తోటి కోడలు నవ్విందని…?
తెలుగు సినిమా రంగంలో మకుటం లేని మహారాజు చిరంజీవి. ఆయన తెలుగు సినిమాను కొత్త మలుపు తిప్పాడు. చిరంజీవికి ముందు సినిమా రంగు రుచి వాసనా వేరు, [more]
తెలుగు సినిమా రంగంలో మకుటం లేని మహారాజు చిరంజీవి. ఆయన తెలుగు సినిమాను కొత్త మలుపు తిప్పాడు. చిరంజీవికి ముందు సినిమా రంగు రుచి వాసనా వేరు, [more]
తెలుగు సినిమా రంగంలో మకుటం లేని మహారాజు చిరంజీవి. ఆయన తెలుగు సినిమాను కొత్త మలుపు తిప్పాడు. చిరంజీవికి ముందు సినిమా రంగు రుచి వాసనా వేరు, చిరంజీవి వచ్చాక కధ వేరు. అంతే కాదు, సామాజిక సమీకరణలు కూడా పూర్తిగా చిత్ర సీమలో మారిపోయాయి. అంతకు ముందు ఉన్న టాప్ ఫోర్ హీరోల మధ్య విభేదాలు ఉన్నా ఎక్కడో ఒక చోట అవి సమసిపోయేవి. వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. చిరంజీవి చినుకుగా వచ్చి కుంభ వృష్టినే కురిపించాడు. సినీ జగత్తులో ధగద్ధగాయమానంగా వెలిగాడు.
పోటీ అలా….
సినీ సీమలో అప్పటికే తెలియని సామాజిక పోరు ఉంది. సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన ఎన్టీయార్ రాజకీయాల్లోనూ నంబర్ వన్ అనిపించుకున్నాడు. ఆయన తరువాత ఆ సింహాసనం దక్కించుకున్న చిరంజీవి కూడా రాజకీయంగా మెరవాలనుకున్నాడు. నిజానికి ఆయనకు ఎన్టీయార్ కంటే కూడా ఎన్నో అనుకూలించే అంశాలు ఉన్నాయి. బలమైన కుల నేపధ్యం ఉంది. వారిలో తీరని ఆకాంక్ష ముఖ్యమంత్రి పీఠం చిరంజీవి రూపంలో సాకారం చేసుకోవాలన్న గట్టి సంకల్పం ఉంది. మెగా ఫ్యాన్స్ కట్టుదిట్టంగా ప్రతీ పల్లె దాకా విస్తరించి ఉన్నారు. చిరంజీవి కూడా యాభై ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి ఆయన యువకుడి కిందనే లెక్క. ఇలా ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా లేనిదల్లా ఆనాటికి ఉమ్మడి ఏపీలో రాజకీయ శూన్యత. దాంతోనే చిరంజీవి ప్రజరాజ్యం రాజకీయ సినిమా ఫ్లాప్ అయింది.
తట్టుకోలేకపోతున్నారా…?
ఇక ఆయన తమ్ముడిగా సినీ సీమలో ప్రవేశించి రాజకీయంగానూ తానేంటో నిరూపించుకోవాలని పవన్ కళ్యాణ్ ఉబలాటపడ్డారు. ఆయన సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. దాదాపు ఏడేళ్ల రాజకీయ ప్రస్థానంలో పవన్ పొలిటికల్ గా ఫ్లాప్స్ తోనే ఉన్నారు. దానికి తోడు నిలకడ లేని రాజకీయాలు చేస్తారని పేరు రావడంతో ఆయన పాలిటిక్స్ లో పడుతూ లేస్తున్నారు. అయితే ఆయన రాజకీయం ఆయనిష్టం అన్నట్లుగావదిలేయకుండా తోటి నటులు వెటకారంగా మాట్లాడడంతోనే మెగా ఫ్యామిలీకి మండిపోతోంది. ముఖ్యంగా చిరంజీవి బ్రదర్ నాగబాబు అయితే అసలు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ మీద చేసిన కామెంట్స్ కి నాగబాబు గట్టి రిటార్ట్ ఇచ్చారు. ఇదిపుడు సినీకులంలో కలకలం రేపుతోంది.
మద్దతు లేదా..?
సినిమా అంటే పది మంది కలిసి చేసే పని. అక్కడ ఒక్కోరూ ఒక్కో పార్టీ అభిమానిగా ఉంటారు. విభేదించుకుంటే సెల్యూలాయిడ్ మీద బొమ్మ పండదు, కానీ రాజకీయాల్లో ఎంత రఫ్ గా ఉంటే అంతగా హిట్ అవుతారు. నాగబాబు, పవన్ నటులు కమ్ పొలిటీషియన్స్. దాంతోనే వస్తోంది తంటా. సినీ సీమలో పవన్ సహా చిరంజీవి ఫ్యామిలీని వ్యక్తిగతంగా ఎంతో అభిమానించే వారు కూడా రాజకీయంగా మద్దతు ఇవ్వలేకపోతున్నారు. దానికి ఎన్నో కారణాలు. మనకెందుకు ఈ రాజకీయాలు అనే బాపతు కొంతమంది ఉంటే మెగా ఫ్యామిలీ రాజకీయాల పట్ల రోసి విసిగిన వారు మరి కొంతమంది. సినిమా జనాలు అద్దాల మెడల్లో ఉంటారు. రాజకీయాల నుంచి వచ్చే రాళ్ళు వారి అద్దల మేడను, అందాల కలలను బద్దలు కొడతాయన్న భయం వారికి ఉంది.
సినీ సీమలో సెగలు….
మొత్తానికి పవన్ ని అటు సోషల్ మీడియాలోనూ, ఇటు బయటా సినీ నటులు కొంతమంది ఆడేసుకుంటున్నా కూడా కనీసం పెదవి విప్పి మద్దతు ఇవ్వలేని స్థితిలో టాలీవుడ్ ఉంది. దాని మీద కూడా చిరంజీవి ఫ్యామిలీ గుర్రుమంటోంది. అయితే కోపమంతా తోటి కోడలు నవ్విందని మాత్రమే చూపిస్తున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా పవన్ పాలిటిక్స్ లో పదనిసలే సినీ సీమలో సెగలు పుట్టిస్తున్నాయన్నది వాస్తవం. విమర్శలు తట్టుకుంటేనే ఏ రంగంలోనైనా రాణించేది. 2009 నుంచి పాలిటిక్స్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న మెగా ఫ్యామిలీ ఈ సంగతిని ఇప్పటికీ గుర్తించకపోవడం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు.