అంతా పక్కా వ్యూహమే … త్రి క్యాపిటల్ ఇష్యూ వెనుక?
వైసిపి సర్కార్ మూడు రాజధానులపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పక్కా వ్యూహంతోనే వ్యవహరించారు. ముందు నుంచి చంద్రబాబు అమరావతి హడావిడి పై బిజెపి కి అస్సలు నచ్చలేదు. [more]
వైసిపి సర్కార్ మూడు రాజధానులపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పక్కా వ్యూహంతోనే వ్యవహరించారు. ముందు నుంచి చంద్రబాబు అమరావతి హడావిడి పై బిజెపి కి అస్సలు నచ్చలేదు. [more]
వైసిపి సర్కార్ మూడు రాజధానులపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పక్కా వ్యూహంతోనే వ్యవహరించారు. ముందు నుంచి చంద్రబాబు అమరావతి హడావిడి పై బిజెపి కి అస్సలు నచ్చలేదు. ఎన్డీయే లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఎదో మొక్కుబడిగా ప్రారంభోత్సవానికి విచ్చేశారు మమ అనేశారు. అయితే రాజధాని ఎంపికలో ఏ మాత్రం కేంద్రం సూచనలను పరిగణలోకి చంద్రబాబు నాడు పరిగణలోనికి తీసుకోలేదు. శివరామ కృష్ణన్ కమిషన్ రిపోర్ట్ అయితే చెత్త బుట్టలో పడేశారు. రాజధాని ఎక్కడ ఉండాలి ? ఎలా కట్టుకోవాలి అనేది పూర్తిగా రాష్ట్రప్రభుత్వ నిర్ణయం ఇందులో కేంద్రం జోక్యం అస్సలు సహించేది లేదన్న ధోరణిలో వెళ్లారు. అసలు రాజధాని ఎక్కడ పెడుతున్నారో ఆయన కోటరీకి తప్ప ఎవరికి తెలియకుండా అదిగో ఇక్కడా అక్కడా అంటూ లీకులు వదిలారు. చాలామంది ఈ లీకులు నమ్మి తీవ్రంగా నష్టపోయారు కూడా.
ఎవరితో చర్చింది ఏది …?
ఏ రాజకీయ పక్షం అభిప్రాయం కూడా తీసుకోకుండా ఎవరి అభిప్రాయాలు పరిగణలోనికి తీసుకోకుండా చంద్రబాబు తాను అనుకున్నదే అమలు చేశారు. దొనకొండ, నూజివీడు అంటూ చివరకు ఎవరు ఊహించని ప్రాంతంలో 33 వేల ఎకరాలు సేకరించి ఇదే అమరావతి ఆంధ్రుల కలల రాజధాని అని తేల్చేశారు. దీనిపై అనేక విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు చంద్రబాబు. అమరావతికి 50 నుంచి వందేళ్ళ ప్రణాళిక అని ప్రకటించారు. ప్రపంచంలో అత్యుత్తమ నగరాల పేర్లన్నీ చెప్పి వీటికి మించి కట్టేస్తామన్నారు బాబు దీనికి లక్షల కోట్ల రూపాయలు అవసరమన్నారు. అమరావతి ప్రాంతంలో రైతులను సింగపూర్ సైతం పంపి వారిని భ్రమల్లో భ్రమింప చేశారు బాబు.
మోడీ ని ఛీ కొట్టాక…
ఎప్పటిలాగే తమ పార్టీ పై వచ్చిన వ్యతిరేకతను ప్రధాని మోడీ పై టర్న్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు. తాను ఎంతో చేద్దామనుకుంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏమి చేయడానికి సహకారం ఇవ్వలేదంటూ ధర్మపోరాటం అంటూ నాలుగేళ్ళు కలిసి కాపురం చేశాక రోడ్డెక్కారు బాబు. చంద్రబాబు అంచనా వేసినట్లే బిజెపి కి ఈ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది. ఒక్క శాతానికి ఆ పార్టీ ఓటు బ్యాంక్ పడిపోయింది. అయితే కమలం తో పాటు చంద్రబాబు తన అబద్ధాలకు ఎన్నికల్లో తుక్కయిపోయారు.
మోడీ చుక్కలు చూపించారు …
కట్ చేస్తే రాష్ట్రంలో బిజెపి కి సీన్ లేకపోయినా కేంద్రంలో అధికారంలోకి రెండోసారి వచ్చారు నరేంద్ర మోడీ. అంతే అప్పటినుంచి టిడిపికి కష్టాల్లో కష్టం ముందే తెలిసిపోయింది. అనుకున్నట్లే చంద్రబాబు కి చుక్కలు చూపించాలంటే ఏమి చేయాలో అది చేస్తే చాలని మోడీ టీం డిసైడ్ అయిపొయింది. దీనికి ముఖ్యమంత్రి జగన్ ఆలోచన మరింత తోడ్పడింది. వైసిపి సర్కార్ ఆలోచన కు దీవెనలు ఇస్తే చాలు కాగల కార్యం గంధర్వులు నెరవేరుస్తారు. అమరావతి కలను విచ్ఛిన్నం చేయడంతో టిడిపి ని తొలి దెబ్బ తీసినట్లు అవుతుందని బిజెపి లెక్క. అనుకున్నట్లే జగన్ గత ఏడు నెలలుగా మూడు రాజధానుల ప్రయత్నం అనేక అడ్డంకులు ఎదుర్కొంది.
మూడు రోజులు …
చివరి అంకంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సహకారం అందించాలో గవర్నర్ అంతా చేసేసారు. శుక్రవారం సాయంత్రం గవర్నర్ బిల్లులు ఆమోదిస్తే శనివారం, ఆదివారం సెలవులు కనుక హై కోర్టు గుమ్మం సోమవారం వరకు తట్టే వీలు లేదు. ఈలోగా కొన్ని పనులను ఎపి సర్కార్ చక్కబెట్టేస్తుంది. అదే చేశారు గవర్నర్. దీనికి ముందు ఎపి బిజెపి లో అడ్డుపడుతున్న కన్నా లక్ష్మీనారాయణ, సుజనా లకు చెక్ పెట్టేసింది కమలం అధిష్టానం. ఇలా అన్ని పక్కా వ్యూహంతోనే వైసిపి సర్కార్ కి బిజెపి పూర్తి సహకారం అందించడం వల్లే మూడు రాజధానుల బిల్లు లకు ఒకే అయిపొయింది.