ఇక ప్రయివేట్ కి ద్వారాలు … ?
కరోనాపై పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైరస్ పరీక్షలు నుంచి చికిత్స వరకు ఇప్పటివరకు దేశంలో కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే వైరస్ ఇప్పట్లో కట్టడి సాధ్యం కాదు అని [more]
కరోనాపై పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైరస్ పరీక్షలు నుంచి చికిత్స వరకు ఇప్పటివరకు దేశంలో కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే వైరస్ ఇప్పట్లో కట్టడి సాధ్యం కాదు అని [more]
కరోనాపై పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైరస్ పరీక్షలు నుంచి చికిత్స వరకు ఇప్పటివరకు దేశంలో కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే వైరస్ ఇప్పట్లో కట్టడి సాధ్యం కాదు అని తేలిపోయింది. దీనితో దీర్ఘ కాల సహవాసం తప్పదని తేలడంతో లాక్ డౌన్ పై నిబంధనలు వరుసగా సడలిస్తూ రావడంతో ప్రైవేట్ వైద్యులు ఓపీ మొదలు పెట్టారు. అయితే ప్రయివేట్ వైద్యులకు వైద్యం చేయడం కత్తిమీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరికి వైరస్ ఉంది ఎవరికి లేదో టెస్ట్ లు చేస్తే కానీ నిర్ధారణ కాదు. అలాంటి స్థితిలో రోగులకు వైద్యం చేయడం వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రాణాంతకమే.
అనుమతి ఉన్నా లేకున్నా తప్పదు …
కానీ గత రెండు నెలలుగా అత్యాధునిక ఆసుపత్రులు సైతం బంద్ చేసుకుని కూర్చొవాలిసి వచ్చింది. సాధారణ జ్వరం, జలుబు, తుమ్ములు, దగ్గులతో పేషేంట్స్ వస్తే అంతా హడలి పోతున్నారు. చాలా మంది జ్వరం వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటూ కూడా బోర్డు లు సైతం తగిలించాయి. వచ్చే ప్రతి రోగి ని శానిటైజ్ చేసే ఒపి చూస్తున్నారు. అది కూడా తక్కువ సంఖ్యలోనే. ఇక ప్రధాన వైద్యులు రోగులను టచ్ చేయకుండానే లక్షణాలను బట్టి చికిత్స అందించడం మందులు రాసిచ్చి పంపిస్తున్నారు. అత్యవసరం అయితే కానీ ఇన్ పేషేంట్ లుగా చేర్చుకోవడం లేదు.
హాస్పిటల్స్ నిర్వహించాలి అంటే ….
ఇలా నడుస్తున్న ప్రైవేట్ వైద్య వ్యవస్థ ఇక పై ముందుకు వెళ్ళాలి అంటే వైరస్ తో ప్రయాణం చేయకతప్పదు. లేదా ప్రాక్టీస్ మూసుకుని కూర్చోవాలి. దాంతో వైరస్ సోకిన వారికి చికిత్స అందించకపోయినా వ్యాధి నిర్ధారణ చేసి ప్రభుత్వానికి వచ్చిన వారిని అప్పగించాలి లేదా వారే చికిత్స అందించాలి. ఇది చేయాలంటే ఎన్ని ఆసుపత్రులకు ఈ సౌకర్యాలు ఉన్నాయన్నది ప్రభుత్వాలు గుర్తించాలిసి ఉంది. మరోపక్క ప్రయివేట్ ఆసుపత్రుల్లో వైరస్ కి చికిత్స అంటే ఆస్తులు అమ్ముకుని అడుక్కు తినాలిసివస్తుందేమో అన్న భయం ప్రజల్లో బాగా ఉంది.
మా గతేమి కాను …
నిరుపేదలకు ఆరోగ్యశ్రీ వంటి సౌకర్యాలు ఉన్నా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు మాత్రం ప్రైవేట్ కి అప్పగిస్తే ఇక ఇంతే సంగతులు అన్న ఆందోళన లో ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారికి ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి వైద్యం అందించి వారు కోలుకున్న తరువాత ఇంటికి పంపిస్తుంది. దీనికి ఒక్కరూపాయి ఎవ్వరు ఖర్చు చేయాలిసిన పని లేకుండా ఉంది. అయితే ఇకపై ఆ అవకాశం ఉండదన్న చర్చ నడుస్తుంది. అయితే లాక్ డౌన్ నిబంధనలు క్రమంగా ఎత్తివేస్తూ ఉండటంతో రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మోతెక్కిపోతుందన్నది నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం అంటే ఇకపై సాధ్యం కాని పరిస్థితి. దాంతో ప్రయివేట్ వైద్యులకు చికిత్స కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పదని తేలిపోతుంది.