సెప్టంబరు టెన్షన్… అదే జరిగితే?
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అయితే నిపుణల అంచనా ప్రకారం సెప్టంబరులో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. [more]
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అయితే నిపుణల అంచనా ప్రకారం సెప్టంబరులో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. [more]
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అయితే నిపుణల అంచనా ప్రకారం సెప్టంబరులో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాదాపు కోటి వరకూ భారత్ లో కేసులు చేరే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో కరోనా వైరస్ కేసులు ఏడు లక్షలకు చేరువలో ఉన్నాయి. మరణాల సంఖ్య ఇరవై వేలు దాటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అన్ని రకాల అధ్యయనాలు అప్రమత్తం చేస్తున్నాయి.
కేసుల సంఖ్య పెరుగుతుండటంతో…
లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో దేశంలో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. రోజుకు వెయ్యి కేసులకు మించలేదు. అప్పటి దాకా కొద్దికొద్దిగా ఉన్న కరోనా కేసులు జూన్ నెలలో నాలుగు లక్షలు పెరిగాయి. ఒక్క నెలలోనే నాలుగు లక్షల కేసులు పెరిగాయంటే కరోనా వ్యాప్తి ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి సెప్టెంబర్ వరకూ కొనసాగుతుందని, ఆ నెలలో పీక్ స్టేజీకి వెళ్లే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
మరోసారి లాక్ డౌన్ పై….
కేవలం భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో మరసారి లాక్ డౌన్ పై చర్చ ప్రారంభమయింది. ఇప్పటికే ప్రధాని మోదీ మరోసారి లాక్ డౌన్ ఉండదని ప్రకటించారు. అయితే రాష్ట్రాలు మాత్రం పరిస్థితిని బట్టి లాక్ డౌన్ ను పెంచుకునే యోచనలో ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ నెల 31వ తేదీ వరకూ లాక్ డౌన్ ను ప్రకటించాయి. దీనిని మరో నెల పెంచాలని కూడా ఆ రాష్ట్రాలు భావిస్తున్నాయి.
కలవరంలో రాష్ట్రాలు…..
మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. తమిళనాడులో లక్ష కేసులు దాటిపోయాయి. ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. అన్ లాక్ చేయడంతోనే కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా కొన్ని చోట్ల కట్టడి చేయలేకపోతున్నారు. మరో ప్రమాదకరమైన విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించింది. వైరస్ వ్యాప్తి మరింత వ్యాప్తి చెంది ఘోరంగా ఉండబోతుందన్న నిపుణుల హెచ్చరికలు, అధ్యయనాలు రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి. సరిపడ వైద్య సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి సెప్టంబరు టెన్షన్ అన్ని రాష్ట్రాలను కుదిపేస్తుంది.