బెదిరింపులకు కాదు.. బ్లడ్ రిలేషన్ తోనే భయమట
ప్రస్తుతం చైనా అధినేత జిన్ పింగ్ ఇప్పుడు అమెరికా పేరు వింటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చైనా పై [more]
ప్రస్తుతం చైనా అధినేత జిన్ పింగ్ ఇప్పుడు అమెరికా పేరు వింటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చైనా పై [more]
ప్రస్తుతం చైనా అధినేత జిన్ పింగ్ ఇప్పుడు అమెరికా పేరు వింటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చైనా పై చేస్తున్న బెదిరింపులకు జిన్ పింగ్ భయపడటం లేదు. ఆయన భయం అంతా తన కుమార్తె కోసం కావడం చర్చనీయం అయ్యింది. తన ఒక్కగానొక్క కూతురు ఇప్పుడు ఉన్నత విద్య కోసం అమెరికాలో చిక్కుబడిపోవడంతో జిన్ పింగ్ కి దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది. చైనా లో వైరస్ విజృంభిస్తున్న సమయంలోనే జిన్ పింగ్ కుమార్తె యుఎస్ వెళ్లినట్లు తెలుస్తుంది.
కిం కర్తవ్యం …
ఇప్పుడు తన కుమార్తె ను క్షేమంగా వెనక్కి రప్పించడం పైనే చైనా అధినేత ఫోకస్ పెట్టారని వార్త కధనాలు వినవస్తున్నాయి. అమెరికా లో చైనా అధినేత కుమార్తె మారు పేరుతో తన చదువును కొనసాగిస్తోంది. గత కొంత కాలం క్రితం ఆమె చదువు పూర్తి అయిపోయాక చైనా వెనక్కి వచ్చి మరింత ఉన్నత విద్యకు ఆమె తిరిగి యుఎస్ వెళ్ళింది. ఇదంతా ఎలా ఉన్నా చైనా లో జిన్ పింగ్ కుమార్తె ను కావాలనే పంపారన్న పుకార్లు మొదలయ్యాయి.
పింగ్ భయమంతా అదే..?
చైనా కన్నా అమెరికానే సేఫ్ అనుకునే తన కుమార్తె ను రహస్యంగా అక్కడ ఉంచారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అక్కడ కేసులు పెరగడంతో జిన్ పింగ్ ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. మొత్తానికి జిన్ భయం అమెరికా అధ్యక్షుడి దాకా చేరినట్లు తెలుస్తుంది. ఆయన ఎలా స్పందిస్తారన్న అంశం మరింత ఆసక్తికరంగా మారింది.