గుంటూరును వదలిపెట్టకుండా?
కరోనా వైరస్ తో గుంటూరు జిల్లా వణికిపోతుంది. నిన్న మొన్నటి వరకూ గుంటూరు, నరసరావుపేట వంటి పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలకు పాకింది. [more]
కరోనా వైరస్ తో గుంటూరు జిల్లా వణికిపోతుంది. నిన్న మొన్నటి వరకూ గుంటూరు, నరసరావుపేట వంటి పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలకు పాకింది. [more]
కరోనా వైరస్ తో గుంటూరు జిల్లా వణికిపోతుంది. నిన్న మొన్నటి వరకూ గుంటూరు, నరసరావుపేట వంటి పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలకు పాకింది. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య మరింత ఎక్కవుగా ఉంది. తొలినుంచి ఏపీలో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే కరోనా వైరస్ అధికంగా కన్పిస్తుంది. పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలోనూ కేసుల సంఖ్య వేయి దాటింది.
తొలుత మర్కజ్ నుంచి….
గుంటూరు జిల్లాలో తొలుత మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి కరోనా వైరస్ రావడం ప్రారంభమయింది. గుంటూరు పట్టణంలో తొలుత వైరస్ కన్పించినా లాక్ డౌన్ విధించడంతో కొంత కంట్రోల్ లో ఉన్నట్ల కన్పించలేదు. లాక్ డౌన్ అమలులో ఉన్నా రోజుకు ముప్పయి నుంచి నలభై కేసులు నమోదయ్యాయి. గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు పర్చారు.
నిబంధనలను సడలించడంతో…
లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. జిల్లాల మధ్య రాకపోకలపై నిషేధాలను తొలగించడం కూడా కేసుల సంఖ్య పెరగడానికి ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వారితోనే వైరస్ ఎక్కువగా వస్తుందని అధికారులు లెక్కలతో చెబుతున్నారు. అయినా సరే గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
రోజురోజుకూ పెరుగుతున్న…..
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 800 కు దాటింది. ఈ కేసుల సంఖ్య వెయ్యి చేరడానికి ఎంతో సమయం పట్టదంటున్నారు. గుంటూరు, తాడేపల్లి, వినుకొండ ప్రాంతాల్లో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒకే కుటుంబంలోని వ్యక్తులకు కరనా సోకింది. అయితే నిన్నటి వరకూ పట్టణాలకే పరిమితమైన కరోనా నేడు పల్లెలకు సోకుతుండటం ప్రమాద ఘంటికలు మోగడమేనంటున్నారు.