అన్ లాక్ తో ఈ అవస్థలు.. మరోసారి లాక్ డౌన్?
అన్ లాక్ తో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తుంది. అందుకే మరోసారి లాక్ డౌన్ దిశగా [more]
అన్ లాక్ తో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తుంది. అందుకే మరోసారి లాక్ డౌన్ దిశగా [more]
అన్ లాక్ తో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తుంది. అందుకే మరోసారి లాక్ డౌన్ దిశగా యడ్యూరప్ప సర్కార్ ఆలోచనలు చేస్తుంది. మరో వైపు ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని యడ్యూరప్ప నిర్ణయించారు. మిగిలిన రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తే యడ్యూరప్ప ప్రభుత్వం మాత్రం కర్ణాటకలో కొనసాగించడం విమర్శలకు తావిచ్చింది.
పదో తరగతి పరీక్షలు….
ఏపీ, తమిళనాడు, తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. అయితే కర్ణాటక లో మాత్రం భౌతిక దూరం పాటిస్తూ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ లాక్ తర్వాత కర్ణాటకలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పదిహేను వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వలస కార్మికులు తిరిగి కన్నడ రాష్ట్రానికి చేరుకుంటుండటంతో కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాలకూ….
బెంగుళూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా వైరస్ విస్తరించింది. దీంతో ఆందోళన మొదలయింది. విపక్షాలు కూడా కరోనా కట్డడిలో యడ్యూరప్ప సర్కార్ విఫలమయిందని ఆరోపిస్తున్నాయి. అంతేకాదు వలసకార్మికుల ప్యాకేజీ, మందుల కొనుగోళ్లలో కూడా అవకతవకలు పెద్దయెత్తున జరిగాయన్నది కాంగ్రెస్, జేడీఎస్ లు ఆరోపిస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పుకోలేక యడ్యూరప్ప సతమతమవుతున్నారు.
కఠిన ఆంక్షల అమలుకు…..
మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే జులై 5వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు ఉండటంతో ఆంక్షలు మరింత కఠినం చేయాలని యడ్యూరప్ప నిర్ణయించారు. అలాగే రాత్రి వేళల్లో కర్ఫ్యూ కూడా కొనసాగించనున్నారు. కంటెయిన్ మెంట్ జోన్ లలోనూ ఆంక్షలను మరింత కఠినం చేశారు. మొత్తం మీద కేసుల సంఖ్య పెరుగుతుండటం యడ్యూరప్పను ఆందోళనలోకి నెట్టేసింది.