చిత్రలహరి మూవీ రివ్యూ
బ్యానర్: మైత్రి మూవీస్ నటీనటులు: సాయి తేజ్(సాయి ధరమ్ తేజ్), కళ్యాణి ప్రియదర్శిని, నేత పేతురేజ్, సునీల్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ తదితరులు [more]
బ్యానర్: మైత్రి మూవీస్ నటీనటులు: సాయి తేజ్(సాయి ధరమ్ తేజ్), కళ్యాణి ప్రియదర్శిని, నేత పేతురేజ్, సునీల్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ తదితరులు [more]
బ్యానర్: మైత్రి మూవీస్
నటీనటులు: సాయి తేజ్(సాయి ధరమ్ తేజ్), కళ్యాణి ప్రియదర్శిని, నేత పేతురేజ్, సునీల్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: మోహన్ చెరుకూరి
దర్శకుడు: కిషోర్ తిరుముల
ఎంతగా ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్నా.. సక్సెస్ అనేది లక్కు మీదే, టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది అనేది మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ని చూస్తే తెలుస్తుంది. మెగా బ్యాగ్రౌండ్ మీద సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్.. ఆ బ్యాగ్రౌండ్ తో యావరేజ్ హీరోగా బాగానే నిలదొక్కుకున్నాడు. కానీ లక్కు కూడా కలిసిరావాలి. అందుకే స్టార్ రేంజ్ అందుకోవడానికి చాల తంటాలు పడడమే కాదు.. ప్రస్తుతం హీరోగా సెట్ అవడానికి కష్టపడుతున్నాడు. ఎందుకంటే వరసగా ఆరు ప్లాప్స్. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు అంటూ వరసగా డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ ని సాయి ధరమ్ తన సొంతం చేసుకున్నాడు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక సక్సెస్ ఫుల్ బ్యానర్ మైత్రి మూవీస్ వారు నిర్మాణంలో యావరేజ్ హిట్స్ ఉన్న దర్శకుడు కిషోర్ తిరుమలతో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి లాంటి సినిమా చేస్తే.. ఆ సినిమా మీద ఎలాంటి అంచనాలుంటాయో ఈజీగా చెప్పొచ్చు. ఆరు సినిమాల ప్లాప్ తో మార్కెట్ పూర్తిగా పడిపోయిన హీరో మీద ఆ నిర్మాతలు ఇన్వెస్ట్ చెయ్యడం అంటే మాటలు కాదు. కానీ మంచి కథ దొరి కి.. హీరోని, దర్శకుడ్ని నమ్మొచ్చని చిత్రలహరి నిర్మాతలు ప్రూవ్ చేశారు. కథ బలంతో సినిమా విజయం మీద నమ్మకంతో మైత్రి వారు ఈ సినిమాకి పెట్టుబడి పెట్టారు. ఇక కళ్యాణి ప్రియదర్శిని లాంటి ట్రెడిషనల్ హీరోయిన్, నివేత పేతురేజ్ వంటి గ్లామర్ గర్ల్, ఒకప్పుడు సూపర్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సునీల్ కూడా ఈ సినిమాలో నటించడం, చిత్రలహరి ట్రైలర్, సాంగ్స్ తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి మైత్రి వారి నమ్మకం… చిత్రలహరి నిలబెడుతుందా? సాయి ధరమ్ తేజ్ ప్లాప్స్ కి అడ్డుకట్ట ఈ చిత్రలహరి సినిమా వేసిందా? అనేది సమీక్ష లో తెలుసుకుందాం.
కథ:
జీవితం లో సక్సెస్ అంటే ఏంటో తెలియని విజయ్(సాయిధరమ్ తేజ్) లో మంచి టాలెంట్ ఉంటుంది కానీ… అతనికి విజయం మాత్రం వరించదు . చిన్నప్పట్నుంచే అతన్ని అన్ని పరాజయాలు వెంటాడుతుంటాయి. అలంటి విజయ్ జీవితంలో లహరి (కల్యాణి ప్రియదర్శన్) పరిచయం ప్రేమ మాత్రమే కాస్త వెలుగులా కనిపిస్తాయి. కానీ లహరి తన చిన్ననాటి స్నేహితురాలైన స్వేచ్ఛ (నివేదా పేతురాజ్) మాటలు విని… విజయ్‌పై నమ్మకాన్ని కోల్పోతుంది. విజయ్, లహరిలు బ్రేకప్ చేసుకుంటారు. లహరి విడిపోయాక… లహరి మీద ప్రేమ మరింత పెరుగుతుంది. అయితే లహరి ఫ్రెండ్ స్వేచ్ఛ వల్లే విజయ్ తాను అనుకున్న విజయం సాధిస్తాడు. స్వేచ్ఛ వలన విజయ్ ఎలా విజయాన్ని సొంతం చేసుకున్నాడు? మరి స్వేచ్చకీ దగ్గరయిన విజయ్.. లహరి ప్రేమని మల్లి దక్కించుకున్నాడా? చివరికి లహరిని విజయ్ పెళ్లి చేసుకుంటాడా? అసలు స్వేచ్ఛ, లహరిలలో విజయ్ భార్య ఎవరవుతారు? ఎప్పుడు విజయానికి దూరమయ్యే విజయ్ కి విజయం ఎలా దక్కుతుంది? అనేది చిత్రలహరి మిగతా కథ.
నటీనటుల పాత్ర:
సాయి ధరమ్ తేజ్ గా ఇప్పటికే బోలెడన్ని సినిమాలు చేసినా రాని హిట్ ఇప్పుడు సాయి తేజ్ గా పేరు మార్చుకున్నాక వస్తుందని సాయి ధరమ్ అనుకున్నట్లుగా వున్నాడు. అందుకే ఈసినిమా నుండి తన పేరుని సాయి ధరమ్ తేజ్ సాయి తేజ్ గా మారాడు. సినిమాలో విజయ్ పాత్ర కు సాయి తేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఆ పాత్రలో తేజు నటన సినిమాకు హైలైట్ అయ్యింది. గత సినిమాలతో పోలిస్తే నటన పరంగా తేజు ఈ సినిమాలో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. విజయాల్లేని యువకుడిగా ఒదిగిపోయాడు. భావోద్వేగాల పరంగా కూడా మెప్పిస్తాడు. ఇక ఈ పాత్ర తరువాత బాగా కనెక్ట్ అయ్యే పాత్ర పోసాని కృష్ణ మురళ పాత్ర. తేజు తండ్రి పాత్రలో పోసాని నటన ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఒకరు హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శిని. ట్రెడిషనల్ గా కళ్యాణి తన పరిధిమేర లహరి పాత్రలో బాగా నటించింది. ఇక పాత్ర స్వభావం రీత్యా నివేదా పేతురాజ్ ముఖంలో ఎప్పుడూ నవ్వుండదు కానీ… అందంగా కనిపించింది. ప్రాక్టికల్‌గా ఆలోచించే యువతి పాత్రలో చక్కటి అభినయం కూడా ప్రదర్శించింది. తొలి సగభాగం సినిమాలో సునీల్, ద్వితీయార్ధంలో వెన్నెల కిషోర్ పంచిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. మిగతా నటీనటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ చిత్రలహరి. మొదటినుండి ఈ సినిమాని కామెడీ ఎంటెర్టైనెర్ గానే పబ్లిసిటీ చేస్తూ వచ్చారు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి క్లీన్ ఎంటెర్టైనర్లను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని కూడా ఎక్కడా అసభ్యత తావివ్వకుండా చాల క్యూట్ గా నీట్ గా ప్రెజెంట్ చేసాడు. ఎందులోనూ గెలుపు చూడని ఓ యువకుడి జీవితంలోకి వచ్చిన ఇద్దరమ్మాయిలు అతన్ని ఎలా ప్రభావితం చేశారన్నదే ఇందులో కీలకం. డైలాగ్స్ టోన్ కట్టిపడెయ్యగలగడంలో నేర్పరి అయిన కిషోర్ తిరుమల ఈ సినిమా విషయంలో విషయంలో మరోసారి తన ప్రతిభని చాటి చెప్పాడు. ప్రేక్షకుడికి సినిమా మొదలవ్వగానే బోర్ కొట్టకుండా నేరుగా కథలోకి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ లో విజయ్ – లహరిల ప్రేమ నేపథ్యం ఆకట్టుకునేలా చూపించిన దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఆ ఇద్దరు బ్రేకప్ చేసుకునేలా చూపించి కాస్త నిరాశపరిచాడు. కాకపోతే ఆ ఇద్దరి ప్రేమ బంధాన్ని బలంగా ఆవిష్కరించకముందే… ఆ ఇద్దరూ విడిపోవడంతో తగిన స్థాయిలో భావోద్వేగాలు పండలేదు. దాంతో విరామ సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో కథ మలుపుతిరుగుతుంది అనుకున్న ప్రేక్షకుడికి.. కథలో బలం లోపించింది. సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా సాదాసీదాగా సాగుతుంటాయి. తండ్రీకొడుకులుగా సాయిధరమ్ తేజ్ – పోసానిల మధ్య సన్నివేశాలు, వెన్నెల కిషోర్ కామెడీ మినహా సెకండ్ హాఫ్ కథలో సంఘర్షణ అంటూ ఏమీ కనిపించదు. సినిమా నిడివిని బాగా తగ్గించినప్పటికీ సెకండాఫ్ మాత్రం ప్రేక్షకుడికి అంత బాగా కనెక్ట్ కాదు. కథనం ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండు. కానీ, సినిమాలో డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి. చాలా సింపుల్‌గా గుచ్చుకున్నట్టు ఉన్నాయి. కలలు కనే ప్రతి వాడూ కలాం కాలేడు, స్విగ్గీలో పెట్టిన ఆర్డరా క్రిష్ణారావు ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి, సక్సె్స్ టైం పడుతుంది లాంటి డైలాగులు బాగా పేలాయి. కాకపోతే ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు నాటకీయంగా అనిపిస్తాయి. ఇక చిత్రలహరి సినిమా చూస్తున్నంతసేపు.. నేను శైలజ, 7/జి బృందావన్ కాలనీ సినిమాలు జ్ఞప్తికి వస్తాయి. ఏదిఏమైనా సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమాతో యావరేజ్ పడినట్లే కనబడుతుంది.
దేవి శ్రీ ప్రసాద్ పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల చిత్రీకరణ, సముద్రంలో పడవ ఎపిసోడ్లో ఆయన పనితనం కనిపించింది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకు బాగానే పనిచెప్పారు. సినిమా నిడివిని తగ్గించి ప్రేక్షకులు విసుగు చెందకుండా చేశారు. టెక్నికల్‌గా సినిమా చాలా రిచ్‌గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ గత చిత్రాల మాదిరిగానే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్: సాయి తేజ్ నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, పోసాని – సాయి తేజ్ ల కాంబో సీన్స్, డైలాగ్స్
మైనస్ పాయింట్స్: కథ, కథనం, సెకండ్ హాఫ్, లవ్ ట్రాక్, క్లైమాక్స్, కామెడీ అనుకున్నంతగా పండలేదు
రేటింగ్: 2.75 /5