గుండెల్లో “రైళ్లు” పరిగెడుతున్నాయ్
కరోనా మహమ్మారి ఒక పక్క వెంటాడుతుంది. కనిపించని శత్రువుపై యుద్ధం చేయడానికి దాక్కోవడం ఒక్కటే పరిష్కారం అని అన్ని దేశాలు భావించాయి. శత్రువు బలం, బలహీనత గమనించాక [more]
కరోనా మహమ్మారి ఒక పక్క వెంటాడుతుంది. కనిపించని శత్రువుపై యుద్ధం చేయడానికి దాక్కోవడం ఒక్కటే పరిష్కారం అని అన్ని దేశాలు భావించాయి. శత్రువు బలం, బలహీనత గమనించాక [more]
కరోనా మహమ్మారి ఒక పక్క వెంటాడుతుంది. కనిపించని శత్రువుపై యుద్ధం చేయడానికి దాక్కోవడం ఒక్కటే పరిష్కారం అని అన్ని దేశాలు భావించాయి. శత్రువు బలం, బలహీనత గమనించాక ఇది అందరికి అర్ధం అయ్యాకా బయటకు వచ్చి యుద్ధం మొదలు పెట్టాలిసిన తరుణం ఆసన్నం అయ్యింది. ఇంకా దాక్కొని ఉంటే ఆకలి చావులు తప్పవు. ఈ నేపథ్యంలోనే లాక్ చేసిన భారత్ నెమ్మది నెమ్మదిగా తాను విధించుకున్న బంధనాల నుంచి బయటకు వస్తున్నది. అందులో భాగమే ప్రజా రవాణా వ్యవస్థ ను పట్టాలు ఎక్కించడం.
భారతీయ జీవనాడి రైల్వే …
భారతీయుల జీవనాడి రైల్వే వ్యవస్థ. లక్షలమంది ప్రయాణికులను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి గమ్యస్థానాలకు చేర్చే రైల్వే దేశ ప్రగతికి నిజంగా నాడి వ్యవస్థే. లాక్ డౌన్ మొదలయ్యాక ప్రయాణికులను మోసుకు వెళ్ళే రైళ్లు కూడా ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. దీన్ని క్రమంగా మొదలు పెట్టకపోతే ఊహించనంత నష్టమే. ఆర్ధికంగా ఎదుర్కోవాలి. ఇది విజయవంతం అయ్యాక రోడ్డు రవాణా, విమాన సర్వీసులు మొదలు పెట్టాలిసి ఉంది. దీనికి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్న కేంద్రం రాష్ట్రాలనుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటుంది.
విస్తరిస్తున్న కరోనా …
అయితే వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా ఇంకా విస్తరిస్తుంది. ఒక్క కేరళ తప్ప వైరస్ కర్వ్ అన్ని చోట్లా విజృంభిస్తుంది. ఈ దశలో రైల్వే వ్యవస్థ ప్రారంభించడం కత్తిమీద సామే. వైరస్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాల నుంచి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వచ్చి పడితే వారిని క్వారంటైన్ చేయడం చిన్న విషయం కాదన్నది టి సిఎం కేసీఆర్ తో బాటు ఎపి సిఎం జగన్, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రుల ఆందోళనే కాదు చాలా మందిలో ఇదే అభిప్రాయం ఉంది. లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతున్న ముఖ్యమంత్రులు మరోపక్క రైల్వే ను మొదలు పెట్టేయడంతో బాబోయ్ అనేస్తున్నారు.
తాము అనుకున్నదే..
అయితే మద్యం అమ్ముకోండి ఆదాయం తెచ్చుకోమని కేంద్రం పర్మిషన్ ఇవ్వగానే చంకలు గుద్దుకుని గేట్లు ఎత్తేసిన రాష్ట్రాలు ఇప్పుడు మాత్రం రైళ్లు మొదలు అవుతాయనగానే ఖంగారు పడటాన్ని మరికొందరు తప్పుపడుతున్నారు. అయితే ఎవరి గోల ఎలా ఉన్నా కేంద్రం అందరి అభిప్రాయాలను తీసుకుంటూనే తాము అనుకున్నదే చేస్తుంది. ఇదిలా ఉంటే కరోనా తో సహజీవనం చేయక తప్పదని ఎప్పుడో చెప్పేసిన ఎపి ముఖ్యమంత్రి చెప్పిన మాటే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు ఇప్పుడు అంగీకరించడం గమనార్హం.