చిరాగ్ ను ఇక వదిలేశారా?
చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రివర్గంలో చోటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన తండ్రి స్థానంలో తనకే అవకాశమిస్తారని ఆయన బలంగా విశ్వసించారు. కేంద్రమంత్రిగా ఉన్న రాం విలాస్ [more]
చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రివర్గంలో చోటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన తండ్రి స్థానంలో తనకే అవకాశమిస్తారని ఆయన బలంగా విశ్వసించారు. కేంద్రమంత్రిగా ఉన్న రాం విలాస్ [more]
చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రివర్గంలో చోటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన తండ్రి స్థానంలో తనకే అవకాశమిస్తారని ఆయన బలంగా విశ్వసించారు. కేంద్రమంత్రిగా ఉన్న రాం విలాస్ పాశ్వాన్ బీహార్ ఎన్నికలకు ముందు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ మంత్రి పదవిని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థులను విడిగా పోటీ చేయించారు.
మోదీ జపం చేసినా…..
ఎన్నికల ప్రచారంలోనూ చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్ ను విమర్శించారు తప్పించి, మోదీ, బీజేపీ జోలికి పోలేదు. ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులను కేవలం జేడీయూ, ఆర్జేడీ అభ్యర్థులపైనే పోటీకి నిలిపారు తప్పించి బీజేపీ బలంగా ఉన్న చోట్ల పోటీకి నిలపలేదు. దీంతో బీజేపీకి అత్యధిక సీట్లు రావడానికి చిరాగ్ పాశ్వాన్ పరోక్షంగా కారణమమయ్యారు. ఆర్జేడీని అధికారంలోకి రానివ్వకుండా నిలువరించగలిగారు.
మంత్రివర్గ విస్తరణలో…..
దీంతో త్వరలో జరగనున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణంలో చిరాగ్ పాశ్వాన్ కు చోటు దక్కుతుందని భావించారు. బీజేపీ కూడా ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది. అయితే నితీష్ కుమార్ ను బీహార్ ముఖ్యమంత్రిగా చేయడంతో ఇప్పుడు ఎన్డీఏలో ఆయన కీలకంగా మారారు. ప్రస్తుతం లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏలో లేదు. దానిని ఎన్డీఏలో చేర్చుకోవాలా? లేదా? అన్నది బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని నితీష్ కుమార్ చెబుతున్నా, లోపల మాత్రం అడ్డుచెబుతున్నట్లు తెలుస్తోంది.
ఆ కోటాలో…..
దీనికి తోడు బీజేపీ నేత సుశీల్ కుమార్ మోmదీ రాజ్యసభకు ఎంపిక కావడం చర్చనీయాంశమైంది. రాంవిలాస్ పాశ్వాన్ మృతితో ఏర్పడిన ఖాళీలో సుశీల్ కుమార్ మోదీని బీజేపీ ఎంపిక చేసింది. సుశీల్ కుమార్ మోదీని రాజ్యసభకు ఎంపిక చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఆయనను బీహార్ రాజకీయాల నుంచి తప్పించారు. దీంతో చిరాగ్ పాశ్వాన్ కు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం లేదంటున్నారు. బీహార్ కోటాలో సుశీల్ కుమార్ మోదీ కేంద్ర మంత్రి పదవి పొందే అవకాశముందంటున్నారు. చిన్న వయసులోనే చిరాగ్ పాశ్వాన్ రాజకీయంగా శత్రువులను పెంచుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు.