చింతమనేని చిందులు మరిచి…?
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు పెద్దలు. అయితే, ఒక్కసారి జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఫైర్‌బ్రాండ్ చింతమనేని [more]
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు పెద్దలు. అయితే, ఒక్కసారి జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఫైర్‌బ్రాండ్ చింతమనేని [more]
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు పెద్దలు. అయితే, ఒక్కసారి జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఫైర్‌బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ కూడా మారిపోయారు. అది కూడా ఏ రేంజ్లో అంటే చెప్పడానికి కూడా మాటలు చాలనంతగా ఆయన మారిపోయారు. నిజానికి చింతమనేని ప్రభాకర్‌లో ఇంత సాధు పురుషుడు ఉన్నాడా? అని సందేహం వచ్చే స్థాయిలో ఆయన మారిపోవడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. గతానికి ఇప్పటికీ.. చింతమనేని ప్రభాకర్ లో పూర్తి మార్పు కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అంతా తానే అయినట్టు నియోజకవర్గంలో వ్యవహరించారు.
అధికారంలో ఉండగా….
తన మాటే శాసనం, చట్టం.. అనే రేంజ్లో చింతమనేని ప్రభాకర్ చిందులు తొక్కారు. అధికారులను కూడా లెక్క చేయకుండా తను చెప్పిందే జరగాలనే భావనతో చెలరేగిపోయారు., దీంతో ఆయన మంచి పేరు తెచ్చుకో వడం మాట అటుంచి వివాదస్పద నాయకుడిగా పేరు మోసారు. ఈ క్రమంలోనే తన గెలుపు పై కూడా మితిమీరిన ధీమా వ్యక్తం చేశారు. తనకు అడ్డు ఎవరూ చెప్పలేరు. తన గెలుపు ను ఎవరూ అడ్డుకోలేరు.. అనే వ్యాఖ్యలను కూడా చింతమనేని ప్రభాకర్ చేసేవారు.
తనది తప్పేనంటూ…..
అదే సమయంలో పవన్ సహా జగన్ మరెవరైనా కావొచ్చు..తనపై పోటీకి నిలబడి గెలిచి చూపించాలనే సవాళ్లు కూడా రువ్వారు. దమ్ముంటే ఇద్దరు వచ్చి తనను ఓడించాలని మరీ సవాళ్లు చేశారు చింతమనేని ప్రభాకర్ . అలాంటి నాయకుడు ఇప్పుడు పూర్తిగా జైలు నుంచి వచ్చిన తర్వాత మారిపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. గతంలో తాను వ్యవహరించిన విధానం తప్పేనని నిగర్వంగా ఒప్పుకున్నారు. జీవితాంతం నేనే ఎమ్మెల్యేగా ఉంటానని అనుకున్నా.. కానీ, ప్రజలు నన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు చింతమనేని ప్రభాకర్.
వ్యవసాయ క్షేత్రంలోనే…..
ఇక చింతమనేని ప్రభాకర్ తన పనులేంటో తాను చేసుకుంటున్నారు. రాజకీయంగా దూకుడు అస్సలు మరిచిపోయారు. వ్యవసాయం చేస్తున్నారు. అదే సమయంలో సంక్రాంతి కోడిపందేలకు రెడీ అవుతున్నారు. తన వ్యవసాయ క్షేత్రంతో పాటు తన సన్నిహితుల వ్యవసాయ క్షేత్రంలోనూ కోళ్లను పెంచుతున్నారు. అందరికీ ఆప్యాయంగా పేరు పెట్టి పలకరిస్తున్నారు. గతంలో ఉన్న దూకుడు ను పూర్తిగా వదిలించుకున్నారు. ఒకేసారి వందల మంది వచ్చి సెల్ఫీలు దిగుతున్నా చాలా ఓపిగ్గా వాళ్లకు ఫొటోలు ఇస్తున్నారు. ఇంటికి వచ్చే వాళ్లను కూడా బూతులు తిట్టకుండా చాలా మర్యాదతో పలకరిస్తున్నారు. మొత్తంగా చింతమనేని ప్రభాకర్ లో అనూహ్యమైన మార్పును చూసిన తర్వాత అప్పటికీ ఇప్పటికీ ఆయనలో చాలా మార్పు కనిపిస్తోందే అని అందరూ అనుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని టీడీపీ నేతలు నిష్కర్షగా అంగీకరిస్తున్నారు.