అది చెవిరెడ్డికి మైనస్.. భూమనకు ప్లస్.. ఏం జరుగుతోందంటే?
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కొందరు నాయకులు మంచి ఊపుపై ఉన్నారు. మరికొందరు మాత్రం మదన పడుతున్నారు. దీనికి కారణం.. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో చక్రాలు [more]
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కొందరు నాయకులు మంచి ఊపుపై ఉన్నారు. మరికొందరు మాత్రం మదన పడుతున్నారు. దీనికి కారణం.. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో చక్రాలు [more]
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కొందరు నాయకులు మంచి ఊపుపై ఉన్నారు. మరికొందరు మాత్రం మదన పడుతున్నారు. దీనికి కారణం.. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో చక్రాలు తిప్పిన నాయకులు ఇప్పుడు మైనస్ కానున్నారు. ఇది కొందరిలో మోదం కలిగిస్తుండగా.. మరికొందరిలో ఖేదం కలిగిస్తోంది. ఈ పరిణామమే.. వైఎస్సార్ సీపీ నేతల్లోనూ కనిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే వైసీపీలోని సీనియర్ నేతలు ఓపెన్‌గానే తమ స్వరం వినిపిస్తున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పటికే ఈ విషయంలో తన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాను లోక్‌సభ నియోజకవర్గాల వారీగా విభజిస్తే జిల్లా అస్తిత్వమే పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన ఆవేదనకు స్పీకర్ తమ్మినేని సైతం మద్దతు పలికారు.
చెవిరెడ్డి చిత్తూరు జిల్లాలో……
ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక చిత్తూరు జిల్లా విభజనతో ఇప్పుడు అక్కడ వైసీపీలో రాజకీయ పరిణమాలు కొందరికి తీపి.. మరి కొందరికి చేదుగా మారిపోతున్నాయి. చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఈ జిల్లాలో పార్లమెంటు స్థానాలను అనుసరించి రెండు జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఏర్పడితే.. మరికొన్ని ప్రస్తుత చిత్తూరు జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు రాజంపేట జిల్లాలోకి వెళ్లనున్నాయి. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో పక్కనే ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హవా నడుస్తోంది. చెవిరెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేగా, టీటీడీ మెంబర్‌గా, తుడా చైర్మన్‌గా అనేక పదవుల్లో ఉన్నారు.
తిరుపతి జిల్లా అయితే…..
ఇక తిరుపతి పట్టణంలో ఎక్కడ చూసినా చెవిరెడ్డి డామినేషన్ నడుస్తుండడంతో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే తిరుపతి పట్టణం నిండా స్థానిక ఎమ్మెల్యే భూమన ఫ్లెక్సీల కంటే చెవిరెడ్డి ఫ్లెక్సీలే ఎక్కువ కనపడతాయి. తిరుపతిలో కూడా చెవిరెడ్డి దూసుకుపోతోన్న పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు జిల్లాల పునర్విభజనతో చంద్రగిరి చిత్తూరు జిల్లా పరిధిలోకి వెళ్లిపోతుంది. తిరుపతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడుతుంది. తిరుపతి కొత్త జిల్లా అయితే ఖచ్చితంగా అక్కడ చెవిరెడ్డి హవా తగ్గుతుందనే చెప్పాలి.
భూమనకు మాత్రం…..
అంటే.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి దూకుడు రాజకీయం కేవలం చిత్తూరుకే పరిమితం కానుంది. ఇక, ఇప్పటి వరకు తిరుపతికే పరిమితమైన భూమన కరుణాకరరెడ్డి రాజకీయాలు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారిస్తే.. ఇక్కడ పూర్తిస్థాయిలో ఆయన చక్రం తిప్పడం ఖాయమని తెలుస్తోంది. అంతేకాదు, కీలకమైన నియోజకవర్గాల్లోనూ భూమన దూకుడు పెరుగుతుందనేది వాస్తవం. ఇది ఆయనకు ఒకరకంగా ప్లస్ అనే అనుకోవాలి. ఇలా వైఎస్సార్ సీపీలో ఇద్దరు నాయకులకు జిల్లాల ఏర్పాటు ఒకరికి ప్లస్ కానుండగా.. మరొకరికి మైనస్ కానుంది.