అక్కడా కాంగ్రెస్ ఖాళీ అవుతుందిగా?
చెరువుకు చిన్న గండి పడితే చాలు నీరు మొత్తం పల్లానికి చేరి ఖాళీ అవుతుంది. ఇది సత్యం. రాజకీయాలకు కూడా ఈ సామెత అతీతం కాదు. ఎక్కడ [more]
చెరువుకు చిన్న గండి పడితే చాలు నీరు మొత్తం పల్లానికి చేరి ఖాళీ అవుతుంది. ఇది సత్యం. రాజకీయాలకు కూడా ఈ సామెత అతీతం కాదు. ఎక్కడ [more]
చెరువుకు చిన్న గండి పడితే చాలు నీరు మొత్తం పల్లానికి చేరి ఖాళీ అవుతుంది. ఇది సత్యం. రాజకీయాలకు కూడా ఈ సామెత అతీతం కాదు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు. దేశంలో ఏ రాష్ట్రం.. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరో నాలుగేళ్ల పాటు పార్టీని, పార్టీ నేతలను కాపాడుకోవాల్సిన సమయంలో ఉన్న నేతలు విడిచివెళ్లిపోతున్నారు.
మొన్నటి వరకూ గుజరాత్…..
నిన్న మొన్నటి వరకూ గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోయారు. దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. దీనికి ప్రధాన కారణం రాజ్యసభ ఎన్నికలే. బీజేపీ ఆపరేషన్ ఆకర్స్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లొంగిపోయారనే చెప్పాలి. మరోవైపు గత దశాబ్దాలుగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంది. దీంతో అక్కడి నేతలు క్రమంగా పార్టీకి దూరమవుతున్నారు. అయితే ఇక్కడ ఇటీవల కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
నష్ట నివారణ చర్యలు చేపట్టినా…..
పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ను గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. దీనివల్లనైనా కొంత వలసలు ఆగుతాయన్నది కాంగ్రెస్ హైకమాండ్ భావనగా ఉంది. ఇక రాజస్థాన్ సంగతి చెప్పనవసరం లేదు. ఇప్పటికే 19 మంది ఎమ్మెల్యేలు పార్టీని కాదని సచిన్ పైలట్ తో వెళ్లిపోయారు. వీరికి తోడుగా మరికొందరు రెడీగా ఉన్నారన్న వార్తలు కాంగ్రెస్ పార్టీని ఆందోళన కల్గిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లోనూ వలసలు…..
తాజాగా మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వరసగా రాజీనామాలు చేస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియా దెబ్బకు అక్కడ కమల్ నాధ్ సర్కార్ కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఇద్దరి ఎమ్మెల్యేల రాజీనామాతో ఆగదని, మరికొందరు అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజీపీ తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం వరసగా ఎమ్మెల్యేలను కోల్పోతుంది.