జయరాం హత్య: కొన్ని సమాధానాలు , ఎన్నో అనుమానాలు
ఐదురోజుల ఊహాగానాలకు తెరపడింది. రోజుకో కొత్త కోణం, పూటకో మలుపుతో సాగుతున్న కేసులో మిస్టరీ వీడింది. నిందితులెవరో తేలింది. వలపు వల పన్ని జయరామ్‌ను ట్రాప్ చేసారని [more]
ఐదురోజుల ఊహాగానాలకు తెరపడింది. రోజుకో కొత్త కోణం, పూటకో మలుపుతో సాగుతున్న కేసులో మిస్టరీ వీడింది. నిందితులెవరో తేలింది. వలపు వల పన్ని జయరామ్‌ను ట్రాప్ చేసారని [more]
ఐదురోజుల ఊహాగానాలకు తెరపడింది. రోజుకో కొత్త కోణం, పూటకో మలుపుతో సాగుతున్న కేసులో మిస్టరీ వీడింది. నిందితులెవరో తేలింది. వలపు వల పన్ని జయరామ్‌ను ట్రాప్ చేసారని నిర్ధారణ అయింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో లోతైన దర్యాప్తు, టెక్నికల్ ఎవిడెన్స్‌ల పరిశీలనతో హంతకుడు రాకేశ్రెడ్డిగా గుర్తించారు పోలీసులు. ఇందులో శ్రిఖా పాత్ర లేదని చెబుతూనే.. కేసును మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలన్నారు. ఆల్ క్లియర్ అని పోలీసులు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెబుతున్నా.. ఈ కేసులో ఇంకా చిక్కు వీడని సందేహాలు.. సమాధానాలు దొరకని ప్రశ్నలు కనిపిస్తూనే ఉన్నాయి.
ఆర్థిక లావాదేవీలే ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. ఆరు కోట్ల అప్పు విషయంలోనే మర్డర్ జరిగినట్టు నిర్ధారించారు. నిందితులెవరో చెబుతూనే.. మరికొందరు నిందితులున్నారని మెలిక పెట్టారు. అయితే ఈ కేసులో ఇంకా ఎన్నో సందేహాలు, అనుమానాలకు ముగింపు దొరకలేదు.ఆరు కోట్ల అప్పు తీర్చకుండా ఇబ్బంది పెడుతున్నాడనే.. దాడి చేయడంతో జయరామ్ మరణించినట్టు పోలీసులు చెబుతున్నారు. గుండె ఆపరేషన్ కావడం వల్ల రెండు దెబ్బలకే కుప్పకూలిపోయినట్టు చెబుతున్నారు. చనిపోయిన తర్వాత రాకేశ్‌రెడ్డి, వాచ్మెన్ సాయంతో మృతదేహాన్ని తరలించినట్టు వివరించారు. ఇందులో శిఖా చౌదరి పాత్ర లేదని నిర్ధారించారు. రాకేశ్‌రెడ్డిని, వాచ్మెన్ శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. అన్ని రకాల ఎవిడెన్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిందితులను గుర్తించామంటున్నారు. శ్రిఖా పాత్ర లేదంటూనే.. మరికొందరిని విచారించాల్సి ఉందని చెప్పారు.
పోలీసులు వివరంగా చెబుతున్నా.. ఈకేసులో కొన్ని సందేహాలు మాత్రం వీడలేదు. అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు.
అందులో ముఖ్యంగా
1. ఇంత పెద్ద పారిశ్రామిక వేత్త అయిన జయరామ్ దగ్గర నాలుగు కోట్ల రూపాయలు లేవా..? లేకపోతే.. ఎందరో కోటీశ్వరులతో సంబంధాలున్న జయరామ్.. రాకేశ్‌రెడ్డి దగ్గర ఎందుకు అప్పు తీసుకున్నాడు..? ఇది మొదటి సందేహం.. దీనికి ఇంతవరకు సమాధానం దొరకలేదు.
2. దస్పల్లా హోటల్లో జయరామ్‌తో పాటు ఉన్న వ్యక్తి ఎవరు..?
3. ఆరు లక్షల రూపాయలు ఎవరు తీసుకున్నారు..?
4. ఒక్కడే.. ఎలాంటి ఆయుధం లేకుండా దాడి చేస్తే.. తలపై ఎలా గాయమైంది..?
5. శరీరం నల్లగా మారిందనే ఊహాగానాలు జరిగాయి..? పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో మాత్రం ఎలాంటి విష ప్రయోగం జరగలేదని తేలింది..? దీనిపై కూడా కొన్ని అనుమానాలు రేగుతున్నాయి.
6. శిఖా చౌదరి పాత్ర లేదని పోలీసులు తేల్చేశారు. అయితే కథ మొత్తం తన చుట్టూనే తిరిగింది.. అయినా హత్యతో తనకు సంబంధం లేదనేది అనుమానాలకు కలిగిస్తోంది.జయరామ్ భార్య పద్మశ్రీ శిఖా ప్రమేయం లేకుండా హత్య జరిగే అవకాశం లేదంటూ ఆరోపిస్తుంది
7. హత్య చేసింది ఒక్కడే అని చెబుతున్న పోలీసులు.. మరికొందరిని విచారించాలని అన్నారు. వాళ్లు ఎవరు..?
8. హత్య హైదరాబాద్‌లో జరిగిందన్నారు.. తెలంగాణ పోలీసుల సహకారం ఎంత మేరకు తీసుకున్నారు..?
9. శిఖా చౌదరిని తప్పించారంటూ జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపిస్తోంది, ఆమె ఇప్పటికే తెలంగాణ పోలీసులను ఆశ్రయించింది
ఇంకా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు జయరామ్ హత్య చుట్టూ తిరుగుతున్నాయి. ఐదురోజుల హైడ్రామా తర్వాత తేలిన నిజాలు.. అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.