ఆ… స్టిక్కర్లతో ముప్పు.. ప్రత్యామ్నాయం చూడాల్సిందేనా?
ఒంగోలు క్యాష్ కోట్ల లో చెన్నై లో దొరికింది. అది ఎవరిది అనే చర్చ ఒక రోజంతా ప్రసారమాధ్యమాల్లో నడిచింది అంటే ఒక ఎమ్యెల్యే స్టిక్కర్ దానికి [more]
ఒంగోలు క్యాష్ కోట్ల లో చెన్నై లో దొరికింది. అది ఎవరిది అనే చర్చ ఒక రోజంతా ప్రసారమాధ్యమాల్లో నడిచింది అంటే ఒక ఎమ్యెల్యే స్టిక్కర్ దానికి [more]
ఒంగోలు క్యాష్ కోట్ల లో చెన్నై లో దొరికింది. అది ఎవరిది అనే చర్చ ఒక రోజంతా ప్రసారమాధ్యమాల్లో నడిచింది అంటే ఒక ఎమ్యెల్యే స్టిక్కర్ దానికి ఉండటమే. ఆ స్టిక్కర్ పై ఏపీ లోని అధికార పార్టీ ఎమ్యెల్యే స్టిక్కర్ కావడం ఇంతటి సంచలనానికి రీజన్. దీనిపై కూడా విచారణ చేస్తే అది డూప్లికేట్ గా తేలింది. కలర్ జిరాక్స్ తో ఈ స్టిక్కర్ రూపొందించినట్లు అధికారులు గుర్తించారు. ఈ విధమైన కలర్ జిరాక్స్ లు ఇటీవల కాలంలో విచ్చలవిడిగా వాహనాలపై దర్శనమిస్తున్నాయి.
అవే ఎక్కువ కన్పిస్తున్నాయి….
ముఖ్యంగా ఎమ్యెల్యే అనే స్టిక్కర్ లు ఎంపీలు కన్నా ఎక్కువే కనిపిస్తాయి. అయితే ఆ వాహనాల్లో ఎమ్యెల్యేలు కనిపించేది అరుదే. ఇక ఎమ్యెల్యే స్టిక్కర్ అంటించుకున్న కారు యజమాని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తో సన్నిహితంగా ఉన్న వ్యాపారి కావడంతో బురద ఆయనకు అంటించే ప్రయత్నం వేగంగా జరిగిపోయింది. అది తుడుచుకోవడానికి ఆయన నానా తిప్పలు పడాలిసి వచ్చింది.
పరిశీలించేవారు ఏరి … ? పట్టుకునేవారు ఎవరు ?
సాధారణంగా వివిఐపి లను గుర్తించేందుకు టోల్ గేట్ల దగ్గర వారికి ప్రోటోకాల్ ఇచ్చేందుకు ఉద్దేశించిన స్టిక్కర్లు చాలా కాలంగా దుర్వినియోగం అవుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి స్టిక్కర్లు చూసి చూడనట్లు అధికార యంత్రాంగం వెళ్లిపోవడానికి కారణం వారితో మనకెందుకు వచ్చింది అనే నిర్లక్ష్యం. పర్యవసానంగా ఎప్పుడైనా అసాంఘిక కార్యక్రమాల్లో ఇలాంటి డూప్లికేట్ స్టిక్కర్లతో దొరికే వాహనాల కారణంగా ఎంపీ, ఎమ్యెల్యేలు బద్నాం అయిపోతున్నారు.
డ్యామేజీ జరిగిపోతుంది…..
నాది కాదు బాబూ అనే లోగా జరగాలిసిన డ్యామేజ్ జరిగిపోతుండటం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా స్టిక్కర్ల విధానం బదులు ప్రత్యామ్నాయ గుర్తింపు ని ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులకు ఇస్తే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తుంది. లేని పక్షంలో గంజాయి, అక్రమ మద్యం, సారా, బ్లాక్ మని ఇతర అనేక కార్యక్రమాలు చేసేవారు దర్జాగా దొరికే వరకు తిరిగే అవకాశం అయాచితంగా లభిస్తుంది.