Congress : ఇక ముందున్నవన్నీ కష్టాలేనా?
కాంగ్రెస్ పార్టీ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్లే కనపడుతుంది. గత కొద్ది నెలలుగా శాంతించిన సీనియర్లు మరోసారి గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. వారు పంజాబ్ ఎపిసోడ్ ను అట్టర్ [more]
కాంగ్రెస్ పార్టీ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్లే కనపడుతుంది. గత కొద్ది నెలలుగా శాంతించిన సీనియర్లు మరోసారి గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. వారు పంజాబ్ ఎపిసోడ్ ను అట్టర్ [more]
కాంగ్రెస్ పార్టీ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్లే కనపడుతుంది. గత కొద్ది నెలలుగా శాంతించిన సీనియర్లు మరోసారి గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. వారు పంజాబ్ ఎపిసోడ్ ను అట్టర్ ఫెయిల్యూర్ షో గా చూపుతున్నారు. కాంగ్రెస్ కు శాశ్వత అధ్యక్షుడు లేకపోవడంతోనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. పంజాబ్ పార్టీలో సంక్షోభం, అమరీందర్ ను తొలగింపు, సిద్ధూ నియామకం వంటి విషయాలలో సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అతి పెద్ద తప్పిదమంటూ…
పంజాబ్ ఎన్నికలకు ముందు అధినాయకత్వం చేసిన అతి పెద్ద తప్పిదంగా వారు చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కు సన్నిహితులైన వారు ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అమరీందర్ సింగ్ ను ఉద్దేశించే ఆయన ఈ కామంట్స్ చేశారు. సన్నిహితులు కాని వారే పార్టీలో ఉన్నారని ఆయన అనడం విశేషం. కపిల్ సిబాల్ వ్యాఖ్యలను మరో సీనియర్ నేత శశిధరూర్ సమర్థించారు.
రాహుల్ జోక్యం వల్లనే…
ఇక పంజాబ్ తో పాటు ఛత్తీస్ ఘడ్ లోనూ ప్రభుత్వంలో అసంతృప్తి బయలుదేరింది. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని వత్తిడి తెస్తున్నారు. దీనిపై కూడా పార్టీ నాయకత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పంజాబ్ విషయంలో సోనియా కాకుండా రాహుల్, ప్రియాంకలు జోక్యం చేసుకోవడ వల్లనే ఈ పరిస్థితి దాపురించిందన్నది కాంగ్రెస్ సీనియర్ నేతల అభిప్రాయం. వారు ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా పరోక్షంగా తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు.
కొత్త అధ్యక్ష ఎన్నికలకు…
23 మంది సీనియర్ నేతలు గతంలో కాంగ్రెస్ అధినాయకత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏఐసీసీ సమావేశం ఏర్పాటు చేసి కొత్త అధ్యక్ష ఎన్నికకు సిద్ధమవుతామని హైకమాండ్ ప్రకటించింది. కానీ కరోనా కారణంగా వాయిదా వేసింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. నిర్ణయాలు మాత్రం తనవే అమలు చేస్తున్నారు. సీనియర్ల అభిప్రాయాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది రాహుల్ పై ఉన్న కంప్లైంట్. పంజాబ్, యూపీ, గుజరాత్ ఎన్నికల తర్వాత సీనియర్లు మరోసారి అధినాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.