ప్రాణాలు వారివే విలువైనవా … కష్టంలో కక్కుర్తి
కరోనా వైరస్ శృతిమించి రాగాన పడుతుంది భారత్ లో. దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉపద్రవాన్ని అయినా ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం అవుతున్నాయి. ఇదంతా [more]
కరోనా వైరస్ శృతిమించి రాగాన పడుతుంది భారత్ లో. దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉపద్రవాన్ని అయినా ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం అవుతున్నాయి. ఇదంతా [more]
కరోనా వైరస్ శృతిమించి రాగాన పడుతుంది భారత్ లో. దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉపద్రవాన్ని అయినా ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం అవుతున్నాయి. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే వైరస్ వ్యాప్తి పై ఒక పక్క అంతా ఆందోళన చెందుతుంటే కాసులకు కక్కుర్తిపడి మాస్క్ ల నుంచి నిత్యావసరాల వరకు అన్ని ధరలను ఎంతోకొంత పెంచి సొమ్ము చేసుకునేవారు క్రమంగా పెరుగుతున్నారు. మరణ మృదంగం వినిపిస్తున్న ఇటలీలో తమ డబ్బు తమ ఆరోగ్యాన్ని కాపాడలేదంటూ కరెన్సీని రోడ్లపైకి విసిరేస్తున్నారంటూ నెట్టింట్లో ఫోటోలు వైరస్ లాగానే వైరల్ అవుతున్నాయి. అయితే భారతీయ ధనవంతుల్లో చాలా మంది ఇంకా బుద్ధి మాంద్యం లోనే ఉన్నారా అని కొన్ని చర్యలు అనుమానం రేకెత్తిస్తున్నాయి.
ఇటలీ అనుభవాలతో …
ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లో సుమారు 10 శాతం దేశ జనాభాకు సరిపడా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. భారత్ వంటి అత్యంత జనాభా తో కూడిన చోట మాత్రం 130 కోట్లకు ఒక్కశాతమే వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స లో అత్యంత కీలకమైనది వెంటిలేటర్. ఆ వెంటిలేటర్ లు 80 వేలమందికి ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉన్నాయి అంటే దేశం వైద్యరంగంపై దృష్టి ఎంత పెడుతుందో స్పష్టమౌతుంది. ఇటలీ స్పెయిన్ వంటి దేశాల్లో సైతం వెంటిలేటర్ల కొరత ఏర్పడింది అంటే భారత్ లో అలాంటి స్థితి వస్తే మా గతేమిటి అనుకున్నారు డబ్బున్న మారాజులు. అందుకే వెంటనే అప్రమత్తం అయిపోయారంట.
వెంటిలేటర్ లు మాయం ….
ఢిల్లీ లో కరోనా ప్రభావం మొదలు కాకముందు ఒక వెంటిలేటర్ లు విక్రయించే బడా వ్యాపారి దగ్గర ఆరువేల వెంటిలేటర్ లు ఉంటే వైరస్ వైపతి భారత్ లో మొదలు అవుతుంటే ఇప్పుడు కేవలం 12 మాత్రమే అందుబాటులో ఉన్నాయంటే అంతా షాక్ అవుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవడం ఇక్కడ గమనార్హం. కోట్లకు పడగలెత్తిన వారు ఒకటి కొని పడేస్తే అవసరం వస్తే పనికొస్తుందని అనుకుని అసలు వైద్యం అందించాలిసిన వారికి కొరత సృస్ట్టించేయడం విమర్శలకు తెరతీసింది. వెంటిలేటర్లను ఇలాంటివారి వివరాలు సేకరించి కేంద్రం స్వాధీనం చేసుకుంటే వేలమంది ప్రాణాలు కాపాడే అవకాశం దక్కుతుంది. అయితే వీరంతా సొంత సొమ్ముతో కొనుగోలు చేయడం తో బాటు కోట్లకు పడగలెత్తిన వారు కావడంతో వారి జోలికి ఏ సర్కార్ వెళుతుంది. మానవతా దృక్పధంతో దేశవాసులు కాష్టాల్లో ఉన్నారని వారు ముందుకు రావాలి తప్ప ఇప్పుడు ఎవ్వరు ఏమి చేసేదేమి లేదు మరి. అయితే ఇలాంటి కీలక వైద్య పరికరాలు ఎవరికీ బడితే వారికి విక్రయించకుండా కీలక చట్టం చేయడమో తక్షణ అవసరం కనుక ఆర్డినెన్స్ అయినా మోడీ సర్కార్ తీసుకురావాలి.