చిరంజీవి చెబితే అది నిజమేనా?
ఆయన మెగాస్టార్. సాధారణ కానిస్టేబిల్ కుమారుడిగా పుట్టి డిగ్రీ వరకూ చదువుకుని సినిమాల మీద ఆసక్తితో మద్రాస్ చేరుకున్నారు. అప్పటికే గండరగండడు లాంటి ఎన్టీఆర్ ఓ వైపు, [more]
ఆయన మెగాస్టార్. సాధారణ కానిస్టేబిల్ కుమారుడిగా పుట్టి డిగ్రీ వరకూ చదువుకుని సినిమాల మీద ఆసక్తితో మద్రాస్ చేరుకున్నారు. అప్పటికే గండరగండడు లాంటి ఎన్టీఆర్ ఓ వైపు, [more]
ఆయన మెగాస్టార్. సాధారణ కానిస్టేబిల్ కుమారుడిగా పుట్టి డిగ్రీ వరకూ చదువుకుని సినిమాల మీద ఆసక్తితో మద్రాస్ చేరుకున్నారు. అప్పటికే గండరగండడు లాంటి ఎన్టీఆర్ ఓ వైపు, మరో వైపు ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి ఉద్దండులు ఉన్నారు. అయినా తన టాలెంట్ ని నమ్ముకుని టాలీవుడ్ లో రాణించడమే కాదు. నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇక అదే ఊపులో రాజకీయాల్లోకి వస్తే అక్కడ మాత్రం విజయవంతం కాలేకపోయారు. సరే కేంద్ర మంత్రిగా పనిచేసిన సంతృప్తి తనకు ఉందని అంటున్నారు చిరంజీవి. ఇక రాజకీయాల కంటే కూడా సినిమాలకే ఆయన ఇపుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆ వైపునకు నో…..
చిరంజీవి మనసు ఇపుడు సినిమాల మీదనే ఉంది. తన సినిమాలేవో, తానేంటో అన్నట్లుగా ఉండాలనుకుంటున్నారుట. రాజకీయాల జోలికి మళ్ళీ పోను అంటున్నారు. ప్రజారాజ్యం అనుభవాలలో మంచి, చెడూ రెండూ ఉన్నాయని అంటున్న చిరంజీవి తాను ఈ వయసులో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి చేయడం అంటే పెద్ద రిస్క్ అనేస్తున్నారు. తాను కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు ప్రజలకు సేవలు అందించానని, అది తనకు చాలు అంటున్నారు. ఇక తన మనసు సినిమాల వైపే ఉందని, జనం కూడా తనను ఆదరిస్తున్నారని అంటున్నారు.
మంచి ఫ్యూచరట…..
ఇక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని చిరంజీవి అభిప్రాయపడుతున్నారు. జనసేనానిగా కాదు, యువరాజ్యం అధినేతగా కూడా పవన్ కి ఎన్నో రాజకీయ అనుభవాలు ఉన్నాయని, దాంతో పాటు 2019 ఎన్నికల్లో ఓటమి కూడా పవన్ కి ఎన్నో నేర్పి ఉంటుందని కూడా చిరంజీవి అంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కి పట్టుదల ఎక్కువని, ఆయన రాజకీయాల్లో తన కంటే కూడా బాగా రాణించగలరని చిరంజీవి అంటున్నారట.
టార్గెట్ అదే….?
ఇక పవన్ తాను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడని కూడా మెగాస్టార్ చిరంజీవి నమ్ముతున్నాడని చెబుతున్నారు. తనకు రాజకీయాలు ఇష్టం లేకపోయినా తన కుటుంబం సభ్యుడిగా పవన్ రాజకీయాలో ఉంటే తప్పకుండా సపోర్ట్ చేస్తానని కూడా చిరంజీవి చెబుతున్నారు. తన ఓటు జనసేనకేనని కూడా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని చిరంజీవి నమ్ముతున్నట్లుగా అంటున్నారు. మొత్తానికి మెగా కుటుంబంలో విభేదాలు ఉన్నాయని, చిరంజీవి వేరే ఆలోచనలు చేస్తున్నారని, తమ్ముడు పార్టీకి అన్న మద్దతు లేదని వస్తున్న పుకార్లు వట్టివేనని చిరంజీవి తాజాగా ఆ మీడియాతో చేసిన కామెంట్స్ బట్టి స్పష్టమవుతోంది. మొత్తానికి నీళ్ల కంటే రక్తం చిక్కనిది అని చిరు నిరూపించారు. సో పవన్ ముందుంటే వెనక బలం మెగాస్టార్ చిరంజీవి అవుతారన్న మాట.