ఊగిసలాట… మొగ్గు ఎటువైపో…??
కర్ణాటక రాజకీయాలు హీటెక్కాయి. ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు ఆడియో టేపుల కలకలం… మరోవైపు బేరసారాలతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా రెండు పార్టీల్లో అలజడి రేపుతున్నాయి. [more]
కర్ణాటక రాజకీయాలు హీటెక్కాయి. ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు ఆడియో టేపుల కలకలం… మరోవైపు బేరసారాలతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా రెండు పార్టీల్లో అలజడి రేపుతున్నాయి. [more]
కర్ణాటక రాజకీయాలు హీటెక్కాయి. ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు ఆడియో టేపుల కలకలం… మరోవైపు బేరసారాలతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా రెండు పార్టీల్లో అలజడి రేపుతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, అధికారాన్ని కాపాడుకోవాలన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ఉంటుందా? దిగిపోతుందా? అన్న చర్చ దేశ వ్యాప్తంగా ప్రారంభమయింది.
అతి కొద్ది మెజారిటీతో….
అతి కొద్ది మెజారిటీతో కర్ణాటకలోని సంకీర్ణ సర్కార్ డోలాయమానంలో ఉంది. కర్టాటకలో సంకీర్ణంలో ఉన్న రెండు పార్టీలకు కలిపి పెద్దగా బలమేమీ లేదు. మరోవైపు బీజేపీ కూడా గత ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కు ఎనిమిది అడుగుల దూరంలోనే ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి 80 మంది సభ్యులు, జనతాదళ్ ఎస్ కు 38 సభ్యులు ఉన్నారు. సంకీర్ణ కూటమి బలం నిన్న మొన్నటి వరకూ 118 మంది సభ్యుల బలం ఉండేది. అయితే గత కొంతకాలంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వ బలం కుదించుకుపోయింది. దీంతో ముఖ్యమంత్రి కుమార స్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎప్పుుడు ఏమైనా….?
కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు పట్టారు. రమేష్ జార్ఖిహోళి, మహేష్ కుమటహళ్లి, నాగేంద్ర, ఉమేష్ జాదవ్ లు కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా గుడ్ బై చెప్పినట్లే. వీరు సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. దీంతో 118 మంది బలం ఉన్న సంకీర్ణ సర్కార్ 114కు పడిపోయింది. భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతానికి 104 మంది సభ్యుల బలం ఉంది. వీరికి మరో ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు తెలపడంతో బీజేపీ 106కు చేరుకుంది. దీంతో బేరసారాలను బీజేపీ ముమ్మరం చేసిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. మరో 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అధిష్టానానికి టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద కర్ణాటకలో ఎప్పుుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
- Tags
- amith shah
- b.s. yadurppa
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- ఠమితౠషా
- à°à°°à±à°£à°¾à°à°
- à°à±à°®à°¾à°°à°¸à±à°µà°¾à°®à°¿
- à°à°¨à°¤à°¾à°¦à°³à±
- à°¦à±à°µà±à°à±à°¡
- నరà±à°à°¦à±à°° à°®à±à°¦à±
- బి.à°à°¸à±.యడà±à°¯à±à°°à°ªà±à°ª
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- సిదà±à°§à°°à°¾à°®à°¯à±à°¯
- à°¿karnataka