గొయ్యి తవ్వుకుంటున్న వైసీపీ, టీడీపీలు
దాదాపు నలభయేళ్ళ క్రితం వరకూ ఉమ్మడి ఏపీ ప్రాంతీయ పార్టీల గురించి విని ఎరగదు, అంతకు రెండు దశాబ్దాల క్రితమే పక్కనున్న తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు బలంగా [more]
దాదాపు నలభయేళ్ళ క్రితం వరకూ ఉమ్మడి ఏపీ ప్రాంతీయ పార్టీల గురించి విని ఎరగదు, అంతకు రెండు దశాబ్దాల క్రితమే పక్కనున్న తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు బలంగా [more]
దాదాపు నలభయేళ్ళ క్రితం వరకూ ఉమ్మడి ఏపీ ప్రాంతీయ పార్టీల గురించి విని ఎరగదు, అంతకు రెండు దశాబ్దాల క్రితమే పక్కనున్న తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు బలంగా వేళ్ళూనుకున్నా ఏపీ మాత్రం ఏకమొత్తంగా కాంగ్రెస్ కే జై కొట్టింది. ఎమర్జెన్సీ టైంలో దేశమంతా ఇందిరాగాంధీ నాయకత్వాన ఉన్న కాంగ్రెస్ ని వ్యతిరేకించినా ఏపీలో మాత్రం గెలిపించారు జనాలు. అలా కాంగ్రెస్ కి కంచుకోటలా ఉమ్మడి ఏపీ నిలిచింది. ఆ కోటను నాటి తెలుగు సినీ అగ్ర నటుడు ఎన్టీయార్ బధ్ధలు కొట్టాడు.
స్వయంకృతమే …
అయితే ఎన్టీయార్ ని కాంగ్రెస్ ని ఓడించారు అనే కంటే కాంగ్రెస్ తన సొంత తప్పులతో ఆ పరిస్థితి తెచ్చుకుంది అని చెప్పడంలోనే సబబు ఉంటుంది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నెత్తిన కొరివిలా ప్రాంతీయ పార్టీని తెచ్చిపెట్టుకుంది. అది ఈనాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకు కారణమైంది. అదే విధంగా విభజన ముందు దాకా కేవలం టీడీపీతో మాత్రమే కాంగ్రెస్ కి పోరు ఉండేది. ఆ తరువాత అటు టీయారెస్, ఇటు వైసీపీలతో తో గెలవలేక ఉనికి పోరాటం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే కాంగ్రెస్ అస్థిత్వమే ప్రశ్నార్ధకంగా మారింది.
పాలు పోస్తున్నారా…?
అయితే రోజులు అన్నీ ఒక్కటిగా ఉండవు. దాదాపు ఏడేళ్ల క్రితం విభజన పాపానికి కాంగ్రెస్ కారణం అని అన్ని పార్టీలూ నిందించాయి. కఠిన శిక్షనే జనం వేశారు. అయితే ఆ తరువాత చూస్తే ఏపీలో వరసగా అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపించకుండా సొంత రాజకీయాలకు తెరతీయడాన్ని జనం గమనిస్తున్నారు. అదే సమయంలో తాము కాంగ్రెస్ కంటే గొప్ప అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏపీకి ఏ మాత్రం సాయం చేయకుండా మొండి చేయే చూపించింది. బీజేపీని ఎదిరించలేని నిస్సహాయతలో టీడీపీ, వైసీపీ ఉండడంతో ప్రత్యేక హోదాతో మొదలుపెట్టి పోలవరం ప్రాజెక్ట్, నిలిచిన రాష్ట్ర రాజధాని నిర్మాణం, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం వంటి దాకా కధ నడిచిపోయింది. ఈ నేపధ్యంలో ఏపీ జనాలు రెండు పార్టీలను చూసేశాక, కేంద్రంలోని బీజేపీ తీరుని గమనించాక కాంగ్రెస్ బెటర్ అన్న భావనకు మెల్లగా వస్తున్నారు అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి.
పుంజుకుంటే ముప్పే …?
ఇక జాతీయ స్థాయిలో కూడా బీజేపీ నానాటికీ తగ్గిపోతోంది. రెండు సార్లు గెలిచిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాదన్న చర్చ కూడా ఉంది. అదే సమయంలో దేశంలో మారుతున్న గాలి తనకు అనుకూలం చేసుకోవడానికి కాంగ్రెస్ చూస్తోంది. దాని ప్రభావం ఏపీ మీద కూడా పడవచ్చు అంటున్నారు. ఇక వైసీపీలో నూటికి తొంబై శాతం ఉన్న వారు కాంగ్రెస్ వారే. అదే విధంగా టీడీపీ, బీజేపీలో కూడా వారే ఉన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ కి వేవ్ కనిపిస్తే మళ్లీ అటువైపుగా వెళ్ళేవారికి కొదవ ఉండదు, కాంగ్రెస్ వస్తేనే విభజన కష్టాలలో ఉన్న ఏపీకి బతుకూ తెరువూ దక్కుతాయన్న భావన మెల్లగా మేధావుల నుంచి మధ్యతరగతి వర్గాలకు పాకుతున్న వేళ ఇకనైనా కేంద్రంలోని బీజేపీని ఎదిరించి ఏపీకి న్యాయం చేయకపోతే వైసీపీ, టీడీపీకి రాజకీయ కష్టాలు తప్పవని అంటున్నారు.