దాడికి ఉక్కబోత తప్పేట్లు లేదే
రాజకీయాల్లో పార్టీల కంటే కూడా వ్యక్తిగత సంబంధాలే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ రకమైన విభేదాలు శత్రుత్వం వల్ల ఒకరు ఓ పార్టీలో ఉంటే మరొకరు ఇంకో [more]
రాజకీయాల్లో పార్టీల కంటే కూడా వ్యక్తిగత సంబంధాలే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ రకమైన విభేదాలు శత్రుత్వం వల్ల ఒకరు ఓ పార్టీలో ఉంటే మరొకరు ఇంకో [more]
రాజకీయాల్లో పార్టీల కంటే కూడా వ్యక్తిగత సంబంధాలే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ రకమైన విభేదాలు శత్రుత్వం వల్ల ఒకరు ఓ పార్టీలో ఉంటే మరొకరు ఇంకో పార్టీలో ఉంటారు. అయితే ఏకశిలా సదృశ్యంలా రాజకీయాలు మారిపోతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీయే శరణ్యమని ఆ వైపుగా నేతలు దూసుకువస్తుంటే అంతవరకూ అక్కడ ఉన్న వారికి చాప కిందకు నీళ్ళు వస్తాయన్న భయం సహజంగా ఉంటుంది. పార్టీ హైకమాండ్ కి మాత్రం అందరూ వస్తే పార్టీ బలోపేతం అవుతుందని ఆశ ఉంటుంది. అలా జరగాలని కోరుకుంటారు కూడా. అయితే రాజకీయ గణితంలో ఎపుడూ ఒకటి ఒకటి రెండు కావు, జీరో కూడా అవుతాయి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఇపుడు అదే జరుగుతోందనిపిస్తోంది. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుటుంబం మొత్తం వైసీపీలోకి చేరిపోవడంతో అందులో ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు ఉక్కబోత తప్పడంలేదని అంటున్నారు.
ఒకపుడు ఒకే పార్టీలో….
ఒకప్పుడు దాడి వీరభద్రరావు, ఆడారి కుటుంబంఅంతా ఒకే పార్టీలో ఉండేవారు. టీడీపీలోనే దశాబ్దాలుగా రాజకీయం చేసిన ఈ కుటుంబాలు ఎపుడూ కూడా గ్రూపు ఫోటోలో కనిపించలేదని అంటున్నారు. దాడి వీరభద్రరావు మంత్రిగా టీడీపీలో పనిచేసినా కూడా పార్టీ పరంగా జిల్లాలో తెరవెనక ఆడారి తులసీరావు చక్రం తిప్పేవారంటారు. ఇక గత ఏడేళ్ళుగా దాడి టీడీపీకి దూరంగా ఉన్నారు. వైసీపీలో చేరి బయటకు వెళ్ళి మళ్లీ అదే పార్టీలో ఎన్నికలకు ముందు వచ్చి చేరారు. ఇపుడు పార్టీ కూడా అధికారంలో ఉన్నందువల్ల తనకు ఏదో పదవి దక్కుతుందని దాడి వీరభద్రరావు ఆశిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఆడారి కుటుంబం వైసీపీలోకి రంగప్రవేశం చేయడంతో దాడి వీరభద్రరావుకి ఏం తోచడంలేదని అంటున్నారు.
బలమైన నేపధ్యం…..
ఇక విశాఖ జిల్లాలో బలమైన గవర సామాజికవర్గం నుంచి అంగ బలం, అర్ధం బలం పుష్కలంగా కలిగిన ఆడారి కుటుంబం రావడంతో సహజంగానే హై కమాండ్ కి వారి మీదనే చూపు ఉంటుందని అంటున్నారు. పైగా జిల్లాలో ఉన్న పట్టుతో రాజకీయంగా ముందుకు దూసుకుపోయే ఆడారి కుటుంబం ఇపుడు వైసీపీలో హవా చలాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో ఎంపీ గా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆడారి ఆనంద్ ఇపుడు వైసీపీలో చురుకైన పాత్రకు రెడీ అవుతారని అంటున్నారు. జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన తరువాతనే ఆయన తాను ఏం కోరుకునేది చెబుతారని అంటున్నారు. దీంతో దాడి వీరభద్రరావు కుటుంబానికి ఇపుడు ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఆడారి కుటుంబం మొత్తం వైసీపీలో చేరిన సందర్భంగా జిల్లాకు చెందిన వైసీపీ నేతలంతా జగన్ వద్దకు వెళ్తే దాడి వీరభద్రరావు కుటుంబం మాత్రం దూరంగా ఉండిపోవడాన్ని బట్టి చూస్తే దాడి వీరభద్రరావు ఈ పరిణామాల పట్ల అసంత్రుప్తిగా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఆయన ఏ విధంగా బయటపడతారో.