కార్పొరేట్ దారుల్లో కమ్యూనిస్టులు…!
ఎర్రజెండెర్రజెండెన్నీయల్లో.. ఎర్రెర్రనిదీజెండెన్నీయల్లో.. అని పాడుకునే పాటలు కనుమరుగై.. కార్పొరేట్ కర్రలకు వ్యాపార పతకాలు ఎగురుతున్నాయా ? కార్పొరేట్ సంస్థలకు, కార్పొరేట్ విధానానికి కొన్ని దశాబ్దాల పాటు కత్తి [more]
ఎర్రజెండెర్రజెండెన్నీయల్లో.. ఎర్రెర్రనిదీజెండెన్నీయల్లో.. అని పాడుకునే పాటలు కనుమరుగై.. కార్పొరేట్ కర్రలకు వ్యాపార పతకాలు ఎగురుతున్నాయా ? కార్పొరేట్ సంస్థలకు, కార్పొరేట్ విధానానికి కొన్ని దశాబ్దాల పాటు కత్తి [more]
ఎర్రజెండెర్రజెండెన్నీయల్లో.. ఎర్రెర్రనిదీజెండెన్నీయల్లో.. అని పాడుకునే పాటలు కనుమరుగై.. కార్పొరేట్ కర్రలకు వ్యాపార పతకాలు ఎగురుతున్నాయా ? కార్పొరేట్ సంస్థలకు, కార్పొరేట్ విధానానికి కొన్ని దశాబ్దాల పాటు కత్తి దూసిన కమ్యూనిస్టులు నేడు అదే బాటలో పయనిస్తున్నారా ? అంటే.. ఔననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మారుతున్నకాలానికి అనుగుణంగా మార్పు అనివార్యం..! అయితే, అసలు మారాల్సిన పరిస్థితిని పక్కన పెట్టి ఫక్తు వ్యాపారాల్లో మునిగి తేలడం, మీడియాలో హల్చల్ చేసేదుందుకు ప్రాధాన్యం ఇవ్వడమే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తోంది.
కట్టుబాటు…అంకిత భావం….
సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు సెంటరాఫ్‌ది టాపిక్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారిపోయాయి. ఒకప్పుడు కంచుకోటల వంటి నియోజకవర్గాల్లో తిరుగేలేని ఆధిపత్యం చలాయించిన ఈ రెండు పార్టీలూ ఇప్పుడు అస్తిత్వ పోరులో పోటీ పడుతున్నాయి. నిబద్ధత, కట్టుబాటు, అంకిత భావం అనే మాటలను ఎప్పుడో అటకె క్కించిన అభ్యుదయ కమ్యూనిస్టులు..అవకాశవాదానికి తెరలెత్తారనే అపవాదును ఏనాడో మూటగట్టుకున్నారు. నీ ఎడం చెయ్యి.. తీసేయ్.. నా పర్రచెయ్యి పెడతాను! అన్న నానుడి మాదిరిగా పార్టీల్లో ఒకరిపై ఒకరు ఆధిపత్యానికి ప్రయత్నించడం, పార్టీలు ఏమైనా ఫర్వాలేదు…. మనం బాగున్నాం.. అనుకునే నాయకు లు ఇప్పుడు కమ్యూనిస్టులుగా చలామణి అవుతున్నారు.
మీడియా ప్రపంచంలోకి….
ముఖ్యంగా పార్టీ అభిప్రాయాలను చెప్పేందుకు, నాయకుల గళాన్ని వినిపించేందుకు ప్రచురణ రంగాన్ని ఎంచుకున్న కమ్యూనిస్టులు నాడు , నేడు ఎందరో ఉన్నారు. కానీ, నాటి కాలంలో అనుసరించిన విలువలు, నిబద్ధత నేటి కాలంలో కనుమరుగై.. ఫక్తు వ్యాపారాపేక్షతో ముందుకు సాగడమే పార్టీలకు చేటు తెస్తోంది. తెలంగాణలో పురుడుపోసుకున్న సీపీఎంకు చెందిన టీవీ-10 పరిస్థితి కానీ, సీపీఐ వారి 99% ఛానెల్ కానీ ఇదే దుస్థితిని కళ్లకు కడుతున్నాయి. బీదా బిక్కీలను కూడా వీటిలో షేర్ హోల్డర్లను చేసుకుని, వచ్చిన కోట్లాది సొమ్మును ఇతర మార్గాలకు తరలించడం, పెట్టుబడులు పెట్టించడం వాటిని మరో మార్గంలో తమ సొంతం చేసుకోవడం అనేది నేటి కమ్యూనిస్టులకు కరతలామలకమైన విద్య అనే విమర్శల్లో వాస్తవం లేక పోలేదు.
కార్పొరేట్ మాయలో…
కొన్నాళ్ల కిందట టీవీ-10 షేర్లకు సంబంధించి, ఈ ఛానెల్ పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చుట్టూ అనేక విమర్శలు పోగుపడ్డాయి. టీవీ-10 ఆశయానికి చాప చుట్టి.. అమ్మకానికి పెట్టినప్పుడు వీరభద్రం ఆర్థిక వ్యూహాలు తెరమీదకి వచ్చాయి. అయినా వీటిని పట్టించుకునే తీరిక పేరెన్నికగన్న కమ్యూనిస్టు నాయకులకు లేకపోవడం నివ్వెరపాటుకు గురిచేసింది. ఇక, 99% టీవీలోనూ ఇదే బాగోతం బయట పడినప్పుడు.. మౌనమే తప్ప కామ్రేడ్ల దగ్గర సమాధానం కనిపించలేదు. ఉద్యోగులను తీసేస్తున్నారంటూ యాగీ వచ్చినప్పుడు ఉద్యోగ సంఘాలకు పురుడు పోసిన కమ్యూనిస్టు నాయకులు మౌనం పాటించేశారు. తలా ఇంత పుచ్చుకున్నది బయటకు వస్తుందని అనుకున్నారో.. లేక కార్పొరేట్ మాయలో చిక్కుకున్నారోవారికే ? తెలియాలి. మొత్తంగా కమ్యూనిస్టులు కూడా కార్పొరేట్లుగా మారిపోవడం అభినవ భారతంలో ఆలోచనకు గురి చేస్తున్న అంశం.