గోవిందుడినే గోల్ మాల్ చేస్తున్నారే?
కలియుగ దైవం గా హిందువులు కొలిచే తిరుమల వేంకటేశ్వరుడి కి వివాదాలు కొత్తేమీ కాదు. కానీ మతవిశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా జగన్ సర్కార్ వచ్చిన నాటి నుంచి [more]
కలియుగ దైవం గా హిందువులు కొలిచే తిరుమల వేంకటేశ్వరుడి కి వివాదాలు కొత్తేమీ కాదు. కానీ మతవిశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా జగన్ సర్కార్ వచ్చిన నాటి నుంచి [more]
కలియుగ దైవం గా హిందువులు కొలిచే తిరుమల వేంకటేశ్వరుడి కి వివాదాలు కొత్తేమీ కాదు. కానీ మతవిశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా జగన్ సర్కార్ వచ్చిన నాటి నుంచి ప్రచారం బాగా పెరిగిపోయింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఇలాగే మతపరమైన వివాదాలను ఆయన ప్రత్యర్ధులు పెద్ద ఎత్తునే తెరపైకి తెచ్చారు. ఏడు కొండలు వెంకటేశ్వరుడివి కావని నాడు నడిచిన హై డ్రామా అందరికి తెలిసిందే. దీనిపై ఏడుకొండలు గోవిందుడివే అని చివరికి ప్రభుత్వం జీవో విడుదల చేయాలిసిన పరిస్థితికి రాజకీయాలు సాగాయి. నేడు కూడా అదే విధంగా ఎపి రాజకీయాల్లో శ్రీనివాసుడు పావుగా మారిపోయాడు.
తిరుమల నిధులపై …
తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ప్రభుత్వం మసీదులు, చర్చిలకు దారి మళ్ళిస్తుందంటూ మరోసారి తప్పుడు ప్రచారానికి తెరలేచింది. సాక్షాత్తు ప్రధాని రక్షణ సలహాదారుడు అజిత్ దోవల్ పేరిట ట్విట్టర్ లో స్క్రీన్ షాట్ కొట్టినట్లు కొందరు సృష్ట్టించి దానిలో టిటిడి వేలకోట్లరూపాయల నిధులు ఇతర మతాల అభివృద్ధికి కేటాయించింది అంటూ పోస్ట్ లు పెట్టి వైరల్ చేశారు వైసిపి ప్రత్యర్ధులు. ఇది దేశవ్యాప్తంగా హిందూ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
ఫేక్ న్యూస్ తో……
దీనిపై టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఖండించుకోవాలిసిన పరిస్థితికి దారి తీసింది. అజిత్ పేరిట వచ్చింది ఫేక్ అని ఆయన చెప్పుకున్నారు. వాస్తవానికి టిటిడి లో రూపాయి ఖర్చు చేయాలిసి వున్నా అనేక నిబంధనలు బోర్డు నిర్ణయాలు బోల్డంత తతంగం ఉంటుంది. కానీ తప్పుడు వార్తలకు ఎలాంటి వివరణలు, ఆధారాలు అవసరం లేదు కనుక ఇలాంటి వి వేగంగా ప్రచారం లో దూసుకుపోతున్నాయి. దీనికి బాధ్యులను గుర్తించి గట్టి చర్యలు తీసుకోకపోతే ప్రమాదకర పరిణామాలు జరిగే అవకాశాలు వున్నాయి.