తమ్ముడు రాజకీయంపై నమ్మకంలేదా ?
మెగాస్టార్ చిరంజీవి ఒక దశలో ముఖ్యమంత్రి కావాల్సింది. కానీ రాంగ్ టైంలో పార్టీ పెట్టడంతో ఆయన కల అలాగే ఉండిపోయింది. ఉమ్మడి ఏపీలో బలమైన కాంగ్రెస్ టీడీపీల [more]
మెగాస్టార్ చిరంజీవి ఒక దశలో ముఖ్యమంత్రి కావాల్సింది. కానీ రాంగ్ టైంలో పార్టీ పెట్టడంతో ఆయన కల అలాగే ఉండిపోయింది. ఉమ్మడి ఏపీలో బలమైన కాంగ్రెస్ టీడీపీల [more]
మెగాస్టార్ చిరంజీవి ఒక దశలో ముఖ్యమంత్రి కావాల్సింది. కానీ రాంగ్ టైంలో పార్టీ పెట్టడంతో ఆయన కల అలాగే ఉండిపోయింది. ఉమ్మడి ఏపీలో బలమైన కాంగ్రెస్ టీడీపీల మధ్య జరిగిన పోరు మధ్యలో దూకిన చిరంజీవి దానికి రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నారు. ఆ తరువాత రియలైజ్ కావడంలోనే చిరంజీవి చతురత ఉంది. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఆ మీదట ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇక ఆయన తమ్ముడు రాజకీయాల్లొకి వచ్చి జనసేనానిగా అవతరించారు. ఇక 2019 ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి దారుణంగా ఓడారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో కొత్త శకం మొదలైంది.
లాంగ్ కెరీర్….
జగన్ కి రాజకీయంగా లాంగ్ కెరీర్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణంతో పాటు జగన్ లోని పట్టుదల, దూర దృష్టి. సోషల్ ఇంజనీరింగ్ చేయడంతో నిపుణత. జనంతో కనెక్ట్ కావడంలో ఆయన చూపించే చాతుర్యం ఇవన్నీ కలసి జగన్ వద్ద ముఖ్యమంత్రి సీటు పది కాలాలు ఉంటుందని ఆ మాత్రం రాజకీయం తెలిసిన వారికి అర్ధమయ్యే విషయం. ఇదే విషయం రాజకీయాల్లో కొంతకాలం ఉన్న చిరంజీవికి బహుశా అర్ధమయ్యేట్లుంది. అందుకే ఆయన తన అనుచరుడిగా, సన్నిహితుడిగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ని వైసీపీలోకి తీసుకురావడానికి తనదైన రాయబారం చేశారని ప్రచారంలో ఉంది.
అనుబంధమే అలా…..
గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉన్నా కూడా చిరంజెవి కుటుంబ మిత్రుడే. ఆయన ఆంతరంగీకుడే. అందువల్ల గంటాను వైసీపీ నీడకు చేర్చే బాధ్యతను కూడా చిరంజీవి తీసుకున్నారని అంటారు. ఆ మధ్యన చిరంజీవి జగన్ ఇంటికి సతీసమేతంగా వెళ్ళారు, మరో మారు తెలుగు సినిమా రంగాన్ని ఏపీలో అభివ్రుధ్ధి చేయడం కోసం వెళ్లారు. ఇక ఫోన్లో కూడా మాట్లాడుకునేంత చనువు ఇద్దరి మధ్యన ఉంది.దాంతో ఏ ముహూర్తాన జగన్ చెవిన ఆయన గంటా మాటను వేశారో కానీ అదిపుడు సాకారం అవుతోందని అంటున్నారు. నిజానికి చిరంజీవినే వైసీపీలోకి జగన్ ఆహ్వానించారని కూడా అంటారు. దాన్ని సున్నితంగా తోసిపుచ్చిన చిరంజీవి తన సన్నిహితుడైన గంటాను ఆ పార్టీలోకి తేవడానికి తన వంతు పాత్ర పోషించారని అంటారు.
ఇక అంతేనా…?
అదే సమయంలో జనసేనను స్థాపించిన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. నిజానికి చిరంజీవి చెబితే గంటా ఆ పార్టీలోకి ఎన్నికల ముందే వెళ్ళి జనసేనను గట్టిపరచే చర్యలు తీసుకునేవారు. కానీ ఎందుకో పవన్ రాజకీయం మీద చిరంజీవికే నమ్మకం లేదా అన్న డౌట్లు వస్తున్నాయి. అంతే కాదు, ఇపుడు పవన్ ప్రతిపక్షంలో ఉన్నారు. పైగా బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. ఆ పార్టీలోకి వెళ్లి భుజం కాయమని చిరంజీవి చెప్పవచ్చు. కానీ అలా కాకుండా వైసీపీలో చేరమని చెప్పడం ద్వారా ఏపీలో నిలిచే పార్టీ, గెలిచే పార్టీ వైసీపీ అని నమ్మారా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి రాజకీయాల్లో రాణించలేకున్నా కూడా ప్రజల నాడిని, ప్రజా తీర్పులను అంచనా వేయడంలో మాత్రం మెగా హీరో పండారని అంటున్నారు. ఇక చిరంజీవి నేరుగా చేరకపోయినా అయన మనిషిగా గంటా ఉంటే ఆయన అండ కూడా జగన్ కి ఉన్నట్లేనని కూడా అంటున్నారు