ఈ ఎంపీల బిగ్ కోపరేషన్…?
తెలుగుదేశానికి పార్టీలో ఉన్న వారి కన్నా విడిచి వెళ్ళిన వారు బయట వారే ఎక్కువగా సాయం చేస్తున్నారు అనుకోవాల్సి వస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం [more]
తెలుగుదేశానికి పార్టీలో ఉన్న వారి కన్నా విడిచి వెళ్ళిన వారు బయట వారే ఎక్కువగా సాయం చేస్తున్నారు అనుకోవాల్సి వస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం [more]
తెలుగుదేశానికి పార్టీలో ఉన్న వారి కన్నా విడిచి వెళ్ళిన వారు బయట వారే ఎక్కువగా సాయం చేస్తున్నారు అనుకోవాల్సి వస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురుకాగానే ఆయనకు కుడి భుజం లాంటి ఎంపీలు జెండా ఎత్తేశారు. ఆ విధంగా బిగ్ షాట్ గా చెప్పబడే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఆయనతో పాటే మరో కీలక ఎంపీ సీఎం రమేష్ కూడా టీడీపీని వీడారు. ఇక లోక్ సభ సభ్యులుగా ముగ్గురు గెలిచారు కానీ ఎవరి దారి వారిదే అన్నట్లుగా సీన్ ఉంది. ఈ నేపధ్యంలో పార్టీని వీడిన ఎంపీలు ఇద్దరూ బ్యాక్ డోర్ సొపోర్ట్ చేస్తున్నారు అన్న ప్రచారం అయితే పార్టీలో ఉంది.
ఈయన వెనక…..?
మరో వైపు చూస్తే జగన్ తో విభేదించిన రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు వెనక ఈ ఇద్దరు ఎంపీలు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన మొదట్లో వైసీపీ సర్కార్ మీద పెద్దగా విమర్శలు చేయలేదు. తన అసంతృప్తితో తాను ఉంటే ఆయన్ని రెచ్చగొట్టింది ఈ ఇద్దరు ఎంపీలు అన్నదైతే ప్రచారంలో ఉంది. ఈ ఇద్దరి ప్రభావంతోనే రాజు ఏకంగా జగన్ మీదనే బాణాలు ఎక్కుపెట్టే దిశగా సాగారని అంటున్నారు. మరో వైపు వీరు బీజేపీలో చేరినా కూడా టీడీపీకి సాయపడేందుకే చూస్తారని కూడా అంటారు.
కాగల కార్యం …?
తెలుగుదేశం నుంచి గత రెండేళ్ళుగా ఎవరూ పెద్దగా గొంతు సవరించడంలేదు. జగన్ మీద విమర్శలు చేస్తే తమ మీద ఎక్కడ కేసులు పెడతారో అన్న భయంతోనే నేతలు ఉన్నారని అంటారు. ఇక ఎన్నికల్లో పార్టీ వరస ఓటములను చూసిన వారు కొంతకాలం కామ్ గా ఉంటే బెటర్ అని కూడా డిసైడ్ అయ్యారు. ఈ నేపధ్యంలో ఎంతసేపూ చంద్రబాబు చినబాబులు మాత్రమే వైసీపీ మీద విమర్శలు చేయాల్సి వస్తోంది. అయితే టీడీపీ నుంచి ప్రతీ సారీ విమర్శలు చేస్తే రోటీన్ అవుతుంది. అదే వైసీపీ టికెట్ మీద గెలిచిన రాజు చేస్తే ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుందనే ఆయన్ని రెచ్చగొట్టారు అంటున్నారు. అలా కాగలకార్యాన్ని ఈ ఇద్దరు ఎంపీలు నెరవేర్చారు అని చెబుతున్నారు.
అనుకూలం చేయడమే …?
బీజేపీలో ఉన్నా కూడా ఈ ఇద్దరు ఎంపీల మనసు టీడీపీ వైపే ఉందని అంటున్నారు. చంద్రబాబు పాలసీనే వారు ఎపుడూ బీజేపీలో వినిపిస్తూ వస్తున్నారు అని అంటారు. అమరావతి రాజధాని సమస్య అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా నిమ్మగడ్డ రమెష్ కుమార్ ఆద్వర్యంలో లోకల్ బాడీ ఎన్నికలు జరిపించే విషయం అయినా అచ్చం బాబు వాయిస్ నే వారి గొంతులో పలికిస్తారు అని చెబుతారు. ఇపుడు రఘు రామరాజు వెనక కూడా వీరే ఉంటూ టీడీపీకి పొలిటికల్ మైలేజ్ కోసం చూశారు అన్న ప్రచారం అయితే గట్టిగా ఉందిట. రఘు రామ క్రిష్ణం రాజు అరెస్ట్ మీద అందరూ ఖండించినా ఈ ఇద్దరి నుంచి రియాక్షన్ లేకపోవడాన్ని కూడా ఎత్తి చూపుతున్నారు. ఇక రఘు రామ రాజు ఫోన్ కాల్స్ ఎక్కువగా ఎవరి నుంచి వెళ్ళాయన్న దాని మీద ఏపీ సీఐడీ విచారణ చేపడుతోందిట. దాంతో ఆశ్చర్యకరంగా చాలా మంది పెద్దల పేర్లే బయటకు వస్తాయని కూడా అంటున్నారు. మొత్తానికి ఏడ ఉన్నా తాము టీడీపీ నీడేనని ఆ ఇద్దరు ఎంపీలు రుజువు చేసుకుంటున్నారు అన్నదే చర్చట. ఏపీలో రాజకీయాన్ని టీడీపీకి అనుకూలం చేయడమే ఎంపీల టార్గెట్ అని అంటున్నారు.