పెద్ద రాష్ట్రమైనా… అందులో మాత్రం?
దేశంలో కల్లా అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. పార్లమెంటు స్థానాలే 80 ఉన్నాయి. ఇక్కడ ఎవరిది పై చేయి అయితే వారిదే ఢిల్లీ పీఠం అన్నది [more]
దేశంలో కల్లా అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. పార్లమెంటు స్థానాలే 80 ఉన్నాయి. ఇక్కడ ఎవరిది పై చేయి అయితే వారిదే ఢిల్లీ పీఠం అన్నది [more]
దేశంలో కల్లా అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. పార్లమెంటు స్థానాలే 80 ఉన్నాయి. ఇక్కడ ఎవరిది పై చేయి అయితే వారిదే ఢిల్లీ పీఠం అన్నది రాజకీయ పార్టీలు భావిస్తాయి. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా వైరస్ ను మాత్రం చాలా వరకూ నియంత్రించగలిగారనే చెప్పాలి. యోగి ఆదిత్యానాధ్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వ్యాధిని కొంత మేర కట్టడి చేయగలిగారని పొలిటికల్ సర్కిళ్లలో కామెంట్స్ విన్పిస్తున్నాయి.
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే…..
నిజానికి కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు కరోనా వైరస్ తో విలవిల లాడిపోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ తో పోల్చుకుంటే ఈ రాష్ట్రాల్లో అక్షరాస్యత ఎక్కువ. జనభా కూడా తక్కువే. గ్రామీణ ప్రాంతాలు కూడా ఉత్తర్ ప్రదేశ్ లో ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా విజృంభిస్తే కట్టడి చేయడం కష్టమే. అంతేకాకుండా టూరిస్ట్ హబ్ గా కూడా ఉత్తర్ ప్రదేశ్ ఉంది. వారణాసి, అయోధ్య వంటి పుణ్య క్షేత్రాలున్నాయి.
లాక్ డౌన్ పకడ్బందీగా….
ఇప్పటి వరకూ ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇక్కడ 174 కేసులు మాత్రమే నమోదయ్యాయి. పెద్ద రాష్ట్రంలో ఈ సంఖ్య తక్కువేనన్నది నిపుణుల అంచనా. మరణాల సంఖ్య రెండు మాత్రమే. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడం వల్లనే ఇది సాధ్యమయిందంటున్నారు. నిత్యావసరాలు, మందుల కోసం మినహా ఎవరు రోడ్లపైకి వచ్చినా వెంటనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు. పేదలు ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో లాక్ డౌన్ లో వారిని కట్టడి చేయడం కూడా కష్టసాధ్యమే.
కట్టడితో పాటు సంక్షేమం…..
అయినా యోగి ఆదిత్యానాధ్ సర్కార్ చాలా వరకూ కట్టడి చేయగలిగింది. ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలను కూడా పెద్దయెత్తున అమలు చేసింది. ఒక్కొక్క పేద కుటుంబానికి వెయ్యి రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్ లో వేసింది. ఆ యా కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందించింది. స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో వారికి నిత్యావసర వస్తువులు ఇళ్లకే చేర్చే ప్రయత్నం చేసింది. అందుకే అది పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సయితం ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ కరోనా కట్డడిలో పాలుపంచుకుంటున్నాయి. ఢిల్లీకి ఆనుకున్న ప్రాంతంలోనే ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందింది.