రాజమండ్రి వైసీపీ లో ఆగని కలకలం
రాజమండ్రి వైసీపీ పార్టీ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. వైసీపీ ఎంపి మార్గాని భరత్ రామ్ గన్ మ్యాన్, ఫోటోగ్రాఫర్ లకు కరోనా సోకడంతో ఆ ఇద్దరితో [more]
రాజమండ్రి వైసీపీ పార్టీ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. వైసీపీ ఎంపి మార్గాని భరత్ రామ్ గన్ మ్యాన్, ఫోటోగ్రాఫర్ లకు కరోనా సోకడంతో ఆ ఇద్దరితో [more]
రాజమండ్రి వైసీపీ పార్టీ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. వైసీపీ ఎంపి మార్గాని భరత్ రామ్ గన్ మ్యాన్, ఫోటోగ్రాఫర్ లకు కరోనా సోకడంతో ఆ ఇద్దరితో సన్నిహితంగా ఉన్నవారు ఎంపి కార్యాలయానికి వెళ్లివచ్చేవారు టెస్ట్ లకు క్యూ కట్టారు. ఇది ఇలా ఉంటె మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్య ప్రకాశరావు కరోనా బారిన పడ్డారు. ఎంపి భరత్ గ్రూప్ లో చురుగ్గా రౌతు ఉండటం తో వైరస్ ఆయనకు అటాక్ అయినట్లు పరీక్షల్లో తేలింది. ఆయనతో పాటు ఒక జర్నలిస్ట్ కి వైరస్ సోకడంతో ఒక్కసారిగా వైసీపీ నేతల్లో ఆందోళలన పెరిగింది. జర్నలిస్ట్ లు కరోనా టెస్ట్ లు చేయించుకున్నారు.
ఎస్వీఆర్ జయంతి లో ….
కరోనా ఫలితానికి ముందు మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్యప్రకాశరావు విశ్వవిఖ్యాత నటుడు ఎస్వీ రంగా రావు జయంతి లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం గోదావరి బండ్ పై అట్టహాసంగా సాగింది. రాజమండ్రి లోని వైసీపీతో సహా అన్ని పార్టీల్లోని ప్రముఖులు ఈ జయంతి కి హాజరయ్యారు. వారంతా రౌతు కి పాజిటివ్ వార్త తో ఎవరికి వారు స్వీయ నిర్బంధం లోకి వెళ్లిపోయారు. కొందరు కరోనా టెస్ట్ లు చేయించుకోవడం మొదలు పెట్టారు.
ఆందోళన వద్దు …
వైరస్ పాజిటివ్ వచ్చిన రౌతు సూర్యప్రకాశ రావు ఇంటి వద్దే క్వారంటైన్ అయ్యారు. ఎలాంటి భయం అవసరం లేదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరికి ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా ను జయించి త్వరలోనే అందరి ముందుకు వస్తానని రౌతు తన సందేశం ఇచ్చారు. వైసీపీ నేతలు కార్యకర్తలు తనతో సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని ఏ ఒక్కరూ అధైర్యపడాలిసిన పని లేదంటున్నారు ఆయన. దాంతో రాజమండ్రి వైసీపీ సిటీ కార్యాలయం కరోనా టెస్ట్ ల కేంద్రంగా మారింది. అనుమానితులందరికి ఇక్కడ పరీక్షలు నిర్వహించారు వైద్య సిబ్బంది. ఈ వార్త మాత్రం జిల్లా వ్యాప్తంగా సంచలనమే అయ్యింది.