మిస్టర్ కూల్ జై జవాన్ గా
ప్రపంచ క్రికెట్ లో టీం ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ది ప్రత్యేక స్థానం. తన బ్యాటింగ్, కీపింగ్ తో అద్భుత విన్యాసాలు చేసి [more]
ప్రపంచ క్రికెట్ లో టీం ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ది ప్రత్యేక స్థానం. తన బ్యాటింగ్, కీపింగ్ తో అద్భుత విన్యాసాలు చేసి [more]
ప్రపంచ క్రికెట్ లో టీం ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ది ప్రత్యేక స్థానం. తన బ్యాటింగ్, కీపింగ్ తో అద్భుత విన్యాసాలు చేసి టీం ఇండియా కు అనేక విజయాలు అందించిన ధోని ఇప్పుడు సరికొత్త రూపంలో తన అభిమానుల మనసు దోచాడు. టీం ఇండియా ను అన్ని ఫార్మాట్ లలో నెంబర్ వన్ గా నిలిపిన మిస్టర్ కూల్ ఆర్మీ కి సేవలు అందించేందుకు ముందుకు రావడం యువతలో ఆయనపట్ల వున్న క్రేజ్ ను మరింత గా పెంచింది.
ధోని అరుదైన క్రికెటర్ ….
వికెట్ కీపర్ గా మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి దిగే ధోని టెస్ట్ లలో 4876, వన్డేలలో 10773, టి ట్వంటీలలో 1617 పరుగులు చేశాడు. ఇక టెస్ట్ లలో ఆరు వన్డేలలో 10 సెంచరీలతో మొత్తం 16 సెంచరీలు తనపేరిట నమోదు చేసుకున్నాడు. కీపింగ్ లోను ధోని అద్భుత రికార్డ్ లే సొంతం చేసుకున్నాడు. టెస్ట్ లలో 256 క్యాచ్ లను మూడు రన్ అవుట్స్, 38 స్టంప్ అవుట్స్ చేయగా, వన్డేల్లో 321 క్యాచ్ లు 22 రన్ అవుట్స్, 123 స్టంప్స్ టి ట్వంటీలలో 57 క్యాచ్ లు 8 రన్ అవుట్స్, 34 స్టంప్ అవుట్స్ చేసి తన సత్తా తో టీం ఇండియాకు అనేక విజయాలు అందించిన క్రికెటర్.
ఆర్మీలో సత్తా చాటేందుకు రెడీ …
మిగిలిన వారికన్నా విభిన్నమైన ధోరణితో వుండే ధోని ఇప్పుడు ఆర్మీలో తన సత్తా చాటేందుకు రెడీ అయిపోయాడు. ధోని కీపింగ్ చేపడితే వికెట్ల వెనుక పాదరసంలా కదిలేవాడు. అదే బ్యాటింగ్ లో అత్యంత వేగంగా వికెట్ల నడుమ పరిగెత్తుతూ ఒకటికి రెండు రన్స్ దీయడంలో దిట్ట. అలాంటి ఇండియన్ స్టార్ క్రికెటర్ అత్యంత కఠినమైన ప్యారాచూట్ రెజ్మెంట్ ను ఆర్మీలో ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. వెస్ట్ ఇండీస్ టూర్ కి తాను అందుబాటులో వుండబోనని ముందే ప్రకటించిన మిస్టర్ కూల్ ఆర్మీకి దరఖాస్తు చేసుకున్నాడు.
ఆర్మీ దుస్తులతో…..
ధోని విజ్ణప్తిని ఆర్మీ ఆమోదించింది. ఆ వెంటనే ధోని రంగంలోకి దిగిపోయాడు. కాశ్మీర్ లోని ఆర్మీ విభాగంలో ఆర్మీ దుస్తులతో దర్శనమిచ్చిన మాజీ కెప్టెన్ తన అపార దేశభక్తిని చాటుకున్నాడు. క్రికెట్ లో తనదైన బ్యాటింగ్ కీపింగ్ తో అందరిని అలరించిన ఎంఎస్ ఆర్మీలో ఎలా రాణిస్తాడన్న ఆసక్తి అందరిలో వుంది. టీం ఇండియా లో వన్డే, టి ట్వంటీ లలో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆస్థానం లో ఆడేందుకు యువ క్రికెటర్లు క్యూలో వున్నారు. ఇంకా ఫిట్ నెస్ ఏ మాత్రం తగ్గని ధోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని అంతా వేచిచూస్తున్న తరుణంలో జవాన్ గా మారడం తో మిస్టర్ కూల్ భవిష్యత్తుపై మరింత ఫోకస్ పెరిగిపోవడం విశేషం.