చింతమనేనిలో కొత్త వేదాంతం… ఎన్నడూ చూడని వైరాగ్యం
టీడీపీ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అంటేనే దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన నోరు విప్పితే.. ప్రత్యర్థులకు తడిసిపోతుందనే టాక్ కూడా [more]
టీడీపీ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అంటేనే దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన నోరు విప్పితే.. ప్రత్యర్థులకు తడిసిపోతుందనే టాక్ కూడా [more]
టీడీపీ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అంటేనే దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన నోరు విప్పితే.. ప్రత్యర్థులకు తడిసిపోతుందనే టాక్ కూడా ఉంది. ఇక, ఆయన వరుస విజయాలు సాధించినప్పుడు తనకు తిరుగులేని విధంగా దూకుడు చూపించారు. అలాంటి నాయకుడు.. ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయారు. ఎక్కడా లేని మెట్టవేదాంతం మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మీడియా వాళ్లు ఆయనతో మాట్లాడాలంటేనే జంకే వారు. మీడియా వాళ్లు ఏదైనా టఫ్ ప్రశ్న వస్తే వాళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. అలాంటి చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు మీడియాను చూస్తే.. పారిపోతున్నారట. అంతేకాదు.. ఎవరైనా మీడియా ప్రతినిధులు ఫోన్లు చేసినా.. పట్టించుకోక పోగా.. అయ్యా నా దగ్గర ఏముంది..? నన్ను వదిలేయండి అని డైలాగులు వినిపిస్తున్నారట.
ఓటమి తర్వాత….
దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ చింతమనేని ప్రభాకర్ లో కొత్త వేదాంతం ఏంటా ? అని అందరూ చర్చించుకుంటున్నా రు. గత ఏడాది ఎన్నికల్లో యువ నాయకుడు వైసీపీ నేత అబ్బయ్య చౌదరిపై ఓడిపోయారు. నియోజకవర్గాన్ని తిరుగులేని విధంగా అభివృద్ధి చేశాడు.. వీరుడు.. శూరుడు.. జగన్, పవన్ కలిసి వచ్చి తనపై పోటీ చేసి గెలుస్తా అని సవాళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే చింతమనేని ప్రభాకర్ ఆత్మవిశ్వాసం ఆకాశంలోనే ఉండేది. ఒకే ఒక్క ఓటమి చింతమనేనిలో మార్పు తెచ్చిందా ? అంటే అదొక్కటి మాత్రమే కాదు.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక చింతమనేనిపై ఉన్న పాత కేసులు అన్ని తిరగతోడారు.
క్యాడర్ లో నిరుత్సాహం…..
గత పదేళ్లుగా చింతమనేని ప్రభాకర్ పై ఉన్న కేసులు జగన్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తిరగతోడి మరీ జైలులో ఉంచారు. జైలు నుంచి వచ్చాక చింతమనేని తీవ్ర నిర్వేదానికి గురయ్యారు. ఇక, పార్టీలోనూ దూకుడు చూపించలేక పోతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి వస్తే.. కోడి పందేలు అంటూ హడావుడి చేసే చింతమనేని ప్రభాకర్ ఈ ఏడాది ఎక్కడా ఆ ఊసే లేకుండా గడిపేశారు. అంతేకాదు.. తన సొంత ఫామ్ హౌస్లో గేదెలు, మేకలు మేపు కొంటూ… కాలం గడిపేస్తున్నారు. దీనంతటికీ కారణం.. కేవలం తన ఓటమే కాదని, ఆయన నోటిదూల కారణంగా.. ఎదురైన కేసులేనని స్థానిక నేతలు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చింతమనేని.. ఇప్పుడు అకస్మాత్తుగా ఇలా మారిపోవడంతో కేడర్లోనూ నిరుత్సాహం ఏర్పడుతోంది.
ఇలా మారిపోయారేంటి?
ఆయన ఆయనేనా ? ఇలామారిపోయారేంటి ? అనే చర్చ దెందులూరులో జోరుగా సాగుతోంది. తన నియోజకవర్గంలో తన అనుచరులు, పార్టీ నేతల ఇళ్లల్లో ఏదైనా శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు హాజరు కావడం మినహా ఆయన నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటాలు చేయడం కాని, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం కాని చేయట్లేదు. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి కేడర్ సైతం దూకుడుగా ముందుకు వెళదాం అన్నా అంటున్నా చింతమనేని ప్రభాకర్ మాత్రం ఎందుకురా చించుకుంటారు ? మీ పని మీరు కానివ్వండి అని ముక్తాయిస్తున్నారట.
ఆ దూకుడు ఏదీ?
ఏదేమైనా.. పశ్చిమ టీడీపీలో చాలా మంది నాయకులు ఉన్నా.. చింతమనేని ప్రభాకర్ వంటి దూకుడు ఉన్న నాయకుడు మరొకరు మనకు కనిపించరు. కానీ, ఇప్పుడు పరిస్థితులు ఆయనను నిర్వేదానికి గురిచేయడంతో ఆయన సైలెంట్ అయిపోవడం పార్టీ పరంగాను, ఇటు వ్యక్తంగా కూడా చింతమనేని టాక్ ఆఫ్ దిటౌన్గా మారిపోయారు. మరి చింతమనేని ప్రభాకర్ ఈ నిర్వేదం నుంచి ఎప్పుడు బయటకు వస్తారో ? చూడాలి.