురు డిమాండ్ చేస్తున్నారు.
అడుగులు ముందుకు పడనివ్వకుండా…..
బీజేపీతో సఖ్యతగా మెలుగుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుందామన్నది చంద్రబాబు ప్రయత్నం. జనసేన కూడా బీజేపీతో ఉండటంతో తనకు కలసి వస్తుందనుకుంటున్నారు. అవసరమైతే ఎక్కువ స్థానాలు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే చంద్రబాబు ఆలోచనలను ఈ ముగ్గురు ముందుకు పడనీయడం లేదంటున్నారు. తన వాళ్లనుకున్న సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావులకు కూడా ప్రయారిటీ లేకపోవడంతో చంద్రబాబు బీజేపీ వైపు అడుగు ముందుకు పడటం లేదు. మొత్తం మీద ఈ ముగ్గురు నేతలున్నంత వరకూ చంద్రబాబును కమలం పార్టీకి దరి చేరనివ్వరన్న టాక్ టీడీపీలోనూ విన్పిస్తుండటం విశేషం.