ఆ భేటీ అందుకేనా…?
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా వున్నారు. ఆయన ఇప్పటికి కాంగ్రెస్ నుంచి తప్పుకోలేదు. మరో పక్క జనసేనకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా లేకుండా తటస్థం గా వుంటూ [more]
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా వున్నారు. ఆయన ఇప్పటికి కాంగ్రెస్ నుంచి తప్పుకోలేదు. మరో పక్క జనసేనకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా లేకుండా తటస్థం గా వుంటూ [more]
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా వున్నారు. ఆయన ఇప్పటికి కాంగ్రెస్ నుంచి తప్పుకోలేదు. మరో పక్క జనసేనకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా లేకుండా తటస్థం గా వుంటూ వ్యవహారం నెట్టుకొస్తున్నారు. దశాబ్దాలుగా తనకు ఇమేజ్ తెచ్చిపెట్టిన సినీ పరిశ్రమ పైనే పూర్తిగా దృష్టి పెట్టేశారు చిరంజీవి. తాజాగా సైరా సినిమా వ్యవహారాల్లో బాగా బిజీ అయిపోయి హ్యాపీ గా వున్న మెగాస్టార్ చిరంజీవిని జనసేన అధినేత ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కలిశారు. అన్నదమ్ములు కాబట్టి వీరి కలయికకు అంత ప్రాధాన్యం ఇవ్వలిసిన పని లేదని అనుకోవడానికి లేదు. కారణం ఆయన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కలిసి చర్చలు జరపడం పరిశీలిస్తే కొత్త రాజకీయం ఎపి లో చోటు చేసుకుంటుందా అన్న సందేహాలు నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి.
అన్నా కిం కర్తవ్యం ….?
అన్న చిరంజీవి తో పవన్ కళ్యాణ్ కి విభేదాలు ఏమి లేవు. అయితే రాజకీయంగా ఇద్దరి దారులు వేరైనా నేపథ్యంలో చిరంజీవి జనసేన కు దూరం జరిగారు. గతంలో ఒక వేదికపై పవన్ అటు సినిమాలు, ఇటు రాజకీయం చేయగల సత్తా వున్నాడని మెగాస్టార్ కితాబు ఇచ్చిన సందర్భం వుంది. ఇటీవల ఎన్నికల్లో పవన్ పార్టీ ఘోరఓటమి మరోపక్క వైసిపి అఖండ విజయం తో ప్రస్తుతం పార్టీని నడపడం జనసేన కు భారమే. ఆర్ధికవనరులను ఎల్లకాలం ఫ్యాన్స్ భరించే అవకాశం పవర్ లేకపోవడంతో తగ్గిపోతూ వస్తుంది. స్థానిక ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు వంటివి జనసేన కు కొత్త సవాల్ విసరనున్నాయి.
చిరు సలహా ఇదేనా …?
పూర్తి స్థాయి రాజకీయం చేస్తానంటూ సినిమాలకు గుడ్ బై అని ఇప్పటికే పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏ రూట్ లో వెళ్లాలన్న దానిపై పవర్ స్టార్ పవన్ చిరంజీవి సలహా తీసుకోవడానికే వెళ్లినట్లు టాక్ నడుస్తుంది. మరోపక్క బిజెపి ఎపి లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించేందుకు అన్ని తలుపులు బార్లా తెరిచి వచ్చిన వాళ్ళను వచ్చినట్లు పార్టీ తీర్ధం ఇచ్చేస్తుంది. జనసేన వైపు వచ్చే వాళ్ళే లేకుండా పోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అన్న చిరంజీవి సలహా కోసమే పవన్ ఆయన్ను కలిసినట్లు తెలుస్తున్నా మెగాస్టార్ ఇచ్చిన సలహా ఏమిటన్నది ఇంకా బయటకు రాకపోవడంతో పవన్ కొత్త అడుగుపై ఎవరికి నచ్చిన ప్రచారం వారు చేసేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, సినిమాలు సైతం చేస్తే మంచిదన్న సలహాని మెగా స్టార్ ఇచ్చారన్న ప్రచారం మాత్రం ఎక్కువ సాగడం గమనార్హం.