ఈసారి ఆ కాంతులు లేవు
దీపావళి పండగ పేరు వినపడగానే అందరి ముఖాల్లో కాంతులు విరాజిల్లుతాయి. బాణాసంచా సందడితో పిల్లా పాపా ఆనందంగా సంబరాలు జరుపుకునే దీపావళి ప్రతి ఏటా కాంతివిహీనంగా మారుతుంది. [more]
దీపావళి పండగ పేరు వినపడగానే అందరి ముఖాల్లో కాంతులు విరాజిల్లుతాయి. బాణాసంచా సందడితో పిల్లా పాపా ఆనందంగా సంబరాలు జరుపుకునే దీపావళి ప్రతి ఏటా కాంతివిహీనంగా మారుతుంది. [more]
దీపావళి పండగ పేరు వినపడగానే అందరి ముఖాల్లో కాంతులు విరాజిల్లుతాయి. బాణాసంచా సందడితో పిల్లా పాపా ఆనందంగా సంబరాలు జరుపుకునే దీపావళి ప్రతి ఏటా కాంతివిహీనంగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం కాలుష్యం. సంప్రదాయ బాణాసంచా స్థానంలో విషతుల్యమైన కెమికల్స్ జోడించిన చైనా తయారీ టపాసులు నేడు భారత్ ను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా శబ్దకాలుష్యం, వాయుకాలుష్యంతో ప్రజలు దేశంలో అల్లాడి పోతున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు దీపావళి పై జనహితాన్ని కాంక్షిస్తూ కొన్ని ఆంక్షలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి సైతం విలువైన ఆదేశాలు జారీ చేసింది. పండగను రెండు గంటలు మాత్రమే జరుపుకోవాలని అలాగే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని సుప్రీం ఆదేశించింది.
సందడి లోని శివకాశి …
దేశంలో బాణాసంచా తయారీలో తమిళనాడు లోని శివకాశి కి ప్రత్యేక స్థానం వుంది. శివకాశి పరిశ్రమల నుంచి 95 శాతం బాణాసంచా దేశంలో వివిధ ప్రాంతాల వారు వినియోగిస్తారు. ఇక్కడి పరిశ్రమ పై ఆధారపడి 20 నుంచి 30 వేలమంది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాదిమంది ఆధారపడుతున్నారు. అయితే ఈసారి బాణాసంచా ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దాంతో టపాసుల ధరలు చుక్కలు అంటుతున్నాయి. కారణం కేంద్రం విధించిన ఆంక్షలు. గ్రీన్ క్రాకర్స్ కు మాత్రమే ప్రస్తుతం కేంద్రం అనుమతులు ఇచ్చింది. తక్కువ స్థాయిలో శబ్ద, వాయుకాలుష్యాలు ఉండేలా ఈ క్రాకర్స్ ను తయారు చేయాలిసి వుంది. దేశవ్యాప్తంగా 1600 ల యూనిట్ల కు బాణాసంచా తయారీ లైసెన్స్ లు ఉండగా అందులో గ్రీన్ క్రాకర్స్ తయారీకి కేవలం 350 కి మాత్రమే అనుమతి వుంది. ఈ నేపథ్యంలో క్రాకర్స్ ఉత్పత్తి బాగా మందగించింది. దీనికి తోడు ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలు, ఆర్ధిక మాంద్యం ప్రభావంతో ప్రజల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లడం, ప్రభుత్వం కాలుష్యంపై చేస్తున్న ప్రచారం, ప్రజల్లో పెరిగిన చైతన్యం కలిసి గత వైభవ దీపావళి ని మసకబారేలా చేశాయి.
మార్కెట్ ను ఆక్రమిస్తున్న చైనా ….
ప్రస్తుతం దేశంలో బాణాసంచా మార్కెట్ 20 వేలకోట్ల రూపాయలుగా అంచనా వుంది. దీనిలో 5 వేలకోట్ల రూపాయలు చైనా క్రాకర్స్ మార్కెట్ కావడం గమనార్హం. మన దేశ బాణాసంచా తయారీలో చైనా ఉత్పత్తులు ఎలా దూసుకుపోతున్నాయి ఈ లెక్కలు చెబుతున్నాయి. అయితే అన్నిటా చైనా వస్తువులు తక్కువగా రావడంతో అలవాటు చేసుకున్న ప్రజలు ఒక్క విషయంలో అప్రమత్తంగా వుండాలని నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన హానికారకమైన రసాయనాలతో తయారయ్యే చైనా క్రాకర్స్ కి అంతా చెక్ పెట్టకపోతే అటు పర్యావరణానికి ఇటు ప్రాణాలకు అపాయమని హెచ్చరిస్తున్నారు. క్రాకర్స్ కాల్చే వారు పర్యావరణ హితంగా వుండే వాటిని తక్కువ శబ్ద, వాయు కాలుష్యాలు వున్న వాటినే వినియోగించాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకు సంప్రదాయ బాణాసంచా వినియోగం అత్యుత్తమని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే భారీగా తగ్గిన ఉత్పత్తి పెరిగిన ధరలతో సగానికి సగం దీపావళి సేల్స్ పడిపోవడం ఖాయమని మార్కెట్ వర్గాల అంచనా.