వామ్మో .. కార్పొరేట్ ఆసుపత్రి… దానికంటే?
మనిషికి రోగం రాకూడదు…. రోగం వస్తే వైద్యానికి సరిపడా డబ్బులుంటేనే రోగం తెచ్చుకునే సాహసం చేయాలి. అప్పో సప్పో చేసి రోగాన్ని తగ్గించుకోవడం మళ్ళీ రోగాల బారిన [more]
మనిషికి రోగం రాకూడదు…. రోగం వస్తే వైద్యానికి సరిపడా డబ్బులుంటేనే రోగం తెచ్చుకునే సాహసం చేయాలి. అప్పో సప్పో చేసి రోగాన్ని తగ్గించుకోవడం మళ్ళీ రోగాల బారిన [more]
మనిషికి రోగం రాకూడదు…. రోగం వస్తే వైద్యానికి సరిపడా డబ్బులుంటేనే రోగం తెచ్చుకునే సాహసం చేయాలి. అప్పో సప్పో చేసి రోగాన్ని తగ్గించుకోవడం మళ్ళీ రోగాల బారిన పడటం సహజం కాబట్టి పుట్టిన వారు రోగులు అవడం అనివార్యమని సరిపెట్టుకోవాలి. ఇదంతా మనలో చాలా మందికి అనుభవమే అయినా ఆస్పత్రుల తీరు చూస్తే కొన్ని సార్లు కడుపు మండిపోద్ది. మూడు నెలల క్రితం రాసి పెట్టుకున్న విషయం…. ఇప్పుడు కరోనా రూపంలో వారి మీద నా అక్కసు వెళ్ల గక్కే అవకాశం దక్కింది. కరోనా విజృంభిస్తున్నా కార్పొరేట్ ఆసుపత్రులు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఆరోగ్య శ్రీ డబ్బులు దండుకునే కార్పొరేట్ ఆసుపత్రులు కష్ట సమయంలో మాత్రం రోగులను పట్టించుకోవడం మానేశాయి. వాళ్ళ మీద కోపం ఉన్నా ఆ ఆస్పత్రి పేరు ఇప్పుడు బయట పెట్టను.
నా స్వీయ అనుభవం….
మా పెద్దక్క శ్వాసకోశ సమస్యతో బెజవాడలోనే బాగా పేరున్న హాస్పిటల్ లో నవంబర్ 14న జాయిన్ అయ్యింది. గతంలో ఉన్న సమస్య కావడం., ఉన్న ఊళ్ళో నయం కాకపోవడంతో విజయవాడ వచ్చి ఆ మల్టీ స్పెషలిటీలో చేరారు. మనకున్న జర్నలిస్ట్ పరిచయాలతో వైద్యులు కూడా మనసుకు స్వాంతన దక్కేలా తక్షణ స్పందన అక్కడ లభించింది. ఎమర్జెన్సీలో చెక్ చేసిన డాక్టర్ శరీరంలో ఆక్సిజన్ తగ్గుతోంది అని మొదట అన్నారు. ఆస్పత్రిలో చేరే సమయంలో మాది కార్డియాక్ ఆస్పత్రి…. పలమనలజీ స్పెషలిస్ట్ ఇక్కడ ఉండరు…. డబ్బులు కడితే ట్రీట్మెంట్ చేస్తామని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇన్సూరెన్స్ ఉంటే వాటి మీద ట్రీట్మెంట్ చేస్తామని చెప్పాక., అలాంటివి ఏమి లేవని డబ్బు కట్టడానికి ఒప్పుకున్నాక ఐసీయూకి షిఫ్ట్ చేశారు.
బిల్ క్లియర్ చేసిన తర్వాత కూడా….
ఆస్పత్రిలో చేరాక వైద్యుల పరిశీలనలో ఓవర్ వెయిట్ వల్ల కొండ నాలుక గొంతుకు అడ్డం పడుతోంది అన్నారు. ఆ తర్వాత శరీరంలో సోడియం నిల్వలు తగ్గుతున్నాయి అని ఐవిల ద్వారా సోడియం ఇచ్చారు. శ్వాస మెరుగు పడటానికి సిపాప్ మెషీన్ వాడుతూ , స్నిప్ అమ్నీయా టెస్ట్ లు చేశారు. లైఫ్ సపోర్ట్ కోసం జీవితాంతం సిపాప్, పైపాప్ వాడాలి అంటే వెంటనే అది కొన్నాం…. డిశ్చార్జ్ అయ్యే సమయానికి మనిషి ఒళ్ళంతా వాపు వస్తే మెల్లగా తగ్గుతుంది ఏమి కాదని భరోసా ఇచ్చారు. చేతులకు నరాలు అందకపోవడంతో ఐవిలు నేరుగా మజిల్ కి ఇంజెక్ట్ చేయడం వల్ల డిశ్చార్జి నాటికి చేతులు కనీసం కదపలేని పరిస్థితికి వచ్చాయి. క్రమంగా వాపులు తగ్గుతాయి వారం తర్వాత రమ్మని పంపేశారు. బిల్స్ క్లియర్ చేసి ఇంటికి తీసుకెళ్లాక ఒళ్ళంతా దద్దుర్లు, సిలైన్లు పెట్టిన చోట వాపు వచ్చాయి. సెల్యులైటిస్ గా మరి క్రమంగా అవి నీటి బొబ్బలుగా మారిపోయాయి. మర్నాడు ఆస్పత్రికి వచ్చి ట్రీట్ మెంట్ ఇచ్చిన డాక్టర్ ని అడిగితే అవి చర్మ సంబంధిత సమస్యలు అని., తమ దగ్గర ఆ వైద్యులు ఉండరని వేరే వైద్యులకు సిఫార్సు చేశారు. అక్కడకు వెళితే చర్మ వ్యాధుల నిపుణుడు ఓ జెల్ ఇచ్చి ఒకే అని పంపేశారు. మరుసటిరోజు కి చేయి కదపలేని పరిస్థితి వచ్చింది. మొదటి సారి ఆస్పత్రిలో చేరినప్పటి కంటే దారుణంగా తయారైంది పరిస్థితి. చేతులకు ఇన్ఫెక్షన్ సోకి అవి నీటి బొబ్బలుగా మారి చూడ్డానికి భయానకంగా తయారైంది. డిశ్చార్జి తర్వాత నేను కర్ణాటక వెళ్లడం ఆమె పరిస్థితి క్రిటికల్ గా మారడంతో నేను అక్కడి నుంచి నేరుగా ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకు రావడం, వారు ఆమెను మళ్ళీ తీసుకు రమ్మనడంతో నవంబర్ 22న మళ్ళీ ఆస్పత్రిలో చేర్చాము.
రోగానికి తోడు మరో రోగం….
రెండు చేతులకి ఇన్ఫెక్షన్ తీవ్రం అవడంతో సీనియర్ సర్జన్ పలు దఫాలుగా శస్త్ర చికిత్స ద్వారా చేతులలో ఇన్ఫెక్షన్ సరి చేయాల్సి వచ్చింది. శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుండటంతో పేషేంట్ నీడిల్ అంటేనే భయపడే పరిస్థితి కి వచ్చింది. చివరకి సర్జన్, అనస్తీషియా నిపుణుడు భరోసా ఇవ్వడంతో శస్త్ర చికిత్సతో సమస్య అదుపులోకి వచ్చింది. ఆమె డయాబెటిక్ కాకపోవడం వల్ల మళ్ళీ శరీరం అదుపులోకి వచ్చింది, లేకుంటే రెండు చేతులు తీసేయాల్సి వచ్చేదని సీనియర్ సర్జన్ సెలవిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎవరిదో తెలిసినా ఏమి అనలేని పరిస్థితి… ఆస్పత్రిలో నర్సింగ్ సిబ్బంది అవగాహనా లోపమా, వాడిన పరికరాల లోపమా, వాడిన సెలైన్లు కలుషితం అవ్వడమా, అపరిశుభ్ర వాతావరణమా ఇలా తప్పు ఒప్పులు మాట్లాడి చర్చించలేని రోగి బంధువుల అసహాయతే అసలు సమస్య. రోగికి వైద్యం ప్రాణ సంకటంగా మార్చినా., రోగం కుదరాలంటే ఇలాంటి గండాలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో దాటాల్సి ఉంటుంది. కొసమెరుపు ఏమిటంటే మీరు మొదట వచ్చిన సమస్య పరిష్కారం అయ్యింది., ఇది తర్వాత తలెత్తిన సమస్య అని ఓ వైద్యుడు చెప్పగానే రోగం పాపం…. రోగి లాభం….. అంతా మన కర్మ అనుకోవాలి. కార్పొరేట్ ఆస్పత్రుల మీద రోగుల బంధువులు ఎందుకు దాడులు చేస్తారో అప్పుడు అర్థం అయ్యింది. ఊపిరి ఆడక ఆస్పత్రికి వెళితే రెండు విడతల్లో రెండున్నర లక్షల ఖర్చుతో బయటకు రావాల్సి వచ్చింది. డబ్బులు దండుకునే కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఈ విపత్కర సమయంలోనైనా మానవతా థృక్ఫధంతో చూడాల్సి ఉంది.