చైనా గుప్పిట్లో పాక్… వదిలించుకోవడం కష్టమే
భారత్ ఇరుగు పొరుగు దేశాల్లో పాగావేసేందుకు చైనా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. తద్వారా ఆయాదేశాల్లో భారత్ వ్యతిరేకతను రెచ్చగొడుతోంది. భారత్ ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్, నేపాల్, శ్రీలంక, భుాటాన్, [more]
భారత్ ఇరుగు పొరుగు దేశాల్లో పాగావేసేందుకు చైనా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. తద్వారా ఆయాదేశాల్లో భారత్ వ్యతిరేకతను రెచ్చగొడుతోంది. భారత్ ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్, నేపాల్, శ్రీలంక, భుాటాన్, [more]
భారత్ ఇరుగు పొరుగు దేశాల్లో పాగావేసేందుకు చైనా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. తద్వారా ఆయాదేశాల్లో భారత్ వ్యతిరేకతను రెచ్చగొడుతోంది. భారత్ ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్, నేపాల్, శ్రీలంక, భుాటాన్, మమన్మార్, బంగ్లాదేశ్ లకు సాయం పేరుతో చేరువవుతోంది. బి.ఆర్.ఐ పధకం పేరుతో ఆయాదేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మిస్తుా, తద్వారా ఆయా దేశాలను అప్పుల ఊబిలోకి దించుతోంది. వాటిపై పెత్తనం చెలాయిస్తోంది. అదే సమయంలో భారత్ వ్యతిరేకతను పోగు చేస్తోంది. పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, ఈ విషయంలో పూర్తిగా బీజింగ్ వలలో పడిపోయాయి. మిగతా దేశాలు అదే దారిలో ఉన్నాయి.
ఆర్థిక సాయం అందిస్తూ….
తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారీజలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సహాయం అందిస్తోంది. పిఓకె లోని గిల్గిల్-బాల్టిస్ధాన్ ప్రాంతంలో ‘డయామర్ భాషా’ జలవిద్యుత్ నిర్మాణానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ నెల మొదటివారంలో శంకుస్ధాపన చేశారు. ఇది పాకిస్ధాన్ లోని ముాడో అతిపెద్ద విద్యుత్ కేంద్రం. తారాబెల్, మహ్లా జలవిధ్యుత్ కేంద్రాలు దేశంలో మెుదటి రెండు పెద్ద విద్యుత్ కేంద్రాలు. 2028 నాటికి నిర్మాణం పూర్తి కాగలదని అంచనా వేస్తున్న ఈ విద్యుత్ కేంద్రంలో 4500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. లక్షలాది ఎకరాలకు నీరు అందిస్తారు. ప్రాజెక్టు నిర్మణానికి అవసరమైన పెట్టుబడిలో 70 శాతాన్ని చైనా సమ కూరుస్తుంది. మిగతా 30 శాతాన్ని పాక్ వెచ్చిస్తుంది. 40 ఏళ్ళనుంచి నలుగురు ప్రధానులు ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ ప్రాజెక్టు ప్రదేశం వివాదస్పద పాక్ లో ఉండటంతో భారత్ అభ్యంతరాలు లేవనెత్తడమే ఇందుకు కారణం. పాక్ కాశ్మీర్ లో అంతర్భాగమని అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ గళం వినిపించడంతో ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి ఆర్ధిక సంస్ధలు ఈ ప్రాజెక్టుకు ఆర్ధకసాయం చేయడానికి వెనుకంజవేశాయి. దీంతో పాక్ అచేతనంగా మిగిలిపోయింది. తాజాగా సి.పి.ఇ.సి ఈ ప్రాజెక్టు లో భాగంగా ‘డయామర్ భాషా’ జలవిధ్యుత్ కేంద్రం నిర్మాణానికి ఆర్ధిక సాయం చేస్తోంది. ఇది తన సర్కారు ఘనతగా ఇమ్రాన్ చెప్పుకుంటున్నారు. శంకుస్ధాపన కార్యక్రమంలో సి.పి.ఇ.సి చైర్మన్ లోఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అసీంసలాం బజావా, ఆర్మీచీఫ్ కమల్ చావెల్ బజ్వా, జలవనరుల మంత్రి ఫైసల్ వాద్వా, పాక్ నిఘా సంస్ధ ఐ.ఎస్.ఐ చీఫ్, హమీర్ ఫయాల్ తరితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల 32 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 50 వేలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులు అవుతారని అంచనా వేస్తున్నారు నిపుణులు.
మరో రెండు జల విద్యుత్ ప్రాజెక్టులు…..
చైనా ఇంతటితోనే ఆగడం లేదు. పాక్ లో మరో రెండు జల విద్యుత్ కేంద్రాల నిర్మణానికి పూనుకుంది. పాక్ రాజధాని ముజఫరాబన్ సమీపంలోని ‘కొహల’ వద్ద 1.24 మెగావాట్ల జలవిధ్యుత్ కేంద్రానికి సాయం అందిస్తోంది. దీనిని జీలం నదిపై నిర్మిస్తున్నారు. జుాన్ 23న ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దీనికోసం 2.4 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు. పాక్ లో మరో జలవిద్యుత్ కేంద్రానికి కూడా ఈ నెల మెుదటివారంలో పాక్ శంఖుస్ధాపన చేసింది. 700 మెగావాట్ల సామర్ధ్యం గల ‘ఆజాద్పట్టన్’ జల విద్యుత్ కేంద్రాన్ని జీలం నదిపై నిర్మించనున్నారు. ఇది పాక్ లోని ‘సుధినాట్’జిల్లా పరిధిలో ఉంది. 1.5 బిలియన్ డాలర్లను చైనా దీనిపై వెచ్చించనుంది. దీనిని 2024 నాటికి పూర్తి చేయాలన్నది లక్షం. ఈ మేరకు జులై 7న ఒప్పదం కుదిరింది. డయామాకం భాషా, కోషాల, అజాద్ పట్టన్ . . . ఈ ముాడు ప్రాజెక్టులను సి.పి.ఇ.సి పధకం కింద నిర్మిస్తున్నారు. డయామర్ భాషా ప్రాజెక్టు దేశంలో ముాడో అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రం. మెుట్టమెుదటిది ‘తారాబెల్’ ప్రాజెక్టు 4888 మెగావాట్ల సామర్ధ్యంగల ఈ ప్రాజెక్టు భైబర్ ఫక్తుాన్ క్వా ప్రావిన్స్ లో ఉంది.
తెర వెనక చైనా….
రెండే అతిపెద్దదైన ‘మంగ్ల’ ప్రాజెక్టు పాక్ లోని మీర్ పూర్ జిల్లా పరిదిలో ఉంది. ఇప్పుడె నిర్మిస్తున్న ముాడోదైన డయామర్ భాషా ప్రాజెక్టు కుాడా పాక్ లో ఉండటం గమనార్హం. ఇది భారత్ ప్రయెాజనాలకు విఘాతం కలిగించే చర్య. పాక్ జమ్ముకశ్మీర్ లో భాగమని భారత్ స్పష్టం చేస్తున్నప్పటికీ పాక్ దుాకుడుతగ్గడం లేదు. తెరవెనుక చైనా మద్దతే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ చేస్తున్న అనాలోచిత వ్యాఖ్యల వెనుక కుాడా చైనా ప్రమేయమే ఉంది. భారత్ భూభాగాలను తమదిగా పేర్కొంటుా మ్యాప్ చిత్రీకరించడం, అసలైన అయెాద్య తమదేశంలోనే ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చైనా దన్నుతోనే చేస్తున్నవే. ఇప్పటికే శ్రీలంకలోని ‘హంబన్ టోట’ లో చైనా సాయంతో ఓడరేవు నిర్మించారు. దీంతో లంక అప్పుల ఊబిలోకి కుారుకుపోయింది. చైనా అండ చుాసుకుని నిన్నమెున్నటిదాకా లంక పాలకులు భారత్ పట్ల అనుచితంగా వ్యవహరించేవారు. గతఏడాది గోటబాయరాజపక్సా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్ధితి కొంత మారింది. ఈ పరిస్ధితిలో భారత దౌత్యనీతి విభిన్నంగా ఉండాల్సిన అవసరం ఉంది.
-ఎడిటోరియల్ డెస్క్