కరోనా….. రాజకీయం అయిపొయిందిగా ?
హైదరాబాద్ లో వైరస్ మహమ్మారి మాములుగా లేదు. అయితే దేశంలో మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అంత ఆందోళనకరం కాదనే చెప్పొచ్చు. ముంబయి, ఢిల్లీ, చెన్నయి [more]
హైదరాబాద్ లో వైరస్ మహమ్మారి మాములుగా లేదు. అయితే దేశంలో మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అంత ఆందోళనకరం కాదనే చెప్పొచ్చు. ముంబయి, ఢిల్లీ, చెన్నయి [more]
హైదరాబాద్ లో వైరస్ మహమ్మారి మాములుగా లేదు. అయితే దేశంలో మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అంత ఆందోళనకరం కాదనే చెప్పొచ్చు. ముంబయి, ఢిల్లీ, చెన్నయి లలో పాజిటివ్ కేసుల సంఖ్య మోతెక్కిపోతుంది. కానీ టెస్ట్ ల సంఖ్య ఇప్పటివరకు అల్పంగా ఉన్న తెలంగాణ లో కరోనా కలకలం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఈ నేపథ్యంలోనే భాగ్యనగరం కేంద్రంగా కేసీఆర్ పై విపక్షాలు విజృంభణ మొదలు పెట్టేశాయి.
మజ్లిస్ వత్తిడితో కొంప ముంచారా …?
కరోనా మొదలైన నాటినుంచి జాతీయ స్థాయిలో ప్రజల్లో చైతన్యం నింపిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి. అయితే తరచూ మీడియా ముందుకు వచ్చి ప్రచారం హోరెత్తించిన గులాబీ బాస్ కేసీఆర్ కార్యాచరణలో మాత్రం చాలా రాష్ట్రాల కన్నా వెనుకబడే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ లలో టి సర్కార్ విఫలం అయ్యిందనే ఆరోపణలు బాగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కొంత స్తబ్దతతగా ఉన్న బిజెపి సైతంకేసీఆర్ పై నేరుగా దాడి మొదలు పెట్టేసింది. మజ్లీస్ వత్తిడితోనే కేసీఆర్ టెస్ట్ లు పెద్ద ఎత్తున చేయకుండా పాజిటివ్ కేసులను తొక్కిపెట్టరని కేంద్ర హోం శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.
టీఆర్ఎస్ వెర్సెస్ బిజెపి …
మర్కజ్ లింక్ లు బయటపడ్డాకా హైదరాబాద్ లో భారీ సంఖ్యలో టెస్ట్ లు చేయాలిసింది పోయి కేసీఆర్ నిర్లిప్తత వహించారన్న ఆరోపణలకు టిఆర్ఎస్ గట్టిగా కౌంటర్ లు విసరలేకపోతోంది. అదీగాక బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసమే దేశంలో అనేక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తీవ్రంగా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వాన్నే టార్గెట్ చేయడం ఏమిటని గులాబీ వర్గాలు మండిపడుతున్నాయి. ఇదాంతా కేంద్రం అప్పులపై సైతం షరతులు పెట్టడం కేంద్ర నిధుల విడుదలలో ఇరు ప్రభుత్వాల నడుమ సాగుతున్న అంతర్గత యుద్ధం ఇప్పుడు బహిర్గతంగా మారింది. మొత్తానికి వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ లో మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ వెర్సెస్ బిజెపి కరోనా రాజకీయం జోరందుకుంది.