కెలుకుతూనే ఉంటాడా?
చైనా విదేశాంగ విధానం పూర్తిగా భారత్ చుట్టూ తిరుగుతుంటోంది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు నిత్యం పావులు కదుపుతుంటోంది. ఈ దిశగా [more]
చైనా విదేశాంగ విధానం పూర్తిగా భారత్ చుట్టూ తిరుగుతుంటోంది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు నిత్యం పావులు కదుపుతుంటోంది. ఈ దిశగా [more]
చైనా విదేశాంగ విధానం పూర్తిగా భారత్ చుట్టూ తిరుగుతుంటోంది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు నిత్యం పావులు కదుపుతుంటోంది. ఈ దిశగా అనేక వ్యూహాలు రచిస్తుంటోంది. ఇరుగు పొరుగు దేశాలను దానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ను ఇప్పటికే తన వైపునకు తిప్పుకుంది. శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ వంటి దేశాలను తన వైపునకు తిప్పుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ పైనా వల విసిరింది. ఈ ప్రయత్నంలో ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.
తొలినుంచి బంగ్లాతో….
బంగ్లాదేశ్ తో భారత్ కు అవినాభావ సంబంధం ఉంది. ఏడో దశకం ప్రారంభంలో ఆ దేశ ఆవిర్భావంలో భారత్ పోషించిన కీలకపాత్ర అంతర్జాతీయ సమాజానికి తెలిసిందే. పాకిస్థాన్ నుంచి స్వేచ్ఛ పొందడంలో బంగ్లా సాగించిన పోరాటానికి భారత్ అండగా నిలిచిన విషయం చిరపరిచితం. ఆవిర్భావం నుంచి ఆ దేశానికి భారత్ అనేకవిధాలుగా అండగా నిలుస్తోంది. ఆ దేశ ప్రగతికి దోహదపడుతోంది. ఈశాన్య భారతంలో ఆ దేశంతో భారత్ వేల కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దులను పంచుకుంటోంది. తాజాగా ఆ దేశం స్వాతంత్ర్యం సాధించి యాభయ్యేళ్లయిన సందర్భంగా ఇటీవల నిర్వహించిన ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య గల సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఇద్దరు ప్రధానులు నరేంద్రమోదీ, షేక్ హసీనా వాజెద్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
వత్తిడి తెస్తూ….
తాజాగా ‘క్వాడ్’ (క్యూ ఏ డీ- క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) కూటమి లో చేరవద్దంటూ బంగ్లాదేశ్ పై చైనా ఒత్తిడి తెస్తోంది. ఇందులో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్యదేశాలు. క్వాడ్ లో చేరితే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయంటూ బంగ్లాను చైనా రాయబారి లీజిమింగ్ నేరుగా హెచ్చరించడం గమనార్హం. అంతేకాక నాలుగు దేశాల చిన్న కూటమిలో చేరడం వల్ల బంగ్లాకు ఒరిగేదేమీ లేదని ఉచిత సలహాలివ్వడం విశేషం. ఇది పరోక్షంగా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం తప్ప మరొకటి కాదు. ఒక దేశం ఏ కూటమిలో చేరాలి, ఏ కూటమిలో చేరకూడదన్నది పూర్తిగా దాని అంతర్గత విషయం. ఇలానే చేయాలని ఒత్తిడి చేయడం అంతర్జాతీయ దౌత్య పద్దతులకు విరుద్ధమన్న సంగతి బీజింగ్ కు తెలియనిది కాదు. అయినా భారత్ వ్యతిరేకతను ప్రోది చేయాలన్న దురుద్దేశంతోనే చైనా నాయకత్వం పావులు కదుపుతుందన్నది చేదునిజం.
అంతర్జాతీయంగా….
బీజింగ్ హెచ్చరికలు అంతర్జాతీయంగా ప్రకంపనలు కలిగించాయి. బీజింగ్ హెచ్చరికలపై ఢాకా ఆచితూచి స్పందించింది. తమది స్వతంత్ర, సార్వభౌమత్వం గల దేశమని తమను ఎవరూ ప్రభావితం చేయలేరని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎ.కె. అబ్దుల్ మెమున్ దీటుగా స్పందించడం గమనార్హం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో రవాణా, వాణిజ్య కార్యకలాపాలు స్వేచ్ఛగా, సాఫీగా జరిగేలా చూడటం క్వాడ్ కూటమి లక్ష్యం. క్వాడ్ చట్రంలో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, మాల్దీవులు తదితర దక్షిణాసియా దేశాల్లో భారత్, జపాన్ సంయుక్తంగా పలు అభివద్ధి పనులకు శ్రీకారం చుట్టాయి. బంగ్లాదేశ్, మాల్దీవుల్లో రహదారులు, వంతెనలు, రైలు మార్గాలు, ఆస్పత్రుల నిర్మాణం వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులను చేపడుతున్నాయి.
కరోనా కష్టకాలంలోనూ…..
కొవిడ్ కష్టకాలంలో బంగ్లాను భారత్ ఆదుకుంది. టీకాలను సరఫరా చేసి దన్నుగా నిలిచింది. 2010-17 మధ్య కాలంలో బంగ్లాకు భారత్ మూడు లైన్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ ఓ సీ) సదుపాయాలను కల్పించి ఆర్థికంగా ఆదుకుంది. చైనా ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బెల్ట్ రోడ్ ఇనిషియేటీవ్ (బీ ఆర్ ఐ) ప్రాజెక్టు లో బంగ్లా భాగస్వామి. ఇది ఆసియా, ఆఫ్రికా ఖండాలను కలుపుతుంది. భారత్ తో పోలిస్తే చైనానే బంగ్లాదేశ్ కు పెద్ద వాణిజ్య భాగస్వామి. బంగ్లాదేశ్ ఉత్పత్తుల్లో 97 శాతానికి చైనా మినహాయింపులు కల్పించింది. ఈ నేపథ్యంలో ఒక మిత్రదేశంగా బంగ్లాకు చైనా సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప ఏకంగా హెచ్చరికలు జారీ చేయడం అంతర్జాతీయ సంప్రదాయాలకు, దౌత్య విధానాలకు విరుద్ధం.
-ఎడిటోరియల్ డెస్క్