నలిగిపోతున్నారుగా
కరవ మంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోసం ఇలా ఉంది శాసనసభ అధికారులది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. [more]
కరవ మంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోసం ఇలా ఉంది శాసనసభ అధికారులది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. [more]
కరవ మంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోసం ఇలా ఉంది శాసనసభ అధికారులది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక సెలెక్ట్ కమిటీ అవసరం లేదని అధికార పార్టీ వాదిస్తుంది. ఈ మేరకు శాసనమండలి వైసీపీ పక్ష నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఛైర్మన్ షరీఫ్ కు లేఖలు రాశారు. కానీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాల్సిందేనంటోంది.
పది రోజులవుతున్నా….?
అధికార వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ షరీఫ గత నెల 22వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. అయితే పది రోజులు దాటుతున్నా ఇప్పటి వరకూ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదు. సెలెక్ట్ కమిటీకి పేర్లను పంపాలని వివిధ పార్టీలకు లేఖలు సయితం ఇంకా అందలేదు. దీనికి కారణం శాసనమండలి అధికారులే. పేర్లను సిఫార్సు చేయాల్సిందిగా పార్టీలకు లేఖలు పంపాలని అధికారులను ఛైర్మన్ ఆదేశించినా ఇంతవరకూ పనికాలేదు.
అధికార పక్షం హెచ్చరికలతో…..
తెలుగుదేశం పార్టీ మాత్రం రెండు కమిటీలకు ఐదేసి పేర్లు చొప్పున పేర్లను పంపింది. మిగిలిన పార్టీల నుంచి పేర్లు వస్తే తప్ప సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవసరం లేదని, శాసనమండలినే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక సెలెక్ట్ కమిటీతో పనేంటని అధికార పక్షం శాసనమండలి అధికారులను తమ నియంత్రణలోకి తెచ్చిపెట్టుకుంది. దీంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.
ఏమీ చేయలేని స్థితిలో…..
అయితే శాసనమండలి అధికారులు ఛైర్మన్ ఆదేశాలను థిక్కరిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో శాసనమండలి అధికారులు ఏం చేయలేక తలలుపట్టుకుంటున్నారు. స్వయంగా ఛైర్మన్ షరీఫ్ ను కలసి తమ పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారమే వెళ్లాలని షరీఫ్ సూచించినా అధికార పక్షం నుంచి పరోక్ష హెచ్చరికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య అధికారులు నలిగిపోతున్నారు. సెలెక్ట్ కమిటీ విషయంలో మాత్రం ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.