వెనకేసుకు రావడం లేదా?
తెలుగుదేశం పార్టీ అదే తప్పు చేస్తోంది. కోడెల శివప్రసాద్ విషయంలో అనుసరించినట్లుగానే ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ వ్యవహారంలోనూ వ్యవహరిస్తుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు జైలులో [more]
తెలుగుదేశం పార్టీ అదే తప్పు చేస్తోంది. కోడెల శివప్రసాద్ విషయంలో అనుసరించినట్లుగానే ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ వ్యవహారంలోనూ వ్యవహరిస్తుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు జైలులో [more]
తెలుగుదేశం పార్టీ అదే తప్పు చేస్తోంది. కోడెల శివప్రసాద్ విషయంలో అనుసరించినట్లుగానే ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ వ్యవహారంలోనూ వ్యవహరిస్తుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు జైలులో ఉన్నారు. దాదాపు నలభై రోజుల నుంచి ఆయన జైలులో ఉన్నారు. జైలులో ఉన్న చింతమనేని ప్రభాకర్ ను తెలుగుదేశం పార్టీ నేతలు పలకరించిన పాపానపోలేదు. ఆయనను న్యాయపరంగా ఆదుకునే ప్రయత్నమూ తెలుగుదేశం పార్టీ చేయలేదు. దీంతో చింతమనేని ప్రభాకర్ వర్గీయులు టీడీపీ అధిష్టానంపై మండిపడుతున్నారు.
దూకుడు స్వభావంతో….
చింతమనేని ప్రభాకర్ దూకుడు స్వభావం కలిగిన నేత. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడం, దెందులూరు నియోజకవర్గంలో ఆయన ఓటమి పాలు కావడంతో చిక్కులు తప్పలేదు. చింతమేని అధికారంలో ఉన్నప్పుడు అందరినీ టార్గెట్ చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆయనే అందరికీ టార్గెట్ అయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 11వ తేదీన చింతమనేని ప్రభాకర్ ఒక కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయనపై పశ్చిమ గోదావరి జిల్లాలో లెక్కకు మిక్కిలి కేసులున్నాయి. ఒక కేసులో బెయిల్ దొరకిన వెంటనే మరొక కేసులో అరెస్ట్ చేస్తుండటంతో చింతమనేని ప్రభాకర్ బయటకు రాలేకపోతున్నారు.
నలభై రోజుల నుంచి….
చింతమనేని ప్రభాకర్ పై పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల వద్ద దాదాపు 61 కేసుల వరకూ ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ బయటకు తీస్తున్నారు. ప్రభుత్వం మారడంతో చింతమనేని ప్రభాకర్ పై ప్రతి రోజూ ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఫిర్యాదులు తీసుకుంటున్న పోలీసులు వెంటనే చింతమనేని ప్రభాకర్ పై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే దాదాపు నలభై రోజుల నుంచి జైలులో ఉన్నప్పటికి చింతమనేని ప్రభాకర్ ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.
ఆ కేసులుండటంతోనే….
అయితే చింతమనేని ప్రభాకర్ పై ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఉండటంతో తెలుగుదేశం పార్టీ కూడా ఆయనను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయలేక పోతుందంటున్నారు. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి విషయంలోనే తాను తప్పు చేశానని చంద్రబాబు సయితం అంగీకరించే పరిస్థితి ఉంది. చింతమనేని ప్రభాకర్ దూకుడు వల్లనే ఆయనకు బహిరంగంగా మద్దతు ప్రకటించలేకపోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ చింతమనేని ప్రభాకర్ మాత్రం పార్టీ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అసలు చింతమనేని ప్రభాకర్ ఇప్పట్లో బయటకు వస్తారా? లేదా? అన్నది అనుమానమే.