బరి నుంచి తప్పుకున్నారుగా
సంక్రాంతి అంటేనే ప్రకృతి పండుగ. సంప్రదాయాలకు, సంస్కృతికి పెద్దపీట వేసే పండుగ. ఈ పండుగ లో కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. ఎన్ని నిర్బంధాలు ఉన్నా.. ప్రభుత్వం [more]
సంక్రాంతి అంటేనే ప్రకృతి పండుగ. సంప్రదాయాలకు, సంస్కృతికి పెద్దపీట వేసే పండుగ. ఈ పండుగ లో కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. ఎన్ని నిర్బంధాలు ఉన్నా.. ప్రభుత్వం [more]
సంక్రాంతి అంటేనే ప్రకృతి పండుగ. సంప్రదాయాలకు, సంస్కృతికి పెద్దపీట వేసే పండుగ. ఈ పండుగ లో కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. ఎన్ని నిర్బంధాలు ఉన్నా.. ప్రభుత్వం నుంచి ఎన్ని హెచ్చరికలు వచ్చి నా.. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. డింకీ పందాలు సహా కోట్ల రూపాయలు చేతులు మారే ఈ పందేలకు ఉభయ గోదావరి జిల్లాలు ప్రత్యేక ప్రాముఖ్యం ఇస్తాయి. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు వచ్చి పందేలు వేయడంతోపాటు.. సరదా పంచుకుంటారు. అలాంటి పందేలకు ప్రాముఖ్యమైన పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఏడు ఆ సరదా.. సంతోషాలు ఆవిరయ్యాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బరిని ఏర్పాటు చేసి…..
ఎన్నో ఆశలతో ఇక్కడకు వచ్చిన దూర ప్రాంత ప్రజాప్రతినిధులు పందెంరాయుళ్లు కూడా ఉస్సూరుమంటూ వెనుదిరిగారు. దీనికి ప్రధాన కారణం.. కోడి పందేలకు ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరిలో ఈ దఫా కీలకమైన చింతమనేని ప్రభాకర్ దూరంగా ఉండడమే. గతంలో ఆయన టీడీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు.. దీనికి ముందు కూడా ఆయన అనేక మార్లు ఏటా భారీ ఎత్తున బరులు నిర్వహించి ఎక్కడెక్కడి వారినో జిల్లాలకు ప్రత్యేకంగా ఆహ్వానించి పందేలు నిర్వహించేవారు.
పదేళ్లపాటు…..
ఈ పందేలు చూసేందుకు అప్పటి తెలంగాణ ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా వచ్చేవారు. టీడీపీ ప్రజాప్రతినిధులు వచ్చేవారు. దీంతో జిల్లా వ్యాప్తంగా చింతమనేని పేరు మార్మోగిపోయేది. 2009లో చింతమనేని తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు నుంచే ఆయన ప్రతిసారి తన వ్యవసాయ క్షేత్రంలో కోడిపందేలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్లు ఈ పందేలు అలాగే కంటిన్యూ అయ్యాయి. అయితే, ఈ దఫా ఆయన సైలెంట్ అయిపోయారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక చింతమనేని ప్రభాకర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కోడి పందేలంటే….?
ఆయనపై ఉన్న పాత కేసులు అన్ని ఒక్కొక్కటిగా తిరగదోడుతున్నారు. వాస్తవానికి చింతమనేని ప్రభాకర్ కి కోళ్లు పెంచడం మహా సరదా. పందేల కోసం పుంజులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేవారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి బలవర్థకమైన ఆహారాన్ని వాటికి అందించేవారు. భారీ ఎత్తున నిర్వహించే ఈ పందేల్లో పాల్గొనేందుకు వచ్చేవారికి, చూసేందుకు వచ్చేవారికి కూడా పండగ మూడు రోజులు కూడా భారీ ఎత్తున విందు భోజనాలు ఏర్పాటు చేసేవారు. మాంసాహార వంటలతో ఇచ్చే ప్రత్యేక విందుతో అతిథులు ఆనందం పారవశ్యంలో మునిగిపోయేవారు. పందేల్లో డబ్బులు పోగొట్టుకున్నవారికి చార్జీలు ఇచ్చి పంపించిన చరిత్ర ఉంది.
దెందులూరు వదిలి…..
అయితే, ఈ సంవత్సరం వివిద కారణాలతో చింతమనేని ప్రభాకర్ బరులకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చింతమనేని ప్రభాకర్ ను టార్గెట్ చేశారు. గతంలోనూ తర్వాత ఆయనపై నమోదైన కేసులను వెలికి తీసి జైలుకు కూడా పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు కోడి పందేలు వేస్తే మళ్లీ ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయో అని ముందుగానే ఊహించి తనకు తానుగా భీమవరం వెళ్లిపోయి.. అక్కడకు తన పందెం పుంజులను తీసుకుపోయి అక్కడ తాను వ్యక్తిగతంగా పందాలు ఆడుకున్నారు. దీంతో జిల్లాలోని మెట్టప్రాంతంలో సంక్రాంతి కోడి పందాల సందడి కరువైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.