“‘సినిమా” కష్టాలంటే ఇలాగే ఉంటాయి మరి
తెలుగు రాష్ట్రాల వారికి సినిమాలు అంటే అంతా ఇంతా క్రేజ్ కాదు. సినిమాలు లేనప్పుడు నాటకాలను, తోలుబొమ్మలు ఆటలు, వీధి నాటకాలు, బుర్రకథలు ప్రోత్సహించిన ప్రజలు మారిన [more]
తెలుగు రాష్ట్రాల వారికి సినిమాలు అంటే అంతా ఇంతా క్రేజ్ కాదు. సినిమాలు లేనప్పుడు నాటకాలను, తోలుబొమ్మలు ఆటలు, వీధి నాటకాలు, బుర్రకథలు ప్రోత్సహించిన ప్రజలు మారిన [more]
తెలుగు రాష్ట్రాల వారికి సినిమాలు అంటే అంతా ఇంతా క్రేజ్ కాదు. సినిమాలు లేనప్పుడు నాటకాలను, తోలుబొమ్మలు ఆటలు, వీధి నాటకాలు, బుర్రకథలు ప్రోత్సహించిన ప్రజలు మారిన కాలంతోపాటు సినిమాలకు అతుక్కుపోతూ వచ్చారు. మనసును ఆహ్లాదపరుస్తూ మానసిక ఉత్తేజాన్ని మాత్రమే కాదు సామాజిక సందేశాలతో ప్రజల్లో మార్పును సైతం తెచ్చేవి సినిమాలే. ఈ రంగంపై ఆధారపడి లక్షలమంది తెలుగు రాష్ట్రాల్లో జీవనయానం సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా రూపంలో సినీమా రంగానికి కాటు పడింది.
వైరస్ కు చెక్ పడేవరకు …
కరోనా వైరస్ కి పూర్తి స్థాయిలో చెక్ పడేవరకు సినిమాలను చూసేందుకు ప్రజలు థియేటర్లకు వెళ్ళే పరిస్థితి లేదు. ఈ మహమ్మారి ఎప్పటికి అంతం అవుతుందో ప్రపంచమే నేడు చెప్పలేకపోతుంది. లాక్ డౌన్ ఎత్తివేసినా థియేటర్లు కు మాత్రం ఆంక్షలను సర్కార్ తప్పని సరి చేయడం ఖాయం. అది ఎన్ని రోజులు ఎన్ని నెలలు అన్నది దేశంలో కరోనా వ్యాప్తి ని నిరోధించడంపైనే ఆధారపడి ఉంటుందన్నది తేలిపోతుంది. సామాజిక దూరం తప్పకుండా పాటిస్తేనే వైరస్ ను నిరోధించే వీలు వున్నప్పుడు సినిమాల షూటింగ్ నుంచి విడుదల వరకు అన్ని సమస్యలే.
ఇప్పటికే దీనావస్థలో ….
అసలే పెద్ద సంఖ్యలో చిత్రాల నిర్మాణం లేక ఇప్పటికే చాలా థియేటర్లు కళ్యాణమండపాలు, భారీ అపార్ట్ మెంట్ లుగా నగరాల్లో మారిపోయాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్ , హాలీవుడ్ వరకు సంక్షోభం నెలల తరబడి కొనసాగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో చిత్ర పరిశ్రమలో లక్షల్లో ఉపాధి అవకాశాలు కళాకారులు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది. లాక్ డౌన్ రోజుల్లోనే చాలామంది పేద కళాకారులు పెయిడ్ ఆర్టిస్ట్ లు రోడ్డున పడిపోయారు. మరికొంత కాలం అన్ని రంగాల వారికన్నా ఈ పరిశ్రమపైనే ఉండే అవకాశాలు ఉండటంతో ఈ కష్టాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేయలేని దుస్థితి ఎదురౌతుంది. ప్రభుత్వమే ఈ పరిశ్రమ పై ఆధారపడిన వారిని అక్కున చేర్చుకోకపోతే వీరి జీవితాలు ఛిద్రం అయ్యే ప్రమాదమే ఉంది